అమ్మమ్మ అమెరికా యాత్ర 5
- murthydeviv
- Feb 7
- 2 min read
నా అమెరికా యాత్రల లో మరుపు రాని ఘట్టాలు చాలా వున్నాయి. మా అమ్మాయి వాళ్ళింట్లో ఒక మెక్సికన్ పనిమనిషి వుండేది. ఆ అమ్మాయి కి నేను చేసే చట్నీ లు అన్నీ నేర్చుకోవాలని చాలా సరదా. నేను చట్నీలుచేస్తుంటే ఎలా చేయాలో అన్ని బుక్ లో రాసుకునేది. నేనూ మా చెల్లెలు కలిసి మురుకులు, కారప్పూస చేయటం కూడా నేర్పాము. చపాతీలు ఆలూ పరోటా కూడా బాగా చేసేది. ఇంట్లో వుంటే మన భోజనం కు ప్రాబ్లెమ్ వుండదు కానీ ఇండియన్ రెస్టారెంట్ లేని చోట చాలా ప్రాబ్లెమ్ అయ్యేది. మా అమ్మాయి సబ్ వే లో బ్రెడ్ బాగుంటుంది తినచ్చు అనేది కానీ ఆ బ్రెడ్ సైజులు షేపు చూస్తుంటే ఏదో నాన్ వెజ్ గుర్తు వస్తుంది. ఎపుడూ ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలి అంటే విసుగు వచ్చేది. ఒకసారి అందరం ఉదయం ఆరు గంటల కల్లా కాలిఫోర్నియా వెళ్ళటానికి ఎయిర్పోర్ట్ చేరాము. మా చెల్లెలు కొడుకు నీవు ఏమి తింటావు ఆమ్మా అని అడిగాడు. నేను ఏమీ వద్దు అంటే ఐ విల్ గెట్ యు అష్ బ్రౌన్స్ అని తెచ్చాడు. అవి కూడా ఆలూ తో చిన్న ముక్కల గా చేసి బ్రౌన్ గా వేయించారు. అవి తింటుంటే నాకు నవ్వు వచ్చింది ఒకే ఆలూ తో ఎన్ని రకాలు చేసీ ఫ్రెంచ్ ఫ్రైస్, అశ్ బ్రోన్స్ ఎన్ని రకాలుగా పేర్లు ఎంత అందముగా పెట్టారు అని. వాషింగ్టన్ లో, వాంకోవర్ లో మాత్రమ్ శరవణ భవన్ లో మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ తిన్నాము. సియా టెల్ లో అపుడు ఎక్కువ నార్త్ ఇండియన్ హోటల్ వుండేవి. ఒక ఏరియా లో పంజాబీ వాళ్ళు ఎక్కువమో మక్కీ కి రోటీ,, సరసోంకి సాగ్ అవైలబుల్ అని బోర్డు పెట్టారు. నయాగరా ఫాల్స్ మొదటిసారిగా వెళ్ళినపుడు ఫిట్స్ బర్గ్ నుంచి కారులోవెళ్ళాము. చాలా హాయిగా ఉంది. మా ఫ్రెండ్ పులిహోర దద్దోజనం ఇంకేవో చాక్లెట్ కేక్స్ అన్నీ ఇంట్లో చేసి తెచ్చింది. మధ్య దారిలో ఆగి పార్క్ లాంటి ప్లేస్ లో కూర్చుని పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. అమెరికా లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన ప్లేస్ నయాగరా ఫాల్స్ చాలా ఎంజాయ్ చేశాము. వచ్చేటపుడు ఒక పిజ్జా హట్ లోఆగి పిజ్జా తిన్నాము అర్థరాత్రి అక్కడ ఆడపిల్లలు సర్వ్ చేస్తుంటే కొంచెం బాధ కలిగింది. ఇంక కాలిఫోర్నియా లో న్యూ ఇయర్ వేడుకలు చూశాము అర్ధరాత్రి చలిలో డౌన్ టౌన్ అనుకుంటా, విచ్చలి విడితనం పరాకాష్ట అనిపించింది. ప్రతి వాళ్ళ చేతుల్లో బీర్లు విస్కీలు గొడవ గొడవ గా వున్నది. క్రాకర్స్ ఒక పద్ధతి ప్రకారం ఒక గంట సేపు కాల్చారు.అది మాత్రం చూడటానికి బాగుంది. సాఫ్టవేర్ వచ్చాక ఇండియాలో కూడా న్యూఇయర్ అంటే ఇలాగే ప్రతీ చోటా అమెరికా ను తలదన్నే రీతిలో సాగుతున్నాయి. కాలం తో పాటూ మనం కూడా మారాలి అని మన పిల్లలు చెపుతూ వుంటే సరే అనుకోవాలి. జూలై ఫోర్త్ సెలబ్రేషన్స్ సియాటెల్ లో చూసాము. అలాగే క్రిస్టమస్ వేడుకలు, పార్టీలు, హాలోవీన్ వేషధారణలు తో అమెరికా లో అన్నీ పండుగలు ఎంజాయ్ చేశాను. ఇపుడు హాలోవీన్ ఇక్కడ కూడా చాలా హడావిడి గా చేస్తున్నారు కదా. ప్రతి ఏడాది ఒక భయంకర డ్రెస్ వేసుకొని మా మనవడు, మనవరాళ్లు నాతో ఫోటో తీయించుకుంటారు. మా మనవరాలు దీపావళి కి పుట్టింది. సంక్రాంతి పండగ కి మేము చికాగో వెళ్ళాము. అక్కడ పాపాయికి భోగి పండ్లు పోసాము, బొమ్మలు కూడా పెట్టాము. మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఒక జ్యూస్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నది. వాళ్ళకు ఒక బాబు. అతను కూడా వాళ్ళ బాబును వడిలో పెట్టుకొని చాలా ఇంట్రెస్టింగ్ గా భోగి పండ్లు పోయించుకున్నాడు. ఈ మధ్య ఆ అమ్మాయి ఇండియా వచ్చీ అవ్వన్నీ గుర్తు చేసుకున్నది. నేను రాస్తున్నవన్ని ఒక ఇరవై ఏళ్ల క్రితం సంగతులు. ఇపుడు ఆమెరికా లో అన్నీ పండుగలు ఎక్కువగా చేస్తున్నారనుకుంటా. ఆరోజుల్లో నే మా చెల్లెలు ఒక తెలుగు అసోసియేషన్ పిక్నిక్ కి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒక పెద్దావిడ నా దగ్గర కి వచ్చీ మీరు ఎపుడు ఇండియా వెళ్తారు, నేనూ మీతో కలిసి వస్తాను,అని అడిగింది ఆవిడ అనంతపూర్ దగ్గర ఏదో పల్లెటూరు నుంచీ వచ్చింది. కొడుకు రమ్మన్నాడని వచ్చింది. ఇండియాలో అయితే పక్క వాళ్ళు, పనిమనుషులు, పాలవాళ్ళు ఎవరో ఒకరు కనిపించి మాట్లాడుతారు, ఇక్కడ ఎవరూ కనిపించరు, భాష రాదు అని అవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. పాపం అవిడ ను చూస్తే జాలి అనిపించింది. నాకు విమానంలో కలిసిన గుజరాతీ అవిడ గుర్తు వచ్చింది ఇలాంటి అపుడే జనని జన్మ భూమి అనుకుంటాను. ఇపుడు చాలా మంది పెద్ద వాళ్ళు వెళ్ళి అక్కడ వుంటున్నారు. ఇపుడు టీవీ లో కూడా తెలుగు ప్రోగ్రామ్ లు వస్తున్నాయి. సెల్ ఫోన్ లు, వీడియో కాల్స్ వచ్చాయి కాబట్టి బాగానే ఉన్నారు అనుకుంటాను. ఇంకా కొన్ని విశేషాలు తో రేపు కలుసుకుందాం
Comments