Avakaya 6
- murthydeviv
- Nov 16, 2024
- 2 min read
ఈ ఆవకాయ కాయ కోసం హైదరబాద్ ఎన్నో మార్కెట్లు తిరిగామో లెక్క లేదు మార్కెట్ లో వాళ్ళు చూపించిన కాయ ఇస్తారని నమ్మకం లేదు ఆ మండిల్లో అమ్మే వాళ్ళ తో మనం పోటీ పడలేము మనం ఎంత చదువుకున్నా హోదా డబ్బు వున్నా వాళ్ళ నీ మాటల్లో గెలవలేము వాళ్లు గట్టి గా తలచు కుంటే ప్రభు త్వ లను మార్చే శక్తి వున్న వాళ్ళ ముందు మనమే పాటి మామిడి కోసం మార్కెట్ కి వెళ్ళినపుడు చాలా సరదాగా వుంటుంది ఒక కొత్త ప్రపంచం చూస్తున్నట్లు వుంటుంది చాలా మంది దంపతులు ఇద్దరూ వచ్చి చాలా శ్రద్ద గా కాయలు సెలెక్ట్ చేసుకుంటూ ఆ మామిడి కాయలు గూర్చి కబుర్లు చెప్పుకుంటూ గతం లో ఆవకాయ పెట్టిన సంఘటనలు గుర్తు చేసికుంటూ అదొక జీవితాశయం లాగా చేస్తూ వుంటారు అలాంటి వాళ్ళ ను చూస్తే మా వదిన చెప్పి నట్లు ఇలాంటి చిన్న చిన్న ఆనందా లు కోల్పోయి నట్లు అనిపిస్తుంది మధ్యలో మన సోదర రాష్ట్రాల వాళ్లు వచ్చి ఏ కాయ మంచిది ఏ కారం వేయాలిఏ నూనె అయితే బాగుటుంది ఎంత వేయాలి అని సలహాలు అడుగుతారు ఆవకాయ ఎన్ని రకాలో మామిడికాయలు అన్నీ రకాలు కొత్త పల్లి కొబ్బరి తెల్ల గులాబి జలాలు సువర్ణ రేఖ చిన్న పెద్ద రసాలు నాటు కాయలు చిత్తూరు కాయలు ఒక ఆంధ్రా తెలంగాణ ఏమిటి ఒక భారత దేశం వున్నట్లు వుంటుంది గుంటూరు కారం వరంగల్ కారం నూజివీడు మామిడి కాయ కొల్హాపూర్ కారం సా మర్ల కోట నూనె అన్నీ కలిపితే వచ్చేదే ఆవకాయ అన్నీ కలిపితే వచ్చే దే మనం గర్వంచదగ్గ ఆవకాయ అన్నప్రాసన నా డే ఆవకాయ పెట్టినట్లు అని ఒక తెలుగు సామెత వున్నది ఆ సమగ్ర వాతావరణం అన్నీ చోట్ల వుంటే ఎంత బాగుంటుంది మా పెద్దమ్మాయి ఆవకాయ లేనిదే అన్నం తినదు చిన్నప్పుడు స్కూలు కు వెళుతూ ఆవకాయ ముక్క తీసికొని వెళ్ళేది మా మనవడు మనవ రాళ్ళు ఆవకాయ తినటమే కాకుండా ఆవకాయ కాయలు సెలక్షన్ వస్తారు కలపటంలో కూడా సహాయం చేస్తూ వంతులు పడుతూ ఉంటారు నేను అమెరికా వెళ్లి నప్పుడల్లా మా అమ్మాయి స్నేహితులంతా ముందు ఆవకాయ తెచ్చారా ఆంటీ అని అడిగి తర్వాత కుశల ప్రశ్నలు అడుగుతారు ఆవకాయ ఇంట్లో వుంటే అమ్మ వున్నట్లే అన్నట్లు ఇపుడు మా అమ్మాయిలు కోడలు కూడా ఆవకాయ పెట్టటం నేర్చు కున్నారు ఇప్పటికీ మలక్ పేట బామ్మ గారి చలవ వలన పెసర ఆవకాయ నీళ్ల ఆవకాయ బాగా పెడతాను అందరూ ఎలా పెట్టావ్ బాగుంది అని మెచ్చు కుంటే గర్వంగా ఫీల్ అవుతాను మరి ఇదండీ ఆవకాయ కథ మరి మీకూ నచ్చిందా
Comments