top of page
Search

అమ్మమ్మ అమెరికా యాత్ర 6

  • murthydeviv
  • Feb 14
  • 2 min read

నా అమెరికా యాత్రలో మరుపురాని అందమైన అనుభవాల్లో ఒకటి ఇండియాలో లాగా పెళ్ళి చూపులు చూపించటం.

మా మేనకోడలు ఇండియా లో డాక్టర్ చదివి ఎమ్ డి చదవటానికి ఆమెరికా వెళ్ళింది. చికాగో లో ఉన్న మా చెల్లెలు కు తన ఫ్రెండ్ తెలిసిన డాక్టర్ కు అక్కడే వున్న డాక్టర్ అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమని అడిగిందట. మా చెల్లెలు వెంటనే అక్కడే వున్న నాకు, మా అన్నయ్య కు ఫోన్ చేసింది. ఆ అబ్బాయి వాళ్ళ అక్కయ్య ఫిట్స్ బర్గ్ దగ్గర గా వుండటం తో మా అమ్మాయి వాళ్ళింట్లో నే పెళ్ళి చూపులు చూపించటం జరిగింది. వాళ్ళ అమ్మ గారు నాన్న గారు విజయ వాడ లో డాక్టర్స్. పెళ్ళి ఇండియా లో జరిగినా అమెరికా లో నేను వున్నపుడు పెళ్ళి కుదరటం నాకు ఆనందంగా అనిపించింది. మా చెల్లెలు ఇండియా లో పిల్లలతో ఇండియాలో జరిగే పెళ్ళిళ్ళ కు చాలా సార్లు వచ్చింది. తన పిల్లలు ఇద్దరూ అబ్బాయి, అమ్మాయి కూడా ఆమెరికా లో పెరిగినా చాలా ప్రేమ గా ఉండేవారు అబ్బాయి పెళ్ళి మా అమ్మగారు వున్నారని ఇండియాలో నే చేశారు. ఆమ్మాయి పెళ్ళి అమెరికాలో అయింది. చికాగోలో వున్న స్వామి నారాయణ్ వాళ్ళ టెంపుల్ పక్కనే ఉన్న హాల్లో చేశారు ఆ హాలు చాలా గొప్పగా ఉంది. పెళ్ళి అంతా మన పద్ధతి ప్రకారం చేశారు నేను ఇండియా నుండి పెళ్ళి బుట్ట తో సహా అన్నీ తీసుకుని వెళ్ళాను. పెళ్లివారు మల్లెపూలు కూడా తెప్పించారు. ఇపుడు అంటే అన్ లైన్ లో ఆర్డర్ పెడితే అన్నీ ఎక్కడైనా దొరుకుతున్నాయి కానీ ఆ రోజుల్లో అంటే ఒక పది ఏళ్లకిత్రం ఇంత వసతులు వుండేవి కాదు. అయినా భోజనాలతో సహా అన్నీ చాలా చక్కగా ప్లాన్ చేసీ ఎరేంజ్ చేశారు. ఎపుడు తలచుకున్నా చాలా ఆనందం గానే ఉంటుంది. ఇపుడు అమెరికా లో నే చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా అన్ని బుక్ చేసుకోవచ్చు అనుకుంటాను. నేను చెప్పినట్లు ఎపుడు ఆమెరికా వెళ్ళినా ఒక్కదాన్నే వెళ్ళటం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ లోనో. ఇమ్మిగ్రేషన్ లోనూ ఏదో గొడవ అవుతుంది. ఆపుడు కూడా బ్రిటీష్ ఎయిర్ వేస్ లో వెళ్ళాను. లండన్ లో వీల్ చైర్ వస్తుందని వెయిట్ చేసాను. విమానం లో ఎయిర్ హోస్ట్స్ అసలు పట్టించు కోలేదు. కనెక్టింగ్ ఫ్లయిట్ వెళ్ళిపోతుందోమో అని కంగారుగా పరిగెత్తాను మధ్య లో ఒక గుజరాతీ అతను లిఫ్టు లో తీసుకుని వెళ్ళి గేట్ దగ్గర దింపాడు. ఎందుకో ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అయినా ఎవరూ హెల్ప్ చేయరు ఎవరి గోలవారిదే అన్నట్లు వుంటారు. అక్కడ మన వాళ్ళతో హయిగా గడిపినా ఈ ప్రయాణం తో అబ్బ ఏమీ అమెరికా రా బాబూ అనిపిస్తుంది. ఈ సాప్ట్ వేర్ వచ్చాకా అమెరికా వెళ్లే వాళ్ళు, అక్కడే వుండే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఈ మధ్య ఈనాడు పేపర్ లో ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ పేరు జవాబు లేని ప్రశ్న. శనివారం జనవరి 18 2025లో ఎడిటోరియల్ పేజీ లో వున్నది. చడవగలిగితే చదవండి. అయితే ఇపుడు కూడా ఇండియాలో ఆ కల్చర్ వచ్చింది. తల్లితండ్రుల దగ్గర వుండకూడదు. శుక్రవారం రాత్రీ నుండే రోడ్స్, హోటల్స్ ఫుల్ ప్యాక్ అయిపోతాయి. ఎక్కడ చూసినా వీపరీతపు పోకడలు చూసి బాధ పడటం తప్పితే ఏమీ చేయలేము. ఎపుడు ఆమెరికా వెళ్ళినా ఏదో ఒక కొత్త అనుభవం తో ఇండియా వస్తాను. మా ఆమ్మాయి నీకు అమెరికాలో ఏమీ నచ్చింది అంటే నీట్ నెస్, ఎక్కడ చూసినా లాన్స్, రూల్స్ ప్రకారం వుండే జనం అని చెప్తాను. అలా ఇళ్ళల్లో ఒక్కళ్ళో, ఇద్దరో తలుపు కూడా తెరవకుండా వుండే వాళ్లను చూస్తే భగవద్గీత లో చెప్పిన ఒంటరిగా వుండే యోగులు లాగా అనిపిస్తారు. మనం అయితే రోజులో ఒక్కసారి అయినా ఇంకో మనిషి తో కనీసం ఫోన్లో అయినా మాట్లాడాలని అనుకుంటాము. మా కజిన్స్ పిల్లలు అక్కడే వున్నా వాళ్ళు మాత్రము ఇండియాలో నే ఉండటానికి ఇష్టపడతారు. మా అమ్మాయి ఇండియా వచ్చి సెటిల్ ఆయి నాకు అమెరికా ప్రయాణం తప్పించింది. అదండీ నా ఆమెరికా విశేషాలు ఫిట్స్ బర్గ్ గుడి లో సత్యనారాయణ వ్రతము కు కథ ఇంగ్లీష్ లో చదివేవారు. మా చెల్లెలు కూతురు పెళ్ళి లో అక్కడే సెటిల్ అయిన ఒక పెద్దావిడ శ్రావణమాసం నోముల పుస్తకాలు ఇంగ్లీష్ లో రాసి ప్రింట్ చేయించి అందరికీ పంచింది. అలాంటి వాళ్ళను చూస్తే చాలా సంతోషంగా వుంటుంది.

 
 
 

Recent Posts

See All
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 
గీతా జ్ఞానం

ఈ టైటిల్ చూసి నేను భగవద్గీత గురించి చెప్తాను అనుకోవద్దు. ఆ గ్రంథం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అనుకుంటాను.మా అత్తగారు మార్గశిర మాసము...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page