దేవీ మహత్యం 3
- murthydeviv
- 21 hours ago
- 2 min read
ఈ రోజు మూడవ స్తోత్రము ఐదవ అధ్యాయం లో వస్తుంది . ఈ అధ్యాయం లో శంభు నిశుంబు లను వధించు కథ వుంటుంది.ఈ స్తోత్రము నీ అపరాజిత స్తోత్రము అంటారు దేవీ సూక్తము అని కూడా అంటారు. దేవతలు హిమ పర్వతము కి వచ్చి అమ్మ వారిని ప్రార్థించారు. ఈ స్తోత్రము లో దేవి కి నమస్కారం చేస్తూ మొదలు పెట్టారు. .ప్రకృతి రూపంలో వున్న శివ స్వరూపిణిగా గా ప్రార్ధిస్తూ నీవే భద్ర వి, కార్య, కారణ రూపిణీ వి నీవే. రాక్షసుల ను సంహారం చేసే రౌద్ర రూపిణీ త్రికాలముల లో ఉండే నిత్య,, విశ్వం నీ ధరించే ధాత్రీ రూపిణీ,, ప్రసన్నము గా వున్నపుడు వెన్నెల వలే చల్లని తల్లి గా జ్యోత్స్న అనియు, జగన్మోహమైన సౌందర్యం కలది కావున ఇందు రూపిణీ గా, భక్తులు నీ అనుగ్రహించి సుఖము ను కలిగించు తల్లి అందుకే ఆమె సుఖ అన్నారు.. శ్రేయో రూపిణీ, ,వృద్ధి రూపిణి,, అణిమాది సిద్ధుల గల నీకు అనేక నమస్కారములు. దుర్గా , దుర్గ పారా, సంకటములు దాటించి సర్వ కార్యముల సాధించినది , కావున ఖ్యాతి పొందినది. . .కృష్ణ వర్ణము తో , ధూమ్ర వర్ణం తో ప్రకాశించు తల్లివి . భక్తులు ను కృప తో, అనుగ్రహించి,, రాక్షసుల ఎడ క్రోధము కలది కావున నీవు సౌమ్య, రౌద్ర రూపము లు కలిగి ఉన్నావు. సర్వ లోకము ల అందును, ఉపాసుకుల అంతరంగంలో ప్రతిష్టింపబడిన దేవీ, నీవే సృష్టి స్థితి సంహార , కార్యములు చేయుచున్నావు.
ఈ శ్లోకము నుండి అమ్మ వారు మనలో ఏ ఏ రూపము లో ఉన్నదో చెపుతున్నారు సర్వ ప్రాణుల అందు విష్ణు మాయ రూపం లో ఉన్న నీకు నమస్కారం ప్రతి శ్లోకము లో మూడు సార్లు నమోస్తు అని వస్తుంది అంటే మనము త్రికరణ శుద్ధిగా నమస్కరించి నట్లు అర్థం. యా దేవీ సర్వ ప్రాణుల అందు చైతన్యం గాను , బుధ్ధి, రూపంలో, నిద్రా, క్షుధ ,అంటే ఆకలి ఛాయ, తృష్ణ. అంటే కోరిక రూపంలో ఉన్న నీకు నమస్కార ము . అలాగే ప్రతి వారిలో ఓర్పు. పుట్టుక, లజ్జ , శాంతి, శ్రద్ద కాంతి., రూపులో వున్న నీకు నమస్కారం . లక్ష్మీ రూపంలో అంటే ప్రత్యేక లక్షణము తో వున్న నీకు నమస్కారం. ప్రతి జీవి లోనూ వృత్తి , స్మృతి , దయ , తృప్తి ,
రూపంలో వున్న నీకు నమస్కారం . జగజ్జనని వైన నీవు అందరిలో మాతృ రూపంలో ను. బ్రాంతి రూపంలో ను ఉంటావు . విశ్వము అందలి సకల భూతములు అందు , సకల ప్రాణులు యొక్క. కర్మ
జ్ఞాన ఇంద్రియాల అందు ఆధార దేవత గా ఉన్న ఆ లోక మాత కు ఎల్ల వేళల. నమస్కారములు. ఈ జగత్తు అంతయు చిత్ శక్తి రూపంలో వున్న నీకు నమస్కారం. పూర్వము మహిషాసుర సంహారం సమయంలో దేవతల చేత స్తోత్రము చే ప్రసన్నురాలై దుర్గా మాత వారి అభిమతములు నెరవేర్చింది . అట్టి కళ్యాణ కారిణి అయిన పరమేశ్వరి మాకు సకల శుభములు , సమస్తమైన కళ్యాణములు కలిగించు గాక.
పరమేశ్వరి స్తోత్ర ప్రియ . స్తోత్రము చేయుట అనగా ఉపాసకుల భక్తి నీ , హృదయ స్వరూపం నీ పరమేశ్వరి కి నివేదించటమే .ఈ మానసిక పరిపక్వత వలనే దేవతా అనుగ్రహం కలుగును.
ఈ స్తోత్రము తో దేవతల జగద్ధీశ్వరి నీ ప్రార్థన చేశారు
ఈ స్తోత్రము తో సంతోషించిన పరమేశ్వరి మహా సరస్వతి రూపంలో శంభు , నిశుంబు లను సంహరిస్తుంది .
ఈ స్తోత్రము చాలా మహిమాన్వితమైన ది . పారాయణ చేసినా వినినా మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
శ్రీ మాత్రే నమః ఆ జగజ్జనని కరుణ మన అందరికీ లభించాలని కోరుకుంటూ జయ మాతా
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పా ల యాం గౌరీ , పరి పా లయం గౌరీ
Comments