మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రుమయీ పెట్టటం అనే ఆచారం ఉండేది. భోగి ముందు రోజే ఇంటి పూజారి వచ్చి బంకమట్టి తో సంక్రుమయీ బొమ్మ ను తయారు చేసెవారు. ఆ ఏడాది పంచాగం లో సంక్రుమయీ ఎలా ఉంటాడు ఆ వాహనం మీద వస్తాడు అని రాసి ఉంటుంది. ఆ ప్రకారం పూజారి సంక్రుమయీ ని తయారు చేసాక బొమ్మలు దగ్గర మందిరం లో ప్రతిష్ఠ చేసేవాడు తరువాత అమ్మ, మా చేత పూజ చేయించి శనగలు పండ్లు నైవేద్యం పెట్టించేది ఆ తరువాత మా అమ్మ మహానైవేద్యం పెట్టేది. మొదటి రోజు మా అందరికి భోగి పండ్లు పోసేది. మేము కాలేజీ కి వచ్చాక కూడా మా అమ్మ భోగిపండ్లు పోసినట్లు గురుతు. మరునాడు మేము మా స్నేహితులను పిలిచి పేరేంటం చేసావాళ్ళం
మన సంక్రాతి:3
murthydeviv
Comments