top of page
Search

అమృత హస్తం

  • murthydeviv
  • 18 hours ago
  • 4 min read

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు ఆ హోటల్ కు ఏమీ సంబంధం లేదు.పేరు మాత్రమే తెలుగు పేరు లోపల అన్నీ మామూలుగా వుండే మెనూ పన్నీర్ తో ముంచి తేల్చే వంటలు. మా యింటి చుట్టూ హోటళ్ళు లేక చీరల షాపులు. పెద్ద ఇళ్లన్నీ ఇలా మారిపోతూ ఉన్నాయి.e విషయం ఎందుకు చెబుతున్నానంటే అసలు మనం మన వంటలు మ రిచి పోయాము అనిపిస్తుంది. ఇపుడు హోటళ్ల పేర్లు కూడా విచిత్రంగా పెడుతున్నారు చూస్తేనే నవ్వు వస్తుంది ఏం పేర్లు రా బాబూ అని ఇదివరకు రోజుల్లో అయితే రెండే రకాలుగా వుండేవి ఉడిపి హోటల్ లేక మిలటరీ హోటల్ అనీ ఎవరికి కావల్సిన హోటల్ కు వాళ్ళు వెళ్ళే వారు. ఆ పిజ్జాలు ఇండియా కి తెచ్చిన వాడు ఎవడో గాని అందులో రుచి ఏమిటో నాకు అసలు అర్థం కాదు. ఉప్పు కారం గానీ లేకపోతే తీపి గానీ ఏమి ఉండదు. మా పిల్లలు పుట్టిన రోజుల్లో ఇంట్లోనే రకరకాలుగా చేసే వాళ్ళం. ఇపుడు పిజ్జాలు లు ఆర్డర్ ఇచ్చి ఒక కేక్ తెస్తే పార్టీ అయిపోతుంది. అసలు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే వంట అనేది ఒక ఆర్ట్ లాగా చేసే వాళ్లను గురించి చెబుదామని కానీ ఏదో పక్క దారులకు వెళ్ళింది. మా పెళ్ళి అయిన తరువాత మా ఆడపడుచు పెళ్ళి కని మా అత్తగారి వూరు కి వెళ్ళాము.1969అనుకుంటా.మేము ఆ ఊరు చేరాము విపరీతమైన తుఫాను తో ఆ ఊరితో గుంటూరు కనెక్ట్ అయ్యే రోడ్ తెగిపోయింది. సో కూరలు ఏమీ దొరికేవి కాదు. ఒక వారం పదిరోజులు అనుకుంటా, మా అత్త గారు రోజూ ఎదో ఒక రకము పప్పు చేసే వారు. కాదేదీ కవిత కనర్హం లాగా. అత్తగారు కదా అందులో కొంచెం కొత్త ఏమి పప్పు అని అడిగేదాన్ని. ఒకరోజు మాగాయ తో ఇంకోరోజు ఉత్తి ఉల్లిగడ్డలు, చింతపండు తో, ఇంకో రోజు నిమ్మకాయ రసం తో అలా చాలా రుచి గా ఉండే వి ఇంక పప్పు పులుసు పెట్టారంటే ఇల్లు ఘుమఘుమలు తో నిండి పోయేది. అసలు కూర లేకుండా అన్నం తినాలా అనుకునే నేను ఆ వారం రోజుల ఇంకొచెం ఎక్కువ తిన్ననేమో అనుకుంటా. వంటల్లో అయితే ఆవిడది నిజంగా అమృత హస్తం.. ఏ వంట చేసినా చాలా రుచిగా వుండేది. ఇప్పటికీ మేము అందరము కలిస్తే అత్త గారి గోంగూర పులుసు కూర , పప్పు తలచుకోకుండా ఉండ లేము. నిమ్మ రసం తో చట్నీ చేస్తారని కూడా తెలియదు మేము హైదరాబాద్ వచ్చాకా ఇంట్లో ఉదయం వంట ఆవిడే చేసే వారు, ఒక పాతిక మంది బంధువులు వచ్చినా ఈజీ గా వంట చేసే వారు ఇంక రుచి కూడా అమోఘం గా వుండేది. ఒకరోజు మావారు మద్రాసు నుంచి మంచి పేరు వున్న టీవీ కంపెనీ ఎమ్ డి వచ్చారు. మేము లంచ్ కి రాము అన్న వాళ్ళు ఫ్యాక్టరీ లో లేట్ అయింది ఇంటికే వస్తున్నాము అని ఫోన్ చేశారు. నాకు కంగారు వాళ్ళకి ఏమి చేయాలి అంటూ. మా అత్త గారు పిల్లలు కు తీసిన ఉత్తి పప్పు ఉంది కదా అందులో మాగాయ వేసి పోపు పెడతాలే అంటూ ఇన్ని ఉల్లి గడ్డలు అన్నం తోపాటు కుక్కర్ లో పెట్టీ మాగాయ పప్పు చేశారు కూరల్లో మహారాణి ఆలూ ఫ్రై ఎవరు వచ్చినా చేయటం నాకు అలవాటు కొత్తగా పెట్టిన పండ్ల కారం పక్కన వెన్న పూస తో సహా వడ్డించాను. ఇంక వాళ్ళు ఆ పప్పు ఎలాచేశారు అంటూ, రోజుకుంటూ పండ్ల కారం తో పాటు వెన్న తింటూ చివరికి పెరుగు లో కూడా ఆ పప్పు నంచుకున్నారు . ఆయన మద్రాస్ వెళ్ళాక మరలా ఆయన అన్న గారు భార్య సమేతుడై వచ్చి అదే మెనూ అడిగి లంచ్ తిని వెళ్ళారు. అలా మద్రాస్ నుంచి ఐదు బ్యాచులు వచ్చారు. మా అత్తగారికి విసుగు వచ్చీ వీళ్ళు ఏమయినా పని మీద వస్తున్నారా వూరికే వస్తున్నారా అనీ, మనకు ఏదయినా ఉపయోగం ఉందా అన్నారు. అలా ఆమె అమృత హస్తం తో ఏమి చేసినా రుచి వుండేది. ఆ తరం వాళ్ళ కి ఏదయినా పిండివంటలు వంటలు చేయాలంటే చాలా సరదాగా వుండేది అనుకుంటా. వాళ్ళకి మనం తిని ఆనందిస్తే చాలు. మా పెద్దమ్మ కూడా అలాగే ఎవరు వచ్చినా టక్కున ఎదో ఒకటి చేసేది. వాళ్ళు ఆరోజుల్లో చేసిన స్పెషల్స్ a రుచి ఇపుడు తలచుకుని ఆనందించటమే, మా అమ్మ గారు మైసూరు పాక్ చాలా బాగా చేసేది నేను చాలా సార్లు ట్రై చేసి మనకు రాదులే అని వదిలేసాను.. నేను ఒకసారి కాకినాడ వెళ్ళాను . మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గారు నీవు పనస పొట్టు కూర తిన్నావా అని అడిగారు. మనకు అసలు ఆ వంటలు తెలియదు కదా లేదండి అన్నాను. మర్నాడే అవిడ జీ డి పప్పులు వేసి చేశారు. ఆ రుచి మరలా నేను ఎక్కడా తినలేదు. గోదావరి వంటలకు మన గుంటూరు వంటలకు చాలా తేడా ఉంటుంది. మా చిన్న వదిన ఇంకో మరదలు గోదావరి వాళ్ళే. ఎపుడైనా సరదాగా ఆవ పెట్టీ కూర చేద్దామన్నా, మా అన్న గారు మీ ఆవులు దూడలు మాకు వద్దులే మా వంటలు చేయండి అని జోక్ వేసే వాడు. ఎందుకో మా అన్నయ్య కి మా వారికి ఆ ఆవ కూరలు నచ్చేవి కాదు. ఇంక మా వదిన మీ కూరలు ఏముందీ ఇంత నూనె వేసి వేయించటమే గదా అనేది. మా వదిన కూడా ఎంత మంది వచ్చినా కంగారు పడకుండా ఉదయాన్నే వంట చేసేది. దోశలు అయితే పేపర్ దోశలు లాగా నాజూకు గా పోసేది. ఎంత వంట చేసినా అలిసినట్లు వుండేది కాదు. మా వారు నా పెళ్ళి అయినప్పుడు నుండీ ఎవరో ఒకర్ని భోజనాలు కు తేవటం అలవాటే అయినా, నేను అలాగే కంగారుగా చేస్తూనే వుండే దాన్ని. అయితే రాణి లాంటి ఆలూ ఫ్రై బాగా చేస్తానని మా వాళ్ళు అందరూ మెచ్చుకుంటారు మా గ్రాండ్ చిల్డ్రన్ తో సహా, వెనక నుండి మా వదిన మా అత్త గారు ఆ ఏముంది ఇంత నూనె పోసి వేయించటమే కదా అని అంటున్నట్లు అనిపిస్తుంది. మా రెండో వదిన తెలంగాణ వంటలు స్పెషల్. మనం గోంగూర లో పండు మిరపకాయ లు కలిపితే ఆవిడ చింతకాయలో కలుపుతుంది. బొబ్బట్లు కూడా గోధుమ పిండి తో చేస్తారు మనం మినప గారెలు పండగ కి చేసుకుంటే వాళ్ళు పెసలు తో చేస్తారు. అరటి కాయ ఫ్రై ఆ వదిన స్పెషల్ ఎపుడు వేయించినా అలా రాలేదు అనుకుంటాను. తను కూడా ఎంత వంట అయినా చాలా ప్రశాంతంగా చేసేది. అసలు ఆవిడ ప్రశాంతతకు మారు పేరు లాగా ఎపుడూ చిరునవ్వుతో వుండేది. ఇంత మంది గురించి చెప్పాను మా పెద్ద అక్కయ్య గురించి చెప్పాలి కదా ఆ అక్కయ్య కు పదమూడు ఏళ్ళ కు పెళ్ళి అయిందట. నపెళ్ళి అయిన కొత్తల్లో గారెలు ఎలా చేస్తారు అని అత్త గారు అడిగితే బియ్యం పిండితో చేస్తారు అని చెప్పిందట. కానీ ఆరోజుల్లో పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా తర్వాత పొయ్యి ల మీద వంటలు చేయాల్సిందే కదా. ఇంతకీ మా అక్కయ్య హస్తం కూడా అమృత హస్తమే. కంది పొడి, ఆవకాయ. గోంగూర పండ్ల తోటి అక్కయ్యే చేయాలి, మనం తినాలి అనుకుంటాము ఇప్పటికీ. మా అమ్మ, అక్కయ్య ఊరికే ఇలా పచ్చి మిర్చి, చింతపండు కొత్తిమీర వేసి కారం నూరితే ఎందులోనయినా తినచ్చు. అంత రుచిగా వుండేది. మా చెల్లెలు గోదావరి జిల్లాలు కు వెళ్ళిన కొత్తల్లో వీ ళ్ళు ఆకులు కూరలు కాకుండా కాండా లు కూడా తింటారు అనేది. అరటి దూట కూర చేస్తారని. కానీ ఆ దూట ఇంతవరకూ తినలేదు. నేను యు ఎస్ వెళ్ళినపుడు కూడా అపుడు ఇన్ని రకాలు దొరికేవి కాదు. మాగాయ పప్పు నిమ్మ కాయ పప్పు చేసేదాన్ని. మా అత్త గారు వా కాయ తో ద బ కాయ తో కూడా పప్పు చేసే వారు ఆ వా కాయ గింజలు తీయ లేక విసుగు వచ్చేది. ఇన్ని రకాలుగా వంటలు మనకు ఉంటే ఎర్ర కారం హోటల్ కి వెళ్ళి పన్నీర్ తినటం ఎందుకు అని. మనము ఎన్ని చెప్పినా వారానికి ఒకసారి స్స్విగ్గి వాడు పిజ్జా తో మన బెల్లు కొట్టడం ఖాయం ఈ సారి బర్త్ డేకి మాత్రం హాయిగా డ్రైవ్ లాగా వెళ్ళి బండి లో కట్లెట్ తిని మిగిలిన డబ్బులు దాచుకోండి,అని చెప్దామని ఊహ.. గుస గుస లా డే ఊహ లు ఎపుడూ మధురంగా వుంటాయి కదా. ఇన్ని వంటలు గురించి చదివి మీకూ ఏదయినా పప్పు ట్రై చేయండి. కొసమెరుపు మా అత్త గారు క్యాబేజీ తో కూడా పప్పు చేసే వారు కాకపోతే ముందు ఉడికించి ఆ నీళ్ళు పారపోయాలి లేక పోతే సూప్ లాగా తాగ vachu అదీ కథ గుడ్ నైట్ ఫర్ ది డే

 
 
 

Recent Posts

See All
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 
గీతా జ్ఞానం

ఈ టైటిల్ చూసి నేను భగవద్గీత గురించి చెప్తాను అనుకోవద్దు. ఆ గ్రంథం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అనుకుంటాను.మా అత్తగారు మార్గశిర మాసము...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page