top of page
Search

అమ్మ కు ప్రేమతో

  • murthydeviv
  • May 12, 2025
  • 2 min read

Updated: Nov 1, 2025

  • ఈ రోజు మాతృ దినోత్సవం అదే మదర్స్ డే అని ఉదయాన్నే పేపర్, వాట్స్ ఆప్, ఫేస్ బుక్ లో ఒకటే హోరు గా పోస్టులు. ప్రత్యేకంగా మనం ఒకరోజు అని గుర్తు చేసుకోవాల్సిన పని లేదు . నాకు అయితే రోజు లో ఒక రెండు మూడు సార్లు అయినా మా అమ్మ గారు, అత్త గారు వాళ్ళు చేసిన పనులు లేదా మాటలు గుర్తు వస్తూ వుంటాయి. నేను అయితే కనీసము గా ఒక నలభై ఏళ్ళు ఆ పెద్ద వాళ్ళ తో కలిసి గడిపాను. మా అత్త గారు, అమ్మ కాకుండా, మా పెద్దమ్మ అంటే మా అమ్మ కు అక్కయ్య ఆవిడ తో కూడా చాలా అనుబంధం వుండేది. ముగ్గురికీ నా మీద ఎక్కువ ప్రేమ అని అందరూ అనే వారు. కానీ నేను అయితే వాళ్ళకు ఒక నమ్మకం వుండేది అనుకుంటాను ఇపుడు. మా పెద్దమ్మ కు ఒకతే కూతురు. కూతురు అంటే వల్లమాలిన ప్రేమ. కానీ అక్కయ్య చెప్పిన మాటలు మాత్రము న చ్చేవి కాదు. సంధి చేయటానికి నేను వెళ్ళాల్సి వచ్చేది. పెద్దమ్మ తనకు ఒక్కతే కూతురు అవటం వలన పోసెసివ్ నెస్ వలన అలా ఉండేదేమో అని అనిపిస్తుంది ఇపుడు. మదర్స్ డే అని ఏదో రాస్తున్నాను అనుకోవద్దు. మా చిన్నతనం లో జాయింట్ ఫ్యామిలీ లో అత్త గార్లు పెత్తనం

  • ఎక్కువగా వుండేది నచ్చినా నచ్చక పోయినా అలాగే కలిసి ఉండేవాళ్ళు. అత్తగారు కోడళ్ళు కలిసి మెలిసి వుండే వారు. కించిత్ అబిప్రాయం భేదాలు వున్నా సర్దుకుని పోయే వారు. కల వారి కోడలు కలికి కామాక్షి అనే పాట లో చెప్పినట్లు వుండే కోడళ్లు ను నేనూ నా చిన్నతనంలో చూసాను. ఇపుడు ఎవరికయినా చెప్పినా నమ్మకం కలగదు. తర్వాత కాలంలో కోడళ్లు ఉద్యోగం చేస్తూ ఉంటే ఎంతో సహాయం చేసే అత్త గారు లను కూడా చూసాను. మా అత్త గారు కూడా ఎంత వంట అయినా అవలీలగా చేసే వారు. మన జనరేషన్ ఎంత చదువు కున్న అత్త గారు అంటే ఒక గౌరవము తో చూసే వాళ్ళం. వాళ్ళు చెప్పేది చాదస్తం గా అనిపించినా పాటించా టా నికి ట్రై చేసే వాళ్ళం. ఈ ఘోష ఎందుకు అని మీకు అనిపించచ్చు. ఈ కాలం లో అమ్మాయిలు బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పోస్ట్లను సమర్థవంతంగా నిర్వహణ చేస్తున్నారు. కానీ పెళ్ళి అయ్యాక హస్బెండ్ మాత్రమే తన ఫ్యామిలీ అనుకుంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే బంధువులు అనుకుంటారు అత్త గారు వైపు వాళ్ళ ను అసలు పట్టించు కోరు. అత్త గారు కానీ మామగారు కానీ వంటరిగా ఉన్నా బాధ వుండదు వాళ్ళ ను చూడటం అనేది వాళ్ళ బాధ్యత కాదు అనుకుంటారు. పూర్వము చదువు లేకపోయినా ఎంత గొప్ప మనసు తో ఇంట్లో వున్న వాళ్ళ ను అందరిని ఒకే లాగా చూసేవారు. ఇంక ఫేస్ బుక్ లో ట్విట్టర్ లో రీల్స్ అత్త గారు కోడలిని వేధించి నట్లు లేక కోడలు అత్త గారిని వేధింపులు. టెక్నాలజీ ఇలా వాడుతున్నారా అనిపిస్తుంది. ఇంక సినిమాలు,టీవీ సీరియల్స్ చెప్పటానికే అసహ్యం అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్స్ లో ఆడవాళ్లను నీచంగా చూపించటం , టీ వీ లో అయితే ఆడ విలన్ ల కు అంతు వుండదు. మదర్స్ డే సందర్భంగా సభ లు నిర్వహించిన వనితా మండలి వాళ్ళు ఇవి చూడరా. ప్రొటెస్ట్ చేయరా అనుకుంటాను. మనం చదువుకుంటున్నాము కానీ మన చదువులు సంస్కారం నేర్పటం లేదు ఫ్యామిలీ అంటే మనమూ మన పిల్లలే కాదు ఒక సమూహం అని ఎపుడు అనుకుంటారో అపుడే నిజమైన మదర్స్ డే మా చిన్నతనం లో అమ్మ ప్రేమ, డిసిప్లిన్ కాక సంస్కారం నేర్పించిన మా అమ్మే కాకుండా వాళ్ళ ప్రేమ తో ఆప్యాయత తో మమ్మల్ని ప్రభావితం చేసిన పెద్దమ్మ లు , పిన్ని లు అత్తయ్య లకు అందరికీ ప్రేమ తో తలవంచి నమస్కారం చేస్తున్నాను వాళ్ళ ఆశీస్సులు ఎపుడూ మా అందరికీ వుండాలని కోరుకుందాం. నేను చెప్పదలచుకున్నది సరిగ్గా చెప్పానో లేదో తెలియదు కానీ మదర్స్ డే అంటే అత్త గారు కూడా ఒకళ్ళ కి అమ్మ అని గ్రహించాలని నా ఐడియా. ఆడవాళ్లను అమ్మ లాగా గౌరవించినపుడే నిజమైన మదర్స్ డే

 
 
 

Recent Posts

See All
పెళ్లి సంగీతం

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్

 
 
 
బ్లాక్ అండ్ వైట్ టీ వీ

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా

 
 
 
మహా నగరం ముచ్చట్లు

ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page