శ్రీ రామ నవమి
- murthydeviv
- 3 minutes ago
- 3 min read
శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు.
మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు.
రాములువారి కళ్యాణం అని వీధి వీధికి తాటాకు తో పందిళ్లు వేసే వారు.
మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల మద్య అక్కడ కళ్యాణం
మొదలు పెట్టేవారు. పెళ్ళికి వెళుతున్నట్లే పట్టు లంగాలు అవీ వేసుకుని
బామ్మగారితో తయారు అయి వెళ్ళేవాళ్ళం.
కళ్యాణం అవగానే ఆరోజుల్లో భోజనాలు ఉండేవి కావు. ఆందరికీ పానకం, వడపప్పు, జీడీ మామిడి పండ్లు ఇచ్చేవారు. బహుశా కోస్తా జిల్లాల్లో
ఎక్కువగా జీడీ మామిడి తోటలు వుండంటం వలనేమో.
ఈ హైదరాబాద్ లో జీడీ మామిడి పండ్లు నేను అసలు చూడలేదు.
ఇంక రాత్రికి హరికధలు, బుర్ర కధలు ,బాగా జరిగేవి. పాట కచ్చేరీలు కూడా బాగా జరిగేవి. గుంటూరులో, తెనాలి లో కూడా బాగా జరిగేవి అని మా అత్త గారు చెప్తూ ఉండేవారు.
మా ఊరు దగ్గర లో అవటానికి చిన్న పల్లెటూరు అయినా అక్కడ
ఊరు అంతా పందిళ్లు వేసి వారం రోజులు ఉత్సహం గా చేసే వారు.
సాయంత్రం నుండీ చెక్క భజనలు , కోలాటం , తోలు బొమ్మలు అట
లో రామాయణం ముఖ్య ఘట్టాలు ఆడిస్తూ వుండే వారు.
ఆరోజుల్లో వాటిని రామ నవమి తిరునాళ్ళు అనే వారు. మేము చిన్న పిల్లలగా
వున్నప్పుడు అమ్మగారు ఎవరినైనా తోడుగా ఇచ్చి పంపేవారు
ఆ హడావిడి లో చిన్న పిల్లలు తప్పి పోతారని మేము మా తమ్ముడు ని
వదిలి వెళ్ళటానికి చూసే వాళ్ళము. వాడు మాత్రం ఇంక ఆరోజు అంతా
మా వెంబడే ఉండేవాడు, వదలటానికి వీలు లేకుండా ఇప్పడు అవన్నీ
తల్చుకుని నవ్వుకుంటూ ఉంటాము
మేము కాలేజీ లకు వచ్చాక శ్రీరామ నవమి ఆంటే కరెక్ట్ గా పరీక్షల రోజులు.
ఎన్నో మార్పులు వచ్చి ఉదయాన్నే, అన్నీ పందిళ్ల దగ్గరా ఉదయం, సాయంత్రం
పాటలు మైకు లు పెట్టి మరీ వేసేవారు. చాలా గొడవ గా ఉండేది. కానీ
ఎవరికీ చెప్ప లేము కదా .
ఆ రోజుల్లో ప్రతి గదిలో ఫ్యాన్లు అవీ కూడా ఉండేవి కావు. గాలి కోసం
తలుపులు తీసి పెట్టాల్సిందే .
మధ్య మధ్యలో మా అన్నయ్య వెళ్లి కొంచెం సౌండ్ తగ్గించండి బాబూ
అని బ్రతిమిలాడి వస్తూ ఉండేవాడు.
చివరి రోజు వూరేగింపు జరిగేది. చాలా మంది పిల్లలు కు సీతా రామ లక్ష్మణుల లాగా వేషాలు వేసే వారు. ఆంజనేయ స్వామిగా వేసిన పిల్లలు ఎగురుతూ ఉంటే
ముద్దుగా ఉండేది.
అందరూ రామాయణం గురించి అందులోని పాత్రలు గురించి చాలా రాశారు
నేను కేవలం అప్పటి జ్ఞాపకాలు పంచుకుందాం అనుకున్నాను.
మా ఊరులో సినిమా దియేటర్లు అన్నీ గుమి గూడి నట్లు వూరికి సెంటర్ లో ఉండేవి.
వూరి కి చివరగా మా ఇంటి కి దగ్గర లో ఒక సినిమా హాలు ఉండేది.
ఎక్కువగా పాత సినిమాలు, హిట్ కానీ హిందీ సినిమాలు వస్తూ ఉండేవి.
ఎందుకో తెలియదు కానీ లవకుశ సినిమా అక్కడ వచ్చింది. 1963 లో
ఎస్ ఎస్ ఎల్ సీ పరీక్షలు అవగానే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము.
మా మేడ మీద కూర్చుంటే పాట లు వినిపిస్తూ ఉండేవి. ఆలా పాటలు విని
నేర్చుకోవటమే కాక, సినిమా బాగుందని వచ్చిన బంధువులుని, బామ్మలను
తీసుకుని ఎన్నో సార్లు చూసాము..
అప్పట్లో యాక్షన్ గురించి పాత్రలు గురించి అంత తెలియదు.
టీ వి వచ్చాక జెమినీ టీ వి లో ఎన్నోసార్లు లవకుశ చూసాను.
అందులో అంజలి దేవి యాక్షన్ చూస్తే సీతా దేవి ఇలాగే వుంటుందా
అనిపిస్తుంది.
లక్ష్మణుడు అడవిలో దింపినప్పుడు, రామ కథను వినరయ్యా పాట లో
అశ్వమే ధ యాగం గురించి తెలిసినప్పుడు, చివరికి
భూదేవి లో ఐక్యం అవుతున్నపుడు అంజదేవి గా కాకుండా సీతా దేవి
అక్కడ వున్నట్లు అనిపిస్తుంది.
హిందీ లో రామానంద సాగర్ గారి రామాయణం కూడా ఎంతో గొప్పగా వుంటుంది. నార్త్ ఇండియా లో టీ వి లకు హరతులు ఇచ్చి
మరీ చూసే వారుట
ఆ రోజుల్లో రామాయణం, భారతం రెండూ ఇంటిల్లి పాది టీ వి ముందు కూర్చుని చూసే వాళ్లము.
మాకు తెలిసిన ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ తమిళయన్ వాళ్ళ అబ్బాయి,
మా అమ్మాయి యూ ఎస్ లో స్నేహితులు.
అయన ఇండియా అంతా తిరిగి శ్రీరాముల వారు అయోధ్య నుండీ శ్రీలంక
ఏ దారులు గుండా వెళ్లారు అని రీసెర్చ్ చేసి బుక్ రాశారు.
ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు అయన తో మేము కూడా భద్రాచలం
హంపి వెళ్ళాము.
అక్కడికి వెళ్లి ఎక్కువగా పెద్ద వాళ్లతో మాట్లాడుతూ చిన్న చిన్న గుడులు,
రాళ్లు అన్నీ కలెక్ట్ చేసి ఎంతో శ్రమ చేసి బుక్ రాశారు.
ఆలా అసేతు హిమాచలము రామ కధతో రామ భక్తులు తో నిండి వున్నది.
రాముడు పుట్టిన నేల లో పుట్టినందుకు గర్విస్తూ రాముడి పుట్టినరోజు
నాడే కళ్యాణం చేసుకునే మన సీతా రాములని మనల్ని చల్లగా
దీవించమని వేడుకుందాము.
క్షిరాబ్ది శయనా శృంగార మొహనా కారుణ్య ధనుజా మర్ధనా
పరమ పురుషా స ర సీజ లోచనా హారతి గై కొనుమా
ముని యాగము గాచి గౌతము సతి బ్రోచి త్రినేత్రుని విల్లు విరచి
మురయుచు సీత ను పాణిగ్రహించి అయోధ్య చేరిన రాఘవ క్షీరాబ్ది.
అండజా వాహనా పండిత భూష. ణా, కుండలి శయనా కేశవా
నీ అండ చేరిన వారి నెల్లా భూ మండ లా దీ శ బ్రోవరా క్షీ రాబ్ది
పరాత్ప రు డవని నిన్ స్మరించి నన్ క నికరము కలుగదాయెగా
హరిహరా కోసలాపుర వాసా హారతిదే గై కొనుమా క్షిరాబ్ది
Comments