top of page
murthydeviv

మన సంక్రాతి

ఇంక ధనుర్మాసం ఇప్పటిలాగా ముందు రోజే సంక్రాతి ముగ్గులు గొప్పగా రంగులుతో పనివాళ్ల చేత వేయించటం కాదు. ఉదయం అంటే తెల్లవారుజామున ఏ నాలుగు గంటలకు లేవాలి. చలి లో ముగ్గులు వేసి చల్లటి పేడలో చేతులు పెట్టి, గొబ్బమ్మలు చేసి, రక రకాలు గ పూల తో అలంకరించి ముగ్గులో పెట్టాలి. మా చెల్లెళ్ళు ముగ్గులు పేటి గొబ్బమ్మలు పెట్టి పూలతో పసుపు, కుంకుమ వేసి చక్కగా అలంకరించే వాళ్లము. ధనుర్మాసం పూజ కి వచ్చిన, మేళగాళ్ళు ఇవ్వని చేసి "అబ్బా! ఇంకో సారి పడుకుందాము" అనుకునే లోపల నాన్న గారి పూజ అయింది. "స్నానాలు చేసి తయారు అవండి" అని అమ్మ ఆజ్ఞ. ఉదయం ఎనిమిది గంటలుకు అన్ని రకాల పిండి వంటలు తో భోజనాలు నాన్న గారు మాములుగా వచ్చే పూజారి కాకుండా ఇంకో ఇద్దరు ,ముగ్గురు బ్రాహ్మలు తో భోజనాలు. తొమ్మిది గంటలుకల్లా గుడి నుండి వచ్చే వూరేగింపు కు హారతి పళ్ళెంతో తాంబూలం, పండు పెట్టుకొని వాకిట్లో తయారుగా ఉండాలి. వూరేగింపు మన కోసం కొంచం ఆగాల్సి వచ్చిందంటే ఇంట్లోకి రాగానే నాన్న గారి తో అక్షింతలు తప్పవు"



66 views0 comments

Recent Posts

See All

Na nomulu 5

హైదరబాద్ రాగానే అక్కయ్య ఆద్వర్యం లో శ్రావణ మంగళ వారం శుక్రవారం నోములు మొదలు పెట్టాను శ్రావణ శుక్రవారం నాడు అక్కయ్య మా అత్తయ్య లాగానే అమ్మ...

నేను నా నోములు 4

నా వివాహం అయ్యాక ఒక 5ఇయర్స్ పంజాబ్ లో వున్నాము తర్వాత హైదరబాద్ వచ్చాము పంజాబ్ లో వున్నపుడు శ్రావణ మంగళవారం నోము పూర్తి చేయలేక పోయాను...

నేను నా నోములు 3

ఈ హైద్రాబాద్ లో కూడా మా అత్తగారు చాలా సార్లు పొయ్యి పెట్టీ పాలు పొగించి రథ సప్తమి నాడు పరమాన్నం చేసే వారు నోములు పట్టా లంటే రథ సప్తమి...

Comments


bottom of page