top of page

అమ్మమ్మ అమెరికా యాత్ర

murthydeviv

అమ్మమ్మ అమెరికా యాత్ర అని హెడ్డింగ్ పెట్టినా ఫస్ట్ టైమ్ అమెరికా మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాను. స్కూల్లో, కాలేజీ లో చదువుకునే టపుడు ఆమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గురించి మా సోషల్ టీచర్ చాలా గొప్ప గా చెప్పేది. స్వామి వివేకానందుడు అమెరికా వెళ్ళి మన భారత దేశం యొక్క విశిష్టత గురించి చెప్పారు అని కూడా చదువు కున్నాము . ఇలా అమెరికా అంటే ఏదో గొప్ప ఉత్కంఠ. మేము కాలేజీ లో చదువుకునేటప్పుడు అనుకుంటా కెన్నెడీ ప్రెసిడెంట్ నీ హత్య చేశారు. అపుడు మేము స్టూడెంట్స్ అందరం చాలా బాధ పడ్డాము. అదొక అమాయకత్వం. సరే ఏదో రాద్దామని మొదలు పెట్టి ఎదో రాస్తున్నాను. అమెరికా భూతల స్వర్గం లా ఉంటుంది అని చెప్పిన పెద్దవాళ్ళను కూడా చాలామందిని కలిశాను. ఒకసారి అక్కడ ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి రావటానికి ఇష్టపడరు. ఒకవేళ వచ్చినా చాలా అసంతృప్తి పడిపోతూ ప్రతి నిముషం కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇపుడు ఒక్క అమెరికా ఏమిటి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భారతీయులతో నిండి పోతున్నాయి.కొత్త, కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నారు అక్కడ కొంత వంటరితనం అనుభవాల్సివచ్చినా డబ్బు బాగా సంపాదించుకోవచ్చు అని ఎక్కువ గా వెళుతున్నారు. ఒక్కపుడు అంటే 1960 ,65 ఆ దశకంలో ఎక్కువ పై చదువులకు, రీసెర్చ్ చేయటానికి వెళ్ళేవారు. ఇంక y 2 k , యింకా సాప్ట్ వేర్ వచ్చాకా ఆ పరిస్థితి మారిపోయింది. ఇపుడు ప్రతి ఇంట్లో పిల్లలు అందరూ ఆమెరికా లో నే వుంటున్నారు. తల్లితండ్రులు కూడా ఇండియాలో వుండగలిగినన్న రోజులు ఇక్కడ వుండి తర్వాత అమెరికా వెళ్ళాల్సి వస్తున్నది. యిపుడు ఆమెరికా లోనే పెళ్ళిళ్ళు, ఇండియా హడావిడి అంతా అమెరికా ట్రాన్ఫర్ అయిపోయింది. ఇంతకీ నా ఆమెరికా కబుర్లు చెప్పలేదు కదా. మా రెండో అమ్మాయి 1993 లో M.S చెయ్యటానికి ఆమెరికా వెళ్ళింది. తన క్లాస్ మేట్స్ అందరూ G.R.E రాస్తున్నారు అని తను కూడా రాస్తాను అన్నది. మంచి యూనివర్సిటీ లో వస్తేనే పంపుతానని మా వారు చెప్పారు. అప్పట్లో ఇంజినీరింగ్ చదివి M S చేయటానికి వెళ్ళేవారు. మంచి యూనివర్సిటీ లో సీట్ వచ్చి ఫండింగ్ వుంటే ఈజీ గా ఉంటుంది. కానీ అక్కడ వాతావరణానికి అలవాటు పడటం, ఆ ఫుడ్ కి అలవాటు కావటం ఇంతకన్నా కష్టమైన పని అక్కడ వంటరితనం భరించటం చాలా కష్టము. అయినా వెళ్లిన తర్వాత ఇవ్వన్నీ అలవాటు పడక తప్పదు కదా. మా అమ్మాయి ఒక్కదానికే పిట్స్ బర్గ్ కార్నిగి మిలన్ అనే యూనివర్సిటీ లో సీట్ వచ్చింది. నా ఫ్రెండ్ ఆ వూరిలో నే వున్నది. అదే యూనివర్సిటీ లో నే వుద్యోగం చేసేది. మా చెల్లెలు కూడా చికాగో లో వుండేది. వాళ్ళిద్దరూ వుండటం వలన నేను కొంచెం దైర్యం గా నే పంపించాను.మా చెల్లెలు ఒక పది రోజుల తన దగ్గర వుంచుకుని పిట్ట్స్ బర్గ్ పంపింది. మా ఫ్రెండ్ కూడా ఒక పది రోజుల తన దగ్గర వుంచుకుని యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర అపార్టుమెంట్ ఇంకో ఇద్దరు ఇండియన్ అమ్మాయిలతో కలిపి సెటిల్ చేసింది. మా అమ్మాయి కొత్తదనం ఫీల్ అవకుండా వీకెండ్ కు వాళ్ళింటికి వెళ్తూ వుండేది. మా చెల్లెలు కూడా రోజూ ఫోన్ చేస్తూ వుండేది.1993లో ఈ సెల్ ఫోన్లు లేవు. మా అమ్మాయి వారానికి ఒక సారి శనివారం ఫోన్ చేసేది. మా అమ్మాయి కూడా కొంతమంది తెలుగు వాళ్ళు తో స్నేహం చేసుకొని బాగానే ఎడ్జస్ట్ అయింది. మొదట్లో బాగా దిగులు పడ్డా, తర్వాత సెలవల్లో చికాగో వెళ్తూ బాగానే అడ్జస్ట్ అయింది. అసలు కథ నా ప్రయాణం గురించి కదా.1995 లో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సందర్భం గా మమ్మల్ని అక్కడికి రమ్మనమని గొడవ మొదలు పెట్టింది. వీసా కోసం కావాల్సిన పేపర్లు పంపింది. అప్పట్లో వీసా కోసం చెన్నై వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళి వీసా తెచ్చుకున్నాము. ఇంక అసలు ప్రహసనం అక్కడ మొదలు అయింది.మా వారు నాకు రావటానికి వీలు కాదు నీవు ఒక్కదానివి వెళ్లి రా అని, నాకు మాత్రం ఇద్దరము వెళ్ళాలని. మా వారు బిజినెస్ మేన్ కాబట్టి ఎపుడూ ఏదో హడావిడి వుంటుంది. మన అమ్మాయి డిగ్రీ తీసుకుంటుంటే వెళ్ళక పోతే ఎలా, తనని నిరాశ పరచకుండా నీవు వెళ్లు అని అయన వాదన. ఇంక నేను బయలుదేరక తప్పలేదు. ఇంక నా ప్రయాణం విశేషాలు రేపు.

45 views0 comments

Recent Posts

See All

అమ్మమ్మ అమెరికా యాత్ర 2

ఇంక తప్పక ప్రయాణం ఏర్పాట్లు మొదలు పెట్టాను. అప్పట్లో ఊరగాయలు ప్యాక్ చేయటానికి ఇన్ని వసతులు వుండేవి కాదు ఎవరో గౌలిగూడా దగ్గర ప్యాక్...

మా అమ్మ గారి గీతోపదేశం.

ఈ టైటిల్ చూసి మా అమ్మ గారు మాకు భగవద్గీత గురించి చెప్పారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అసలు మా అమ్మ గారు ఎప్పుడయినా గీత చదివారో లేదో...

జిలేబి

మా అత్తయ్య గురించి రాయదగ్గ గొప్ప విశేషాలు ఎన్నో వున్నా ముందు తీయగా మొదలు పెడదామని జిలేబి గురించి రాస్తున్నాను. ముందు నాకు మా పెద్దవాళ్ళ...

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page