top of page
Search

అంతర్జాలం

  • murthydeviv
  • Aug 29
  • 2 min read

ఇదేమి పేరు అని ఆశ్చర్యం పడకండి ఇంటర్నెట్ కి తెలుగు అర్ధం వెతికితే ఈ పదం వచ్చింది. ప్రస్తుతం మా లాంటి సీనియర్ సిటిజన్స్ అందరము ఈ మాయాజాలం లో చిక్కుకు పోయాము. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ లేక పోతే టీవీ కానీ, యూట్యూబ్ కానీ కనీసం ఫోన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఒక పది రోజుల క్రితం ఎక్కడో ఏదో జరిగింది అని మన డిప్యూటీ సీఎం గారు అన్నీ కేబుల్స్ కట్ చేయమన్నారుట. ఇంకేముంది అన్నీ బంద్. రాముడు సకల గుణాభిరాముడు అన్నట్లు అన్నిటికీ ఆ ఫోన్ లోనే ఉదయంవాట్సాప్ గుడ్ మార్నింగ్ లు వారాల ప్రకారం ఏ దేవునికి పూజ చేయాలో తెలిసే అవకాశాలు, మధ్య మద్యలో ఫేస్ బుక్ లో కథలు, పాత సినిమా కబుర్లు ఇలా ఒకటి ఏమిటి అరచేతిలో స్వర్గం లాగా అంత జ్ఞానం కలిగిస్తూ వుంటుంది. నెట్ పని చేయక పోయినా ఫోన్ అలా చేతి లో పట్టుకుని వున్న మా మనవరాలిని అడిగితే డేటా పని చేస్తుంది అన్నది. నాకు రాలేదు అంటే ఇంట్లో రాదు బయట వరండా లో వస్తుంది అన్నది. ఉదయాన్నే యూట్యూబ్ లో భక్తి తో ఎం ఎస్ అమ్మ నీ ఆన్ చేసి మన పని మనం చేసుకుంటూ వీనులవిందు గా అమ్మ పాడే పాటలు సహస్రనామం, అన్నీ వింటూ వంట చేస్తే ఆ వంట కు రుచీ, మనకు ఓపిక వస్తుంది. ఉదయాన్నే నెట్ పని చేయడం లేదు అంటూ మా కోడలు కూడా ఆఫీస్ కి పరిగెత్తింది. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ తో వరండా లోకి వెళ్ళి ఈ అంతర్జాలం హరికథ వినిపించి కాస్త సానుభూతి ని ప్యాక్ చేసుకుని మరల లోపలికి రావటం. ఒక మూడు రోజుల గడిచాక వైరాగ్యం వచ్చేసి ఇదివరకు ఇంటర్నెట్ ఉందా అనుకుంటూ చదవాలి అని తీసి పెట్టిన రెండు పుస్తకాలు తీసి చదువుతూ ఇంక సి డీ ప్లేయర్ కూడా బయటికి తీద్దాము అనుకున్నాను. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకరు వాట్సాప్ లో సాహిత్యం గురించి, కవులు గురించి క్విజ్ లాగా పంపుతూ ఉంటారు. తెలిసిన ఆన్సర్ అయితే చెప్పగలము కానీ లేక పోతే గూగుల్ ను ఆశ్రయించాలి కదా. నా నెట్ కథ చెప్పగానే ఏమిటీ మీరు వున్న అంత పోష్ ఏరియా లో నెట్ లేదా అని బోలెడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంక నా బ్లాగ్ చదివే వాళ్ళు వారం రోజుల నుండీ వాళ్లని పలకరించlలేదని ఎ లా ఉన్నానో అని కుశలం కనుక్కుంటూ ఉన్నారు. ఆహా ఏమిటి నాకూ ఇంత ఫాన్ ఫాలోయింగ్ ఉందా అని కాసేపు మురిసి పోయాను. ఈ ఫేస్ బుక్, వాట్స్ యాప్ తో చాలా టైమ్ వేస్ట్ అయిపోతున్నది లేకపోయినా పరవాలేదు. అనుకుంటూ ఉండగా వినాయక చవితి నాడు విఘ్నాలు తొలగి పోయినట్లు మా అబ్బాయి ఇంకో కొత్త ఇంటర్నెట్ వాడిని పిలిచాడు. ఆ జోరుగా కురుస్తున్న వర్షం లోనే వచ్చీ కొత్త కంపెనీ వాడి అంతర్జాలం అమర్చి, టీ వీ కూడా యింకో కొత్త రిమోట్ ఇచ్చి వెళ్ళాడు. అంతర్జాలం కు బానిస కాకూడదు అనే నిర్ణయాన్ని కొంచెం సడలించి ఫేస్ బుక్ లో ఈ వారం రోజులు ఏమి మిస్ అయ్యాయో అనుకుంటూ ఆ ఫోన్ కి అతుక్కు పోయాను. ఇలా టైమ్ వేస్ట్ చేసినప్పుడు మా అమ్మ గారు గుర్తు వస్తారు. మా అమ్మమ్మ గారు ఏదైనా కబుర్లు చెప్పవే అమ్మాయి అంటే, రోజూ ఏమి కబుర్లు వుంటాయి రామ, కృష్ణ అనుకో అనే వారు మా అమ్మమ్మ చాలా సిన్సియర్ గా ఎంతసేపు రామ కృష్ణా అనుకుంటాను అంటూ తన చిన్నతనం కబుర్లు ఏవో చెపుతూ ఉండే వారు. మా అమ్మ గారు మాత్రం రామ కృష్ణా అనుకోక పోయినా, ఒక గంట లో పూజ ముగించుకుని ఏవో క్రియేటివ్ పని చేస్తూ వుండేవారు. తొంబై ఏళ్ళ వయసులో కూడా పూల దండ లు కట్టి దేవుళ్ళ ను అలంకరించి పాటలు పాడే వారు. మమ్మల్ని కూడా ఆ పాట లు నేర్చుకోమని, ఎంబ్రాయిడరీ చేయమని చెప్పేవారు. ఇప్పుడు ఇలా అంతర్జాల మహేంద్ర జాలం లో మునిగి పోయిన మమ్మల్ని చూసి మా అమ్మ గారు ఏమనుకుంటారో అని నా డౌట్ అనుమానం . ఈ పాటికి మీకూ అర్థం అయివుంటుంది మా ఇంట్లో అంతర్జాలం వచ్చింది, ఇంక మీకు జోరు గా కబుర్లు రాస్తూ వుంటానని గుడ్ నైట్

 
 
 

Recent Posts

See All
మసాలా దోశ

ఈ రోజే మా కజిన్ ఫోన్ చేసి మీ ఊరులో మీ స్కూల్ ఎదురుగా ఉన్న హోటల్ పెట్టి 100ఇయర్స్ అయిందట మేము అందరం అక్కడ వాళ్ళు పెట్టిన స్పెషల్ మసాలా దోశ...

 
 
 
ఫ్యామిలీ డాక్టర్

తరుచుగా ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు చాలా బాగా పోస్ట్ లు రాస్తూ వుంటారు. ఈ రోజు పోస్ట్ చదువు తుంటే మా చిన్న తనం లో మా ఫ్యామిలీ డాక్టర్...

 
 
 
పోస్ట్ బాక్స్

ఒక నాలుగు నెలల క్రితం యూ ఏస్ లో వున్న నా ఫ్రెండ్ కి లెటర్ రాసి మా డ్రైవర్ ను పోస్ట్ ఆఫీస్ కి పంపాను. స్టాంప్ లు వేసి పోస్ట్ లో వెయ్యమని,...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page