top of page
Search

అమ్మ తో ప్రయాణాలు

  • murthydeviv
  • 2 days ago
  • 3 min read

ఈ మధ్య అనుకోకుండా వంటరిగా చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. మా వారితో సాహస యాత్రలు చేయడం అలవాటు అయిన మా పిల్లలు కు, నాకూ అలా వంటరిగా వెళ్ళటానికి ఏ మాత్రం సందేహించము. కాకపోతే ట్రాఫిక్ ఎక్కువో, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పోటీ పడాలి అనో ఎయిర్పోర్ట్ లో చాలా నడవాల్సి ఉంటుంది. కాకపోతే మా అబ్బాయి వీల్ చైర్ మాట్లాడి,ఏదో ప్రోటోకాల్ అంటూ ఎవరినో ఎరేంజ్ చేశాడు.సో సుఖం గా నే వెళ్లి వచ్చాను. వెళ్తూ ఉంటే మా అమ్మ గారు గుర్తు వచ్చారు. నేను ఊరు ప్రయాణం పెట్టుకోగానే తోడు ఎవరు వస్తున్నారు అని అడుగుతూ వుండేది. నేను ఎన్నిసార్లు యు ఎస్ వెళ్ళినా వంటరిగా ప్రయాణ చేయడమే. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కోసం ఫస్ట్ టైమ్ వెళ్తున్నప్పుడు ఆవిడకు బోలెడు కంగారు.ఆ రోజుల్లోవాళ్ళ కి మన లాగ్హా హాగ్లు ఇవ్వడం, పిల్లల నీ ముద్దులు పెట్టుకోవడం వుండేదికాదు. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత గానీ కోపం కానీ అన్నీ కళ్ళ లోనే చూపించే వారుఅందులో మా అమ్మ గారు చాలా డిసిప్లిన్ గా ఉండే వారు ఎక్కువగా మాట్లాడటం వుండేది కాదు. అలా అమ్మ గారితో ఎక్కడికి ప్రయాణం అనుకున్నా మనకు తోడు ఎవరు వస్తున్నారు అని అడిగేది. నాకు అయితే ఒక కారు డ్రైవర్ ఉంటే ఇంక తోడు ఎందుకు అనుకుంటూ బయలు దేరే దాన్ని. పుట్టింటి వైపు బోలెడంత బంధు బలగం ఉండటం వలన ఎక్కువ గా ఏవో ప్రయాణాలు వస్తూనే వుండేవి. ఇంక బిజినెస్ లో ఉండే మా వారు కానీ అన్నయ్యలు కానీ వచ్చే వారు కాదు. అలా నా ప్రోద్బలంతో ఎలాగో బయలు దేరేది. ఒకసారి అనుకోకుండా మా చెల్లెలు డెలివరీ అనుకున్న టైమ్ కంటే ముందే రావటం వలన హడావిడిగా గౌతమీ ఎక్స్ప్రెస్ లో బయలుదేరాము ఆర్ ఎ సి టిక్కెట్లు. మా ఇద్దరితో నా మేనకోడలు బయలు దేరింది. ఇంక తెల్లవార్లు కూర్చొని ప్రయాణం అనుకుంటే భయం వేసింది. ఖాజీపేట రాగానే ఆ టి సి తో మాట్లాడి ఫస్ట్ క్లాస్ కి మార్చాను . ఇపుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆరోజుల్లో కూపే లు వుండేవి . నాలుగు బెర్త్ లు ఉన్నాయి. ఇంక మా అమ్మ గారు గొడవ అక్కడ జనం ఉన్నారు , ఇక్కడ మనం ఆడవాళ్ల మే అనుకుంటూ. ఇంత లోకే ఎవరో ఒకాయన మా కూపే లోకి వచ్చారు. అప్పటికి మా అమ్మ గారు శాంతించారు. ఆయన వివరాలను అన్నీ కనుక్కుంటూ మేము తెచ్చిన పులిహోర అవీ ఆయనకు కూడా వడ్డించి తృప్తి చెందారు. ఇంతకీ ఆయన గుంటూరు విజ్ఞాన కాలేజీ ఫౌండర్. మా అమ్మ గారి ఆప్యాయత కి బోలెడు మురిసి పోయి వాళ్ళ కాలేజ్ లో మా పిల్లలు ను చేర్చమని ఫీజ్ లో కన్సేషన్ ఇస్తాను అని చెప్పారు. మా అమ్మ గారి ఆశీర్వాదం తీసుకున్నాడు. అలా ఆ రోజు నేను చివాట్లు తప్పించుకున్నాను ఇంకొక సారి మా కజిన్ కూతురి పెళ్లి కోసం విజయవాడ బయలు దేరాము. గుంటూరు దగ్గర లోనే ఒక పల్లెటూరు లో ఉండే మా చిన్న అమ్మమ్మ ను చూసి రావాలని మా ఇంకొక అక్కయ్య కూడా మాతో బయలుదేరింది. పెళ్ళి అయ్యాక మర్నాడే ఆ ఊరు బయలుదేరాము. మగ వాళ్ళు ఎవరూ తోడు లేకుండా ఆ పల్లెటూరు కి వెళ్ళటం మధ్యలో ఏదో వాగు వస్తుంది అందులో నీళ్ళు సడన్ గా వస్తాయి అని అమ్మ కు భయం .కానీ మా డ్రైవరు అమ్మ కు నిదానంగా చెప్పి ఆ ఊరు తీసుకొని వెళ్ళాడు . ఆరోజు మా అమ్మమ్మ గారు మమ్మల్ని చూసి ఎంత సంతోషించింది అనేది మాటల్లో చెప్పలేము . కారు లో తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మ గారు కూడా డ్రైవర్ నుమెచ్చుకున్నారు ఆ సంఘటన గుర్తు వస్తె ఇప్పటికీ ఆనందంగా ఉంటుంది. అమ్మ ను అమెరికా తీసుకొని వెళ్లాలని అన్నయ్య పాస్పోర్ట్ చేయించి ఒకసారి ట్రయల్ గా బెంగళూరు ఫ్లైట్ లో వెళ్ళాము .ఆ విమాన ప్రయాణం ఆమె కు అసలు నచ్చలేదు . ఆకాశం తప్పితే చెట్లు మనుషులు ఏవీ కనిపించరు. నాకు కళ్ళు తిరుగుతాయి నేను ఎక్కడికీ రాను అనేసింది. ఆ రోజుల్లో అమ్మ భయ పడుతూ వుంటే ఒక్కొక్క సారి చిరాకు వచ్చేది. యు స్ లో మనుషులే లేని రోడ్డు మీద చలి లో మా అమ్మాయి డ్రైవ్ చేస్తూ వుంటే మా అమ్మ గుర్తు వచ్చేది. అక్కడ ఇంకొక గొడవ పసిపిల్లలు ను కారు సీటు లో పడుకోపెట్టాలి వాళ్ళు ఏడిస్తే కూడా ఎత్తుకోకూడదు. ఒకసారి స్నో పడుతూ వున్న రోజుల్లో దూరంగా వున్న దత్తాత్రేయ ఆశ్రమము కి తీసుకుని వెళ్ళింది ఆ క్రితం రోజే పౌర్ణిమ ఫంక్షన్ అయిపోయింది ట. అక్కడ ఎవరూ లేరు . మా కారు చూసి దూరంగా వెళ్తున్న ఒక అమెరికన్ వచ్చి ఆ గుడి తలుపులు తెరిచి హీటర్ ఆన్ చేసి మాకు ప్రసాదము పెట్టారు. నిజంగా దత్తాత్రేయ స్వామి వారే అలా వచ్చారు అనిపించింది ఆ టైమ్ లో . అలాంటి సమయంలో మా అమ్మ గారు చాలా గుర్తు వస్తారు. ఆమె భయ పడుతూ వుంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాడు చేయకు అనే దాన్ని . బహుశ అది వయసు ప్రభావం అనుకుంటాను మనం కూడా పెద్ద వాళ్ళం అయ్యేక అలాంటి భయం మన పిల్లల మీద వస్తుందేమో. నా మీద అమ్మ గారికి చాలా కాన్ఫిడెన్స్ వుండేది. అమ్మ తో చాలా ప్రయాణాలు చేశాను . ఒక్కొక్క సారి అబద్ధాలు చెప్పి కూడా ఆమె నీ తీసుకుని వెళ్ళేదాన్ని, తర్వాత చివాట్లు తప్పవు అనుకోండి, ఒకసారి మా కజిన్స్ అందరము గుంటూరు వెళ్తూ మా వారు వస్తున్నారు అని చెప్పాను . మర్నాడు మా వారు వాళ్ళింటికి ఏదో పని మీద వెళ్ళారు.మేము రాగానే ట్రిపుల్స్ తో చివాట్లు తినాల్సి వచ్చింది. ఇపుడు అవ్వన్నీ గుర్తు వస్తాయి. సరదాగా పిల్లలు కు చెప్తూ వుంటాను . ఆరోజుల్లో సెల్ ఫోన్లు కూడా లేవు కదా. ఇంత రోడ్డు లు కూడా బాగుండేవి కాదు . అయినా అలాగే తిరుగుతూ ఉండేవాళ్ళం ఇంకొక సారి ఇంకో జ్ఞాపకాల తోరణం తో


. ఇప్పుడు ఆవిడ మనవరాళ్లు అందరూ పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఎపుడూ వంటరిగా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు అంటే ఏమంటుందో అనుకుంటూ ఉంటాను. ఎక్కడ ఉన్నా అందర్నీ ఆశీర్వదిస్తూ ఉంటుందేమో.

 
 
 

Recent Posts

See All
మసాలా దోశ

ఈ రోజే మా కజిన్ ఫోన్ చేసి మీ ఊరులో మీ స్కూల్ ఎదురుగా ఉన్న హోటల్ పెట్టి 100ఇయర్స్ అయిందట మేము అందరం అక్కడ వాళ్ళు పెట్టిన స్పెషల్ మసాలా దోశ...

 
 
 
ఫ్యామిలీ డాక్టర్

తరుచుగా ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు చాలా బాగా పోస్ట్ లు రాస్తూ వుంటారు. ఈ రోజు పోస్ట్ చదువు తుంటే మా చిన్న తనం లో మా ఫ్యామిలీ డాక్టర్...

 
 
 
అంతర్జాలం

ఇదేమి పేరు అని ఆశ్చర్యం పడకండి ఇంటర్నెట్ కి తెలుగు అర్ధం వెతికితే ఈ పదం వచ్చింది. ప్రస్తుతం మా లాంటి సీనియర్ సిటిజన్స్ అందరము ఈ మాయాజాలం...

 
 
 

3 Comments


Ramakrishnarao Lakkaraju
Ramakrishnarao Lakkaraju
21 hours ago

ఇంట్లో ఆడపిల్లలికి మొగపిల్లలికి బయటికి పంపించటంలో తేడా ఉంటుంది . మొగపిల్లలిని అలా ట్రైన్లో ఎక్కించి పంపించే వాళ్ళు . ఇంటికి చేరినట్లు ఒక వారం తరువాత పోస్టులో ఒక కార్డు వచ్చేది . ఏమిటో పాత సంగతులు తలుచుకుంటే గమ్మత్తుగా ఉంటాయి .

Like
murthydeviv
17 hours ago
Replying to

అవును

Like

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page