మరపురాని మధుర గీతాలు 2
- murthydeviv
- 1 day ago
- 3 min read
Updated: 5 hours ago
ఈ రోజు పేస్ బుక్ తెరవగానే బందిని సినిమా లో ఎస్ డి బర్మన్ గారి పాట ఎవరో పోస్ట్ చేసారు.
ఒరే మాజీ , మేరె సాజన్ హై ఉస్ పార్ , ఆ క్షణం లో సినిమా చూస్తున్నప్పుడు పాట కన్నా నూతన్ ఏం చేస్తుంది
అనే టెన్షన్ వుంటుంది.
బర్మన్ గారి మ్యూజిక్ ప్రశాంతంగా ఒక నది లో అలలు మెల్లగా చిరు సవ్వడి చేస్తూ కదిలిపోతునట్లు
వుంటుంది..
మన కాలేజీ రోజుల్లో పాటలు వినటమే కానీ చూడటానికి అవకాశం లేదు కదా, ఆ పాట ఈ సినిమా లో,
పాడిన వాళ్ళు ఎవరు అనే కానీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అంత తెలిసేది కాదు.
అసలు హిందీ పాటలు గురించి, సినిమాలు గురించి మా అన్నయ్య బెనారస్ లో చదువు కోసం వెళ్ళాక
తెలిసింది. అంత క్రితం మా అత్తయ్య గారి ఇంట్లో ఎక్కువగా ఆవారా, ఆహ్ తెలుగులో ప్రేమ లేఖలు
పాటలు ఎక్కువుగా గ్రామఫోన్ లో పెట్టే వారు.
బర్మన్ గారి పాటలు మొదట గా విన్నది, పేయింగ్ గెస్ట్ అన్నయ్య రికార్డు తెచ్చాడు.
అందులో పాటలు అన్నీ నా ఫేవరెట్ పాటలు అయిపోయాయి.
బినాక గీత్ మాల వినటం మొదలు పెట్టాక మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి తెలిసింది.
ఇంక ఫ్రైండ్స్ తో ఈ పాట బాగుంది, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాదనలు కూడా నడిచేవి.
జనరల్ గా ఆరోజుల్లో దేవానంద్ అమ్మాయిల ఫేవరెట్ హీరో , మిగతా వాళ్ళు ఎంత మంది వున్నా
దేవానంద్ కీ బాగానే ఫాలోయింగ్ ఉండేది.
ఏ అప్నా దిల్ ఆవారా పాట , తర్వాత చాలా మంది మౌత్ ఆర్గాన్ కొనుక్కొని ప్రాక్టీస్ చేసే వారు
జీవన్ కీ సఫర్ మే రాహి మునిమ్ జి లో పాట, సినిమా ఎపుడూ చూడలేదు కానీ ఆ పాట మాత్రం
రేడియోలో వస్తూ ఉండేది..
ఆరోజుల్లో ఒకే పాట రెండు వెరషన్స్ ఉండేవి. ఈ పాట కూడా రెండు వెర్షన్స్ రెండూ బాగుంటాయి.
చల్తీ కా నామ్ గాడి కూడా బ ర్మన్ గారి సంగీతం ,
అందులో పాపులర్ పాట బాబూ అనే పాట, కానీ నాకు మాత్రం ఏక్ లడికి భీగిసి అనే పాట నచ్చుతుంది.
మిగతా పాటలు కూడా సినిమా లాగానే సరదాగా వుంటాయి. ముఖ్యం గా మధుభాల విలన్ని
ఆపటానికి
పాడే పాట సరదాగా వుంటుంది.
ప్యాసా, కాగజ్ఎ కా పూల్ , మిస్టర్ అండ్ మిస్సెస్ 55 అన్నీ గురుద త్ గారి సినిమాలు . అన్ని పాటలు హిట్
పరేడ్ పాట లే.
మేము కాలేజీ లో చదువుకునేటప్పుడు గురు దత్ గారు చనిపోయారు అని తెగ ఫీల్ అయిపోయాము
ఆ రోజుల్లో హిందీ సినిమాలు ఫస్ట్ రిలీజ్ చిన్న ఊర్ల లో వచ్చేవి కావు.
మంచి పాటలు రేడియోలో విని సినిమా చూడాలి అని వచ్చినపుడు వెళ్లే వాళ్ళము.
కొన్ని సినిమాలు కొంత మెంటల్ మెచ్యు రి టీ వచ్చాక చూస్తే కానీ వాటి విలువ అర్ధం కాదు.
బందిని, అమర్ ప్రేమ్ సఫర్, మౌసమ్, మమతా ఈ సినిమాలు అన్నీ ఆకోవ కీ చెందినవే.
బందిని లో అన్ని పాటలు ఆణి ముత్యాలు ఏమాత్రం హంగులు లేకుండా
ఒక చక్కటి సినిమా ఎలా తీయచ్చో బిమల్ రాయ్ గారు చెప్పినట్లు వుంటుంది.
బిమల్ రాయ్ గారి సినిమా సుజాత కూడా ఒక అపురూపమైన
సినిమా ఆ సినిమా లో. కూడా బర్మన్ గారి. మ్యూజిక్
అన్నిటికన్నా నాకు నచ్చే పాట జల్తే హై జీ ఎస్ కే లీ ఏ
ఫోన్ లో పాడే పాట చాలా మెలోడియస్ గా ఉంటుంది
అలాంటి
సినిమా నే ఆశీర్వాద్ అందులో అశోక్ కుమార్ గారు స్వయంగా ఒక పాట
పాడారు. ఇందులో కొన్ని పాటలు గుల్జర్ గారు రాశారుట.
ఆశీర్వాద్, బందిని , మమతా మౌసమ్, అమర్ ప్రేమ్ ఇలాంటి సినిమాలు చూసిన ప్పుడు
రెండు మూడు రోజులు ఆ పాత్రలే మన మనసుల్లో తిరుగుతూ వుంటాయి.
మధు మతి సినిమా లో సలీల్ చౌదరీ గారు అందించిన సంగీతం సినిమాలో
వైజయంతి మాల లాగానే హుషారుగా , వుంటాయి.
మమత లో రహేన రహే హమ్ యుగళ గీతం అయినా కొంత జీవిత సత్యాలు కుడా వుంటాయి.
రోషన్ గారి సంగీతం అనుకుంటా . తాజ్ మహల్ సినిమా లో కూడా ఎన్నో మధుర గీతాలు స్వర కల్పన చేసారు
వక్త్ సినిమాలో హీరో హీరోయిన్ పాటల కంటే బాలరాజ్ సహాని , క్లబ్ సాంగ్ ఎక్కువగా
పాపులర్ అయ్యాయి రవి గారి మ్యూజిక్.
ఆ రోజుల్లో సినిమా ఎలా వున్నా పాటలు కోసమే సినిమా చూసే వాళ్ళు వుండే వారు.
సినిమా తీయాలి అనుకున్నప్పుడే ముందే మ్యూజిక్ డైరెక్టర్ ని,
రచయిత ల తో సిట్యుయేషన్స్ డిస్కస్ చేసుకుని పాటలు కంపోజ్ చేసే వారు
అందుకే అన్నీ మంచి పాటలు స్వర కల్పన చేయ గలిగారు.
ఇప్పటికీ ఆ పాటలకు యూ ట్యూబ్ లో ఎన్నో లైక్స్ వస్తూ వుంటాయి.
అలాంటి మంచి పాటలు మళ్ళీ రావాలని ఆశిద్దాము.
మల్టీప్లెక్స్ లు అయితే కట్ట గలరు కానీ అలాంటి ఆణి ముత్యాలు లాంటి సినిమాలు
ఏవరు తీస్తారు అనిపిస్తుంది..
ఈ మధ్య కొన్ని పాటలు విన్నా , ఓటీ టీ లో కొన్ని సినిమాలు చూసినా
భాష కు, కల్చర్ కు ఎంత హీన స్థితి వస్తున్నది అనే భాధ కలుగుతుంది.
మంచి తెలుగు సినిమాలు వచ్చే ధీయే టర్స్ చాలా మటుకు మూత పడి పోయాయి.
ఏ ఫ్ మ్ రేడియో లో వాళ్ళు చెప్పే మాటలు విన కుండా మనకు వున్న
మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ని తలచుకుని
శ్రా వ్య మైన పాటలు తలచు కుని విని ఆనందం పొందుదాం.
బర్మన్ గారి గురించి చెప్పుకున్నపుడు గైడ్, ఆరాధన, అభిమాన్ తలచుకోక పొతే ఎట్లా,
గైడ్ లో
అజ్ ఫిర్ జీనేకి తమన్నా, గుర్తు వస్తే మన మనసు కూడా గా తా రహే అంటుంది.
ఆరాధన లో కూడా అయన ఒక పాట పాడారు. ఆ సినిమా లో కూడా అన్నీ హిట్ పరేడ్ పాటలు. A
అభిమాన్ కూడా సంగీత ప్రధానమైన సినిమా ఆ పాటలు కోసమే సినిమా అన్నట్లు వుంటుంది.
ఈ మధ్య ఏదో కొత్త సినిమా లో అభి నా జావో చోడ్కర్ అనే పాట పెట్టారు.
ఆ పాట నే ను బర్మన్ గారిది అనుకున్నాను. కానీ ఆ పాట జయ దేవ్ గారిదిట
మా గ్రాండ్ కిడ్స్ ఆ పాట వింటూ ఉంటే కొంచెం పాత పాటల రుచి చూపించాను.
సో కార్ లో వెళ్ళేటప్పుడు కొన్ని ఆ పాత మధురాలు కూడా వింటూ వుంటారు.
పాటలు పరేడ్ చేశాను అనుకోకుండా మీరు కూడా ఆ పాత మధురాలని వీనుల విందు గా వినండి
F


Comments