అపురూప చిత్రాలు 1
- murthydeviv
- Jul 13
- 2 min read
ఈ మధ్య ఉదయాన్నే పేపర్ చూసినా చూడక పోయినా ఫేస్ బుక్ మాత్రం తప్పక చూస్తాను. నిన్న గురుదత్ గారి కి 100ఇయర్స్ జయంతి సందర్భంగా ఆయన పిక్చర్స్ గురించి వ్రాసారు. ఈ రోజు ఎవరో శాంతారాం గారి సినిమాలు గురించి వ్రాశారు ఈ కాలం వాళ్ళకి ఆయన గురించి బహుశా తెలియదు. ఆయన సినిమాలు గొప్ప కళా ఖండాలు అని చెప్పచ్చు. దూరదర్శన్ మొదలు పెట్టిన కొత్తల్లో కొన్ని పాత సినిమాలు వేసే వారు . ఇపుడు అయితే అసలు వాళ్ళు సినిమాలు వేస్తున్నారో లేదో తెలియదు. శాంతారాం గారి ధో అంకే భారా హాథ్ సినిమా ఆరోజుల్లో ఒక విలక్షణమైన సినిమా.ఆ కథ లో ఒక పోలీస్ ఆఫీసర్ దొంగలని సంస్కరించి మంచి వాళ్ళ గా మారుస్తారు.ఆ షూటింగ్ సమయంలో ఆయన కళ్లు కూడా దెబ్బ తిన్నాయని ఆయన వ్రాశారు.ఆ రోజుల్లోనే ఆయన కట్నం గురించి, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కోడళ్ళు ఘర్షణ పడటం, రెండు సినిమా ల్లో చూపించారు.తూఫాన్ ఔర్ దియా నాకు చూసిన గుర్తు లేదు యూ ట్యూబ్ లో ఉన్నది. ఈ రోజుల్లో దొంగలనే హీరోలు గా చూపిస్తున్నారు. ఇంక అలాంటి సినిమాలు ఎక్కడ వస్తాయి.ఈ సినిమాలన్నీ మా చిన్నతనం లో వచ్చిన సినిమాలు నేను కూడా ఈ సినిమా లు కొన్ని దూరదర్శన్ లో చూశాను. మా నాన్న గారు ఎక్కువ సినిమాలు చూసే వారు కాదు . ఎక్కువ సమయం బిజినెస్ పనుల మీద బొంబాయి వెళ్తూ ఉండే వారు. నవరంగ్ సినిమా ధో అంకే భారా హాథ్ ఆయన అక్కడే చూసారు..మా ఊరు వచ్చాకా ఆ సినిమా బాగుంది మన ఊరు వ స్తే చూడండి అని చెప్పారు.కానీ ఆ సినిమాలు మా ఊరు వచ్చిన గుర్తు లేదు. హైదరాబాద్ లో ఇదివరకు అబిడ్స్ జమ్రుద్ థియేటర్ లో కొన్ని పాత సినిమాలు వచ్చేవి . అక్కడే జనక్ జనక్ Payal bhajae సినిమా చూసాను. నవరంగ్ సినిమా లో అపుడే కొత్తగా బ్రిటిష్ వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలను కబ్జా చేయడం తండ్రులు ఇష్టానికి వ్యతిరేకంగా యువ రాజులు బ్రిటిష్ వాళ్ళు కు లొంగి పోవటం, చూపించారు. రాజుల పోషణ లో కళలు కళాకారులు ఎంత ఉన్నతంగా ఉంటారో బాగా చూపించారు. ఈ రాజుల కథలో అంతర్లీనంగా గా ఒక కళాకారుడు తన భార్యలో ఊహ సుందరిని ఎలా ఆరాధిస్తాడో చాలా బాగా చూపించారు. అతన్ని అపార్థం చేసుకున్న భార్య చివరికి అతని ఊహ సుందరి తనే అని తెలుసుకుంటుంది. ఇందులో పాటలు డాన్స్ లు చాలా బాగుంటాయి.. జనక్ జనక్ Payal bhajae కూడా ఇలాంటి డాన్స్ ప్రధానమైన కళా ఖండం. అందులో గోపీకృష్ణ గారి డ్యాన్సులు చూసి తీరవలసిందే. అంత బాగుంటాయి. ఇదేదో సినిమా రివ్యూ లాగా వున్నది అనుకుంటారేమో కానీ మీ తరం వాళ్ళకి తెలియని కొన్ని కళా ఖండాలు గురించి మీకు చెప్పాలనే ఈ ప్రయత్నం. మా తరం వాళ్ళు కి కూడా గుర్తు చేద్దామని ఈ ప్రయత్నం. ఈ సినిమాలు అన్ని యూ ట్యూబ్ లో ఉన్నాయి. ఆయన ఇంకోసినిమా Dr కోట్నీస్ ki అమర్ కహానీ. ఇది బహుశా 2nd వరల్డ్ వార్ టైమ్ అప్పటి సినిమా ఏమో నాకూ గుర్తులేదు. సినిమా చూసినట్లే గుర్తు.. యింకో సినిమా అమర్ భూపాలి ఇందులో చాలా చక్కటి భజనలు ఉన్నాయి. ఈ సినిమాలు అన్నీ నేను చూసి కూడా చాలా రోజులు అయింది.కానీ పాటలు మాత్రం రోజూ వింటూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. నవరంగ్ సినిమా లో తూ మేరీ మై తేరి పాట చాలా బాగుంటుంది వినండి .ఇది సినిమా రివ్యూ కాదు , మనం మరచి పోయిన ప్రతిభా వంతుల కు నివాళులు అర్పించడం.గుడ్ నైట్.
Comments