నా లైబ్రరీ 2
- murthydeviv
- 1 day ago
- 4 min read
Updated: 11 hours ago
నా షోత్కర్ష తో మిమ్మల్ని బోర్ కొట్టిస్తూ ఉన్నానేమో , కానీ కొన్ని పుస్తకాలు చదివాక మన దృక్పధం లో
చాలా మార్పులు వస్తూ వుంటాయి.
అలాంటి పుస్తకాలు లో మొదట జగద్గురు బోధలు , కంచి పరమా చార్య శ్రీ చంద్ర శేఖర సరస్వతి
ఉపన్యాసాలు. అవీ మొదట ఆంధ్ర ప్రభలో ప్రచురించారు ట. విద్వాన్ విశ్వమ్ గారి అనువాదం.
సాధన గ్రంధ మండలి వాళ్లు పది పుస్తకాలు గా ప్రచురించారు.
మా అక్కయ్య వాళ్ళ గురువు గారు తెప్పించారు , నీవు కూడా ఒక సెట్ తీసుకో అని చెప్తే తీసుకున్నాను.
అరోజుల్లో ఆ పది పుస్తకాలు ఏభై రూపాయలు .
ఆ పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి అనే ఇంటరెస్ట్ వచ్చింది.
అక్కయ్య ఆంటే మా పెద్దమ్మ కూతురు, ప్రైవేట్ గా హిందీ పరీక్షలు అన్నీ పాస్ అవటమే కాక
ఏభై ఏళ్ల వయసులో ఎమ్. ఏ తెలుగు చదివింది..
ఆ పుస్తకాలు నా దగ్గర చదివిన వాళ్లు చాలా మంది కావాలి అని అడిగారు. నేను కూడా
బంధువులు లో పెద్ద వాళ్లకి, కొంతమంది స్నేహితులకు కొని ఇచ్చాను.
ఆలా సాధన గ్రంధ మండలి వాళ్ళ పుస్తకాలు చాలా వచ్చాయి. శ్రీ ఆది శంకరా చార్య గారు రాసిన
కొన్ని స్తోత్రాలు కు అర్ధం , విష్ణు సహస్ర భాష్యం , త్రి శ తి భాష్యం లకు తెలుగులో వివరణ లు
అన్నీ వెల కట్ట లేని పుస్తకాలు .
మొన్నీ మధ్య ఇలాగే ఆ పుస్తకాలు సర్దుతూ ఉంటే సప్త శ తి లో స్తోత్రాలు కి ఈశ్వర సత్య నారాయణ శర్మ గారు
రాసిన అర్ధం పుస్తకం కనిపించింది. ఆది కూడా సాధన గ్రంధ మండలి వాళ్లదే .
మా అక్కయ్య ఎన్నో సార్లు పురిపండా అప్పల స్వామి గారి దేవి భాగవతం ఇచ్చి చదువు అని ప్రోత్సహించినా
చదవ లేక పోయాను. నా ఫ్రైండ్ కల క త్తా నుంచీ వచ్చినపుడు అక్కడ షాపులో బేతవోలు రామ బ్రాహ్మం గారు
రాసిన దేవీ భాగవతం పుస్తకం ఉంటే నీవు చదివావా అని అడిగింది. లేదు అని చెప్తే వెంటనే కొని ప్రెజెంట్
చేసింది.
తను ఇ చ్చిన వేళా విశేషం ఏమిటో గాని వెయ్యి పేజిల పైగా వున్న భాగవతం రెండు సార్లు చదవ గలిగాను.
ఆ పుస్తకం కి సాహిత్య అకాడమీ వాళ్ళ సత్కారం లభించింది . అందులో అయన మూలం లో వున్న చాలా స్తోత్రములు రాశారు.
బంధువుల ఇంట్లో సహస్ర చంద్ర దర్శనం ఫంక్షన్ అయితే వెళ్ళినపుడు అయన కూడా వచ్చారు..
అయన కాళ్ళకు నమస్కారం చేయ పోతుంటే వద్దు అంటూ మీరు పుస్తకం చదివారు అదే నాకు గౌరవం
అన్నారు.
అలాగే ఒక సారి మా బంధువుల ఇంట్లో సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఒక పార్ట్ లో కొన్ని పేజీలు
చదివాను. చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి ఆ పుస్తకాలు కాచి గూడా ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్ కి వెళ్లి కొనుక్కున్నాను. మన తెలుగు పుట్టు పూర్వోత్తరాలు అన్నీ ఆరుద్ర గారు చక్కగా రాశారు..
ఈ మధ్య ఎందుకో వెతుకుతూ ఉంటే కొన్ని పార్ట్స్ మిస్ అయినట్లు వున్నాయి. ఎవరో తీసుకుని
ఇచ్చి వుండరు. అమరావతి కథ లు , ప్రసాద్ గారి నాహం కర్తా, హరి క ర్తా ఎప్పుడు చదివినా
కొత్తగా వుంటాయి.
కొంతమంది మన కు పరిచయం అయిన వేళా విశేషం ఎలాంటిదో కానీ వాళ్ళు బంధువులు కంటే ఆత్మీయలు అవుతారు. మా వారు 1975 లో అనుకుంటా మద్రాస్ లో కారు కొన్నా రు, అంబాసిడర్ కారు.
హైదరాబాద్ లో కాకుండా మద్రాస్ లో ఎందుకు కొన్నారో నాకు తెలియదు. ఆ రొజు ఈయన కారు లో హైదరాబాద్ వస్తూ ఉంటే మా బంధువు ఒకాయన , అయన తో అయన ఫ్రెండ్ మా వారితో కారు లో హైదరాబాద్ వచ్చారు..
ఆ యన ఉండేది బెంగుళూరు , ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారు. అయన పేరు విశ్వా నంద ,
అయన తిరుపతి అరుణాచలం, శృంగేరి, కంచి పీఠం లకు అడ్వైసరి బోర్డ్ లో lవుండే వారు.అనుకుంటా.
..
సౌత్ లో అన్నీ పెద్ద టెంపుల్స్ కి తిరుగుతూ ఉండేవారు. మేము స్వామీజీ అని పిలిచే వాళ్లము. అయన నన్ను ఒక కూతురు లాగా చూసుకునే వారు. మా వారు అప్పటి దాకా తిరుపతి వెళ్ళ లేదు ఆంటే ఆశ్చ ర్య పోయి,
ఏమ్ ఏస్ సుబ్బలక్ష్మి గారు అక్కడ సహస్ర కలష అభిషేకం చేస్తున్నారు అని మమ్మల్ని కూడా తీసుకుని వెళ్లారు.
ఆ ది ఒక మరపురాని అనుభూతి , పూర్వ జన్మ పుణ్యం అనాలో , తెలియదు . స్వామి ఎదురుగా సుబ్బలక్ష్మీ గారు
కీర్తన లు పాడుతుంటే ఒక అరగంట వున్నాము.
ఆలా అన్నారావు గారి తో సాన్నిహిత్యం ఏర్పడి అప్పుడు టీ. టీ డీ వేయించిన పుస్తకాలు , త్యాగరాజు గారి కీర్తనలు,
కవి త్రయం మహా భారతం పుస్తకాలు, ఇవే కాకుండా , నాలుగు వేదాలు , ఈ పుస్తకాలు అన్నీ మా లైబ్రరీ ని అలం కరించాయి
త్యాగరాజు గారి కిర్తన లు బుక్స్ అయితే అన్నీ ఒకేసారి చక్కగా చదివా ను.. అంత కంటే మనకు ఇంకేం జ్ఞానం
లేదు కదా.
స్వామీజీ తో అరుణాచలం వెళ్ళటానికి వీలు కాక పోయినా రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి గురించి చెప్పే వారు.
సూరి నాగమ్మ లేఖలు, నాయన అని గణపతి ముని చ రిత్ర , గణపతి ముని గా రు రచించిన ఉమా సహస్రం అనే పుస్తకాలు స్వామి జి ఇచ్చారు.
ఈ ఉమా సహస్రం గురించి సా మ వేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసాలు విని చదివాను ..
కానీ ఎంత వరకు అర్థం అయింది అనేది ప్రశ్న .స్వామి జి గారితో , ఏర్పేడు ఆశ్రమం,లో
విద్యానందగిరి గారిని కలిసాము.
అయన గీతా ఉపన్యాసాలు బుక్ కూడా తేలికగా అర్ధం అవుతుంది.
స్వామీజీ తో కంచి మఠం లో శ్రీ చంద్ర శేఖ ర సరస్వతి స్వామి వారిని కలిసాము.
అక్కడే పాల్ బ్రంటన్ గారు రాసిన రహస్య భారతం పుస్తకం కొని ఇచ్చారు.
.
స్వామి జి సాంగత్యం లో మా పూర్వ జన్మ పుణ్యం వలన శృంగేరి శ్రీ శంకరా చార్య వారి ఆధ్వర్యంలో
అయన సన్నిధిలో మేము చేసిన శ్రీ లక్ష్మి నారాయణ విగ్రహాలు ప్రతిష్ట చేయటం .
ఆది ఒక భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాను. బెంగుళూరు జయ నగర్ లో రాగి గుట్ట ఆంజినేయ స్వామి గుడికి దగ్గర లో ఈ గుడి వున్నది. భాగ వత్ భవన్ అంటారు. వేద వ్యాసుడు వారి విగ్రహాలు కూడా వున్నాయి.
2017 లో బెంగళూరు వెళ్ళినప్పుడు మరలా చూసాను.
ఈ పుస్తకాలు అన్నింటికి మా ఆబ్బాయి పైన హల్లో లైబ్రరీ లాగా ఆరేంజ్ చేసాడు. చదివే వాళ్ళు లేరు. మా కోడలు నెలకు ఒకసారి అన్నీ క్లీన్ చేయించి పెడ్తుంది. ఎపుడైనా ఓపిక వున్న రోజున ఏదయినా పుస్తకం తెచ్చుకుంటాను..
ఒక ఏడాది క్రితం ఋషి పీఠం పుస్తకాలు చాలా ఉంటే రామ కృష్ణ మఠం లైబ్రరీ లో ఇద్దామని వెళ్ళాను..
వాళ్ళు చాలా మర్యాద గా మాట్లాడుతారు. పెద్ద లైబ్రరీ చాలా మంది చదువుకుంటూ వుంటారు.
అయితే మనం తీసుకుని వెళ్లిన బుక్స్ మాత్రం అక్కడే బయట పెట్టమంటారు. తర్వాత మేము తీసుకుని ఆరేంజ్ చేసుకుంటాము. అని చెప్తారు.
అప్పటికే అక్కడ చాలా అట్ట పెట్ట లలో బుక్స్ వున్నాయి.
నాకు ఏమిటో ఆలా వదిలేసి రావటం నచ్చ లేదు . ఆరోజు అలాగే బాధ పడుతూ వదలి వచ్చాను. .
ఇంగ్లీష్ పుస్తకాలు మాత్రం నా మనవ రాలు చక్కగా సర్దుకుంటూ వుంటుంది.
మధ్య మద్యలో ఆ పుస్తకం ఏ ఏజ్ లో చదివావు అప్పుడు నీ ఫీలింగ్స్ ఏమిటీ అంటూ ఇంట్రవ్యూ చేస్తూ వుంటుంది.
సరే నా ఆనందం కోసం ఈ తెలుగు పుస్తకాలు ఇలా చూసుకుంటూ, గత స్మృతులు నెమరు వేసుకుంటూ
ఉంటాలే అనుకుంటా.
ప్రస్తుతం ఆది పాండు రంగ విజయం అనే భక్తులు కథలు చదువుతున్నాను. ఈ ఏక వీర కూడా చదివి
ఇంకోసారి రాస్తాను.
సినిమాలు తీసిన మల్లె మాల రెడ్డిగారు కూడా ద్విపద కావ్యం లాగా రామాయణం రాసాడు.
మావారికి గిఫ్ట్ గా ఇచ్చాడు.
ఏ రామాయణం వచ్చినా నేను సుందర కాండ చదువుతాను. మా ఇంట్లో మా వారికీ గిఫ్ట్ గా వచ్చిన రామాయణం లు
భా గవతం లు గురించి ఇంకో సారి కలుద్దాం.
కానీ ఈ సెల్ ఫోన్ వచ్చాక, "ఈ ""బుక్స్ వచ్చాక చాలా మంచి బుక్ షాపు లు మూత పడిపోయాయి..
ముఖ్యం గా ఎప్పటి నుండో వున్న ఏ ఏ హుస్సేన్ & కో, ల్యాండ్ మార్క్, వాల్డెన్ స్టోర్స్
అన్నీ మూసేసారు..oddyssey అనే స్టోర్స్ కూడా ఇప్పుడు వుందో లేదో తెలియదు.
మేము వచ్చిన కొత్తల్లో ఏ జూబ్లీహిల్స్ లో లైబ్రరీ కూడా ఉండేది కాదు .
ఇప్పుడు కొత్తగా ఏవో వచ్చినవి అని చెప్తున్నారు.
చదవటం అలవాటు చేసిన అన్నయ్యను, ఆధ్యాత్మిక పుస్తకాలు అలవాటు చేసిన అక్కయ్య ను,
ఎన్ని పుస్తకాలు కొనుక్కు న్నా , అర్ధ రాత్రి దాకా చదువుతూ వున్నా ఏమీ అనని మా వారికీ
జే జే లు చెప్తూ శుభరాత్రి
Comments