top of page
Search

పెళ్లిళ్లు ఆనాడు ఈ నాడు

murthydeviv
Nov 5
2 min read

ఈ రోజు ఫేస్ బుక్ లో గురుదత్ గారు తీసిన సినిమా మిస్టర్ & మిసెస్ 55 అనే సినిమా గురించి ఎవరో చెప్తున్నారు.

సినిమా సరదా గా ఉంటుంది. గురుదత్ , మధుబాల చూడ చక్కని యాక్టర్స్ , మంచి పాటలు ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కగా సాగుతుంది.

ఆ సినిమా చూస్తూ ఉంటే ఇప్పటి పరిస్థితులు కీ చక్కగా సరిపోతుంది అనిపిస్తుంది..సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వచ్చాక అమెరికా వాళ్ళు ఇండియా లో జీతాలు ఇవ్వటం మొదలు పెట్టాక ముందు గా మార్పు పెళ్లిళ్లలో, తర్వాత కల్చర్ లో చాలా మార్పులు వచ్చాయి.

తల్లీ తండ్రులు ఆబ్బాయి అయినా అమ్మాయి అయినా సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉంటేనే గొప్ప మిగతావి పనికిరాని వి అనే ధోరణి వచ్చింది. ఇంక ఫ్యామిలీ బిజినెస్ లో వున్న వాళ్ళు కీ అసలు ప్రొఫైల్ కూడా చూడరు.

అమ్మాయి. అన్నింటిలో ఆబ్బాయి కన్నా ఎక్కువగా ఉండాలి అనుకుంటూ , జీతం లో తన కన్నా తక్కువ వాడిని చేసుకోవటం ఇస్ట పడరు. తల్లీ తండ్రులు అంతే..

అసలు సాఫ్ట్ వేర్ కాకపోతే వివరాలు కూడా వినరు..

ఆలా వెతుకుతూ ఏళ్లు గడిచిపోయి పెళ్లి వయసు కూడా దాటిపోతుంది. ఎంతోమంది మగపిల్లలు వేరే ఉద్యోగాలు బ్యాంకు, యూనివర్సిటీ, కాలేజీ లెక్చరర్ కీ అసలు ఏ మ్యాచ్ లు రాక ఆలా ఉండిపోతున్నారు.

అసలు ఇంక కల్చర్ గురించి మాట్లాడే పనే లేదు.

ఇలా సమాజం లో ఎన్ని మార్పులు చెప్ప లేము . ఒకప్పుడు అమ్మాయిల తల్లీ తండ్రులు బాధ పడే వాళ్ళు ఇప్పుడు అబ్బా యి ల తల్లీ తండ్రులు బాధ పడుతున్నారు.

ఇంతకీ సినిమా కీ నేను రాసినదానికి ఏమిటీ సం బంధం అనుకుంటుంన్నారు కదా , ఆ సినిమా లో అస్తీ వున్న మేనకోడలు

కీ మేనత్త గార్దియన్.

హీరోయిన్ తండ్రి తన కూతురు పెళ్లి చేసుకుంటేనే అస్తీ వస్తుంది అని వీలునామా రాస్తాడు. ఆ మేనత్త పెళ్లి చేసుకోలేదు.

స్త్రీ ల హక్కులు గురించి మాట్లాడుతూ సమాజ సేవ చేస్తూన్నా ను అనుకుంటూ ఉంటుంది.


అస్తీ కోసం ఒక నిరుద్యోగ యువకుడితో మేనకోడలు పెళ్లి చేసి అస్తీ వచ్చాక విడాకులు ఇప్పించా లి అనే

ప్లాన్ తో హీరో తో అగ్రిమెంట్ రాయిస్తుంది

కధ సరదాగా సాగుతుంది.


గురుదత్ హీరో గా వేశారు

డైరెక్టర్ కూడా ఆయనే అనుకుంటా , మధుబాల హీరోయిన్

లలిత పావర్ మేనత్త చక్కటి సినిమా మంచి పాట లు యూ ట్యూబ్ లో వున్నది.

ఆ మేనత్త ని చూస్తే నాకు ఇప్పటి తల్లీ తండ్రులు గుర్తు వచ్చారు.

అందుకే ఇలా కంపేర్ చేశా ను






 
 
 

Recent Posts

See All
వన భోజనం

కార్తీక మాసం అనగానే కొంత నొస్టాలజియా వుంటుంది , ఎవరి కయినా , అందరూ వాళ్ళ చిన్నప్పటి రోజులు తల్చుకుంటూ వుంటారు. నాకు అయితే దీపావళి వెళ్ళి కార్తీక మాసం వచ్చినప్పటి నుండీ మా పుట్టింట్ల

 
 
 
నాగుల చవితి

బినాగుల చవితి ఏమిటి? నాగుల షష్ఠి అనవచ్చు కదా !చవితి ఏమిటి? భూమి లోపల నివసించే నాగదేవతలను (సర్పాలను) ఆరాధించే పండుగ నాగుల చవితి. కార్తిక మాస శుక్ల పక్ష చవితి నాడు (కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుక్ల చవి

 
 
 
ప్రయాణం

దీపావళి తర్వాత వరుస పండగలు మన భక్తి ఈ మధ్య పండగ హడావిడి, భాయ్ దూజ్ అని ఇద్దరు అమ్మాయిలు కలిసి తమ్ముడి కీ మర్యాద లు వారం రోజులు నుండి హడావిడి గా గడిచి పోయింది. మధ్యలో మా అబ్బాయి పిల్లలు మేజర్లు అయి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page