top of page
Search

నా హాలీవుడ్ యాత్ర

  • murthydeviv
  • 7 hours ago
  • 3 min read

ఇంగ్లీష్ వింగ్లీ ష్ ఆ సినిమాలో శ్రీదేవి ని చూసినట్టే నా మనవ రాళ్లు కూడా నాకు ఇంగ్లీష్ రాదు అర్థం కాదు అనుకుంటారు.

మీకు ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు , నాకు మూడు భాషలు వచ్చు , అనీ వాళ్ళ కు చెప్తూ వుంటాను.


ఈ రోజు ఈ ఇంగ్లీష్ గొడవ ఎందుకు వచ్చింది ఆంటే డిన్నర్ టేబుల్ దగ్గర నా మనవ రాలు నాకు గ్రీగిరీ పెక్ అంటే ఇష్టం అనీ వాళ్ల నాన్నతో చెపుతున్నది.

మా అమ్మాయి పిల్లలు తో కలిసి యూ ట్యూబ్ లో రోమన్ హాలిడే సినిమా చూసారు.. అందుకు పెక్ ఫాన్

అయిపోయింది.


అయితే మన చిన్న తనంలో అయితే మన అమ్మా నాన్నలకు ఆలా చెప్పే సాహసం ఉండేది కాదు,


నేను గ్రీగిరీ పెక్ మిగతా సినిమాలు చెప్పి అవీ చూసావా అనీ అడిగాను. ఆ సినిమాలు నీకు ఎలా తెలుసు అనీ మొదట అనుమానం .


ఆ ప్రశ్న కు సమాధానం మా ఆబ్బాయి చెప్పాడు, నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూసాను అనీ , ఆ నవలలు కూడా చదివాను అనీ.


నాకు వెంటనే పాత రోజులు గుర్తు వచ్చాయి. మేము పంజాబ్ వెళ్లిన కొత్తలో బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయి సినిమా

వచ్చింది. మాములుగా అక్కడ తెలుగు వాళ్లతో కలిసి హిందీ సినిమాలు వెళ్ళే వాళ్లము.


వాళ్ళు ఆ సినిమా కి రాను అన్నారు, మావారు షరా మాములు గా సినిమాలు ఆంటే ఇంటరెస్ట్ తక్కువ, నీకు ఇంగ్లీష్ ఏం అర్ధం అవుతుంది, అనే ప్రశ్న , మీకు అర్ధం అవుతుంది కదా , చెప్పండి అనీ ఎట్లా గో ఒక ఆదివారం

బయలు దేరాము.

మా దంపతులు ము ఎప్పుడూ ఏ సినిమా మొదటి నుండీ చూడ లేదు. ఈ హైదరాబాద్ వచ్చాక నేను, బంధువులు తో , పిల్లలు తో సినిమాలు చూడటమే , తర్వాత శబరి లాగా ఆ సినిమా శ్రీవారు కి

నచ్చుతుంది అనుకుంటే సెకండ్ షో కి టికెట్స్ తెప్పించి సినిమా అయిపోయే లోపల వెళ్ళటమే.


అలాగే సినిమా మొదలు అయ్యాక చీకట్లో సీట్స్ వెతుక్కుని కూర్చుంటే అక్కడ దిలీప్ కుమార్,

వై జయంతి మాల డ్యూయెట్ పాడుతున్నారు

కరెక్ట్ హాల్ కే వచ్చాము కదా అనుకుంటూ , అక్కడే వున్న గేట్ కీపర్ ని అడిగాను, ఆ ఇంగ్లీష్ సినిమా కలెక్షన్ లేక

రెండు రోజులకే వెళ్లి పోయిందిట..

ఏ సినిమా అయితే ఏమిటీ అంటూ మా వారు సినిమాలో లీనం అయ్యారు..


మా బంధువులు లో ఒక అమ్మాయి సినిమా మొదటి నుండీ చూడక పొతే ఇష్టం ఉండదు ట

ఒకసారి మా తో సినిమాకి వచ్చి సినిమా మొదలు అయ్యిందని మొత్తం సినిమా చూడకుండా కళ్లు మూసుకుని కూర్చుంది.


ఆ రోజు నాకు కూడా ఆలా చూడ కూడదు అనుకున్నా కానీ వైజయంతిమాల కదా నా ఫేవరెఁట్ యాక్టర్

సో చూసేసాను.


సరే మరలా నేను నా గ్రాండ్ చిల్డ్రన్ దగ్గరకి వస్తే పోయిన వారం ఏదో ఇంగ్లీష్ సినిమా కి వెళ్తూ

నేను రాను అన్నా , ఇంట్లో బోర్ కొడుతుంది రా అనీ తీసుకుని వెళ్లారు.


అసలు ఈ మధ్యలో సినిమాలు కే వెళ్ళటం లేదు , ఏకంగా ఇంగ్లీష్ సరే బయలు దేరాను.


ఆ సినిమా పేరు the devil wears prada 2 ఇంత క్రితం వచ్చిన సినిమాకి సీక్వెల్ ట

సినిమా బాగానే వుంది , వ్యాపారం , ఎత్తులు, పై ఎత్తులు , చివరికి హీరోయిన్ తన సమర్థత

ప్రూవ్ చేసుకుంటుంది..


సినిమా అయిపోగానే చిన్న బ్యాచ్ అర్ధం అయిందా అంటూ నన్ను ఇంటర్వ్యూ చేసారు.

వెంటనే మా ఆబ్బాయి ఎప్పుడో బామ్మ మీకు క్లాస్ తీసుకుంటుంది అనీ వార్నింగ్ ఇచ్చాడు.


నిజం గానే ఆ రోజుల్లో ఎన్నో క్లాసిక్స్ అనే ఇంగ్లీష్ సినిమాలు చూసాము.

ఇప్పటి చెన్నై అప్పటి మద్రాస్ సఫైర్ థియేటర్ లో క్లీ యో పాట్రా, సౌండ్అఫ్ మ్యూజిక్,

మై ఫెయిర్ లేడీ చూసాను.


డైలాగ్స్ మొత్తం అర్థం కాక పోయినా మొత్తానికి సినిమా అర్ధం అయేది. మా ఊరు ఇంగ్లీష్ సినిమా లు

రాక పోయినా విజయవాడ లో లీలా మహల్ లో ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి.


టెన్ కమాండమెంట్స్ , బెన్ హౌర్ , లారెన్స్ అఫ్ అరేబియా, బకెట్ , గన్స్ అఫ్ నోవేరెన్ మేకనెస్ గోల్డ్ ఆలా ఆరోజుల్లో

ఎన్నో సినిమాలు చూసాము.


మా రెండో అన్నయ్య ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసే వాడు. అందరి పిల్లలు ను తీసుకుని ఇంగ్లీష్ సినిమాలు కి తీసుకుని వెళ్ళే వాడు.

ఆరోజుల్లో అమరావతి కుమార్ లిబర్టీ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి.


సైలెంట్ మూవీ, పోలీస్ స్టోరీ, డాక్టర్ జివాగో , గన్స్ అఫ్ నోవేరిన్ బెనహౌర్ అన్నయ్య తో వెళ్ళటం గుర్తు ఉంది.


మా ఆబ్బాయి ఈ రోజు మా అన్నయ్య తో వెళ్ళటం గుర్తు చేసుకుని , నెట్ ఫ్లైక్ లో ఉంటే చూద్దాము అంటున్నాడు.


ఇప్పుడు ఆ థియేటర్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు. లిబర్టీ, అమరావతి అయితే లేవు.

మల్టీప్లెక్స్ లు వున్నాయి కానీ మంచి సినిమాలు మాత్రం లేవు.


యూ ఏస్ లో వున్నప్పుడు నవల ల సినిమాలు రెండు చూసాను , రెబెకా, జేనీయర్, గాన్ విత్ ది విండ్

ఇంకా పిన్సెస్ అనీ డైనా గురించి కూడా ఒక సినిమా చూసాను.


గాడ్స్ మస్ట్ బి క్రేజీ అనే సినిమా కూడా చూసినట్లు గుర్తు మద్రాస్ లో యూ ట్యూబ్ లో వెతికాను కానీ కనిపించ లేదు.


ఈ మధ్యలో ఉదరింగ్ హెయిట్స్ నవల మరలా సినిమా గా తీస్తున్నారు అనీ గూగుల్ గారు చెప్పారు. మన ఇండియా లో

వస్తుందో రాదో తెలియదు.


ఏదయినా ఒక మంచి సినిమా చూస్తే ఎప్పటికీ గుర్తు వుంటుంది. మళ్ళీ ఏ భాష లో అయినా అలాంటి గుర్తు ఉండిపోయే సినిమాలు ఎప్పుడు వస్తాయో


























 
 
 

Recent Posts

See All
మధుర గీతాలు గీతా దత్

ఒక ఐదు ఆరు ఏళ్ల క్రితం వరకు టేప్ రికార్డర్ లో మనకు ఇష్టమైన పాటలు పెట్టుకుని వినే వాళ్లము. నా దగ్గర గీతా దత్ టేప్స్, తర్వాత సీ డీ లు చాలా నే ఉండేవి. ఈ యూ ట్యూబ్ వచ్చాక ఏదో ఒకటి

 
 
 
ఆవకాయ యజ్ఞం

వేసవి రాగానే ముందు ఈ ఎండలు భరించిటం ఒక యజ్ఞం అయితే , ఈ ఎండల్లో నే ఆవకాయ పెట్ట టం రెండో యజ్ఞం. ఎన్నో ఏళ్ల నుంచీ ఆవకాయ పెడుతున్నా ఎప్పటి కప్పుడు ఏదో టెన్షన్ కుదురుతుందో లేదో అనీ, ఏమ

 
 
 
కుకింగ్ గాడజెట్స్

పండగ ముందు పేపర్ చూస్తున్నా, పేస్ బుక్ చూస్తున్నా రకరకాలుగా వంట సామాన్లు , సోఫా లు, మంచాలు, డైనింగ్ టేబుల్ ఎన్నిరకాల ప్రకటనలో , చక్కటి ఫోటోలు తో చూడ ముచ్చట గా వుంటాయి. కూరలు కట్ చేయటాన

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page