మరపురాని మధుర గీతాలు
- murthydeviv
- 3 hours ago
- 3 min read
కొన్ని పాటలు వింటూ ఉంటే ఒక జలపాతం నుండీ నీరు వేగంగా ఉరికి పడుతూ వున్నట్లే వుంటుంది.
వినటం తోటే మనసుకు కూడా కొత్త ఉత్సాహం గా వుంటుంది.
చిన్నప్పటినుండి రేడియో ఆలా వింటూ ఉండటం ఒక అలవాటు. రేడియో లో ఏడు గంటలకు మొదలు అయ్యే
జయమాల నుండీ ఛాయా గీత్ వరకు వినే వాళ్లము. మధ్య లో ఏదో డ్రామా వచ్చేది.
అప్పుడు మాత్రం రేడియో కి రెస్ట్. ఆ రోజుల్లో హిందీ అంత అర్ధం అయ్యేది కాదు.
ఆలా జలపాతం లాగా వచ్చే పాటలు ఎక్కువగా శంకర్ జై కిషన్ గారివే ఉంటాయి.
కొన్ని సినిమాలు హిట్ కాక పోయినా ఆ పాటలు మాత్రం ఇప్పటికీ వింటే కొత్తగా ఉంటాయి.
హరియాలి ఔర్ రాస్తా సినిమా పాటలు అన్నీ ఎపుడూ విన్నా కొత్తగానే వుంటాయి
జిస్ దేశ్ మే గంగా బహెతి హై లో అన్నీ పాటలు హిట్ పేరెడ్ పాట లే.
క్యా హువా అనే పాట లో ఎంత హడావిడి వుంటుంది ఆంటే ఆ హీరోయిన్ ఎలా డాన్స్ చేసిందో అనిపిస్తుంది.
అలాగే గ్రూప్ సాంగ్ లో కూడా ఎంత మ్యూజిక్ ఉంటుందో ఎన్ని ఇంస్ట్రుమెంట్స్ వాడారో తెలియదు కానీ
ఒక ప్రవాహం లాగా వుంటుంది.
శ్రీ 420 లో రామయ్యా వస్తావయ్యా అనే పాట కూడా అలాగే వుంటుంది. ఆ సినిమా లో ప్యార్ హువా ఏక్ రార్ హువా హై
మధురమైన పాట. జిస్ దేశ్ మే తర్వాత ఆషిక్ అనే సినిమా వచ్చింది పాటలు మాత్రమే హిట్ పరేడ్ లో నడిచాయి.
సినిమా మాత్రం ప్లాప్
ఆహ్ తెలుగులో ప్రేమ లేఖలు డబ్బింగ్ రెండు సినిమాల్లో పాటలు
మంచి హిట్ అయిన పాటలు
జిస్ దేశ్ మే లో రకరకాలుగా వాయిద్యాలు ఓకే హంగామా చేసాక ఒక చిన్న పాప నవ్వుతో మొదలు అయ్యే పాట
ఆ పాప నవ్వు చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో , ఆరోజుల్లో మ్యూజిక్ కి , పాట లు కు ఎంత ప్రాముఖ్యత
ఇచ్చారో అనుకుంటాను.
ఆ సినిమా లో అన్నీ పాటలు ఆణి ముత్యాలు.
అనాడి సినిమా లో కూడా అన్నీ పాటలు బాగుంటాయి. కాక పొతే హీరో కి హీరోయిన్ తన గురించి అబద్దం
చెప్పింది ఆని తెలుస్తుంది. విషా దం కోపం కలిసి హీరో ఒక పార్టీ లో పాడే పాట , అందులో ఒక డాన్స్ ఎంత
ఫాస్ట్ మ్యూజిక్ తో ఆ డాన్సర్ వేసే స్టెప్స్ ఎంత అందం గా వుంటాయో.
ఆ సినిమా లో కూడా అన్నీ పాటలు ఎపుడు విన్నా కొత్త గానే వుంటాయి.
ఓ చాంద్ ఖీలా ఓ తార్ హసీ ఆంటే నూతన్ ఆ చాంద్ లాగా అనిపిస్తుంది.
దిల్ కి నజర్ సే కూడా ఒక హాయి గొలిపే పాట.
ఈ రెండు పాటలు ఆ సంగీత ద్వయం ప్రశాంతమైన సంగీతం తో స్వర కల్పన చేసారు.
లతాజీ స్వరము కూడా ఒక వీణ మీటి నట్లు సాగుతూ హాయి గొలుపుతూ వుంటుంది.
అలాంటి పాట ఏ రాతే ఏ మౌసం కిషోర్ కుమార్ లత గారు పాడిన పాట , నూతన్ అందాల గురించి చెప్పే ది
ఏముంటుంది , వెన్నెల లో విహరించినట్లే వుంటుంది. ఈ పాట ఈ మధ్య సనమ్ గ్రూప్ వాళ్ళు కూడా
యూ ట్యూబ్ లో కూడా పాడారు. రవి గారి సంగీతం అనుకుంటాను.
చోరీ చోరీ, శ్రీ 420 లో కూడా అలాంటి మరుపురాని గీతాలు చాలా వున్నాయి. ఇప్పటికీ ఇండియన్ ఐ డాల్
ఇంకా సూపర్ స్టార్ సింగర్ లో పాడుతూనే వుంటారు..
మా చిన్నప్పుడు మేరా జూతా హై జపాని ఆంటే అప్పట్లో ఒక పానీ కే అర్ధం తెలుసు , నీళ్లు ఏమిటో అనుకునే వాళ్ళము. శైలేంద్ర సాహిత్యం లోనే ఒక విదమైన వేదాంతం వుంటుంది. తీసరి కసం సినిమా హిట్ కాక పోయినా అందులో పాటలు బాగుంటాయి. కొన్ని ఉత్తర్ ప్రదేశ్ ఫోక్ సాంగ్స్ కూడా వున్నాయి .సాహిత్య పరంగా మంచి పాటలు
ఆ సినిమా ఆయనే తీశారు అనుకుంటా.
సంఘమ్ సినిమా లో అన్ని పాటలు హిట్ , బినాకా గీత్ మాల లో మోగి పోయేవి.
నాకు మాత్రం హర్ దిల్ జో ప్యార్ కరేగా పాట చాలా నచ్చుతుంది. ఆ ఇస్ట్రుమెంట్ పేరు తెలియదు కానీ
పాట చివర ఆ మ్యూజిక్ సూపర్బ్ అనిపిస్తుంది. ఏ మేరా ప్రేమ్ పత్ర బాగానే వుంటుంది.. నా ఫేవరెట్ పాట
మాత్రం హర్ దిల జో నే.
మేరా నామ్ జోకర్ వరకు శంకర్ జై కిషన్ తర్వాత మా రి పోయారు పాటల్లో కూడా ఆ మాధుర్యం లేదు.
దేవా నంద్ సినిమాలు కు జనరల్ గా బ ర్మన్ గారి మ్యూజిక్ వుంటుంది.. కానీ జబ్ ప్యార్ కిససె హోతా హై కి
మాత్రం శంకర్ జైకిషన్ లే మ్యూజిక్ ఇచ్చారు మొదటి పాట లోనే ఆ సంగీత జలపాతం ఉరుకుతుంది.
కొత్త పదాలు వాడుతూ పాడిన పాట కుఫి యమ్మా , సౌ సాల్ పహెలే , ఎంత హుషారుగా వుంటాయో
చివరి పాట తేరి జూల్ఫో మే అంత ప్రశాంతంగా సాగుతుంది.
దిల్ అప్నా ప్రీత్ పరాయే సినిమా లో అజీబ్ దాసతా హై ఏ కహా షురూ కహా కతం,
రాత్ ఔర్ దిన్ లో దిల్ కి గృహ ఖోలదో పాట లో కూడా మ్యూజిక్ హంగామా చాలా వుంటుంది.
మన్నాడే లతా గారు శంకర్ జై కిషన్ మ్యూజిక్ లో పాడిన పాట.
చాలా రోజుల తర్వాత నర్గీస్ నటించిన సినిమా, నేను చూడలేదు కానీ పాట వింటూ వుంటాను.
లాంగ్ డ్రైవ్ లో వెళుతూ ఇలా మధురమైన పాటలు వింటూ ఉండటం చాలా ఇష్టం.
చిన్నప్పటి నుండీ అలవాటు కాబట్టి మా పిల్లలు కి కూడా ఇష్టమే.
ఎన్నో మధురమైన పాట లు వున్నా, కొన్ని మాత్రమే గుర్తు చేసుకున్నాము. ఇంకా ఎన్నో మధురమైన పాటలు
అందించిన మ్యూజిక్ డైరెక్టర్ లను ఇంకోసారి గుర్తు చేసుకుందాము.
ఇప్పటి పాటలు గురించి ఎపుడైనా వింటే భాధ వచ్చి ఇలా పాత పాటలు గుర్తు చేసుకోవాలి అనుకుంటాను.
తెలుగు లోని పాటలు గురించి ఇంకొక సారి ముచ్చట చెప్పుకుందాము.
.


Comments