దేవీ మహత్యం 2
- murthydeviv
- 2 days ago
- 2 min read
మహిషాసుర వధ తర్వాత దేవతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చేసిన స్తోత్రము నాలుగో అధ్యాయంలో వుంటుంది. ఈ స్తోత్రము చాలా అద్భుతమైన మహిమ కలిగిన స్తోత్రము. దేవీ అన్ని రూపాలు ధరించి జగత్తును రక్షణ కలిగించే అంబికా అంటూ దేవతలు ప్రార్థిస్తూ చేసిన స్తోత్రము. పుణ్యాత్ములు ఇంట్లో స్వయంగా శుభములను ఇచ్చే లక్ష్మీ దేవిగాను, వారి హృదయాలలో శ్రద్ధ రూపము గా, చైతన్య స్వరూపంగా, సత్ వంశము లో పుట్టిన వారికి లజ్జ రూపం లో ప్రకాశించు తల్లివి. ఈ రూపంలో ఈ విశ్వం కాపాడే తల్లి వి నీవే. పాపాత్ములు ఇంట్లో అలక్ష్మీ నీవే. సమస్త జగత్తుకు కారణమైన నీవు, త్రిగుణాల తో కూడి యున్న నిన్ను రాగ ద్వేషములతో నిండి యున్న మానవులకు కానీ, దేవతా గణములు గానీ నీ మహత్తు ను తెలుసుకోలేరు. నీవు మూల ప్రకృతి వి, యజ్ఞములో స్వాహా శబ్దం చేత దేవతా గణములు ను తృప్తి పరచు శక్తివైన నీవు, పితృ దేవతలు కు తృప్తి కారణమైన నీవు మానవుల చేత స్వధా అనే శబ్దము గా ఉచ్చరించ బడుచున్నావు. సద్గుణ ఐశ్వర్యం చేత ప్రకాశించు నీవు మంత్ర స్వరూపిణి వి మునులు చేతను, మోక్షం కోరే వారు నిన్ను ఉపాసించు చున్నారు.
శబ్ద బ్రహ్మ స్వరూపిణి వైన నీవు ఓంకార స్వరూపిణి వై, సామ వేదం మంత్రములకు ఆలవాలమై న వేద త్రయ స్వరూపిణి వైన భగవతి వి. సంసార బంధము లకు కారణమైన వృత్తి స్వరూపిణి వి నీవే. సాంసారిక వేదనలు నశింప చేయు తల్లీ వి నీవు. సమస్త శాస్త్ర జ్ఞానం కలిగించే మేధా శక్తి వి నీవే, విష్ణు దేవుని హృదయంలో నివసించే లక్ష్మీ వి నీవే. మహేశ్వరుని యందు ప్రతిష్ట స్థానంలో వున్న పార్వతీ దేవి వి నీవే. లేత చిరునవ్వు తో పూర్ణ చంద్ర రూపంలో, బంగారు కాంతితో
ప్రకాశించు నీ యొక్క ముఖము లో క్రోధము తో నిండి యున్న నూ మహిషుడు సాహసము తో చూశాడు అందుకే అతని సైన్యం తో సహా నశించి పోయాడు. ఈ స్తోత్రము లో పదిహేడు శ్లోకం సప్త శ్లో కి లో కూడా వుంటుంది. దుర్గా రూపిణి వైన నీవు సమస్త భయాలను నశింప చేసే శక్తి వి నీవే. స్వస్త మనస్సులు నిన్ను స్మరించిన శుభ ప్రదమైన బుద్ధిని ప్రసాదిస్తావు. దారిద్ర్య దుఃఖం ను నశింప చేయు తల్లీ వైన నీవు సర్వులకు ఉపకారం చెయ్యడం లో నీ కన్నా అన్యులు ఎవరు కలరు. రాక్షస సంహారం చేత జగత్తుకు సుఖం కలుగుతుంది.. ఒక్క చూపు తో ఈ రాక్షసుల ను భస్మం చేయగలిగిన నీవు ఆయుధ ప్రహారం చేత వారిని పవిత్రులను చేసి పుణ్య లోకములు పొంద వలనని ఉదాత్తమైన ఆలోచన తో అట్లు చేసితివి. వారి పాప పుణ్యము లతో నిమిత్తము లేకుండా వీర స్వర్గం నిచ్చితివి. మహా పరాక్రమ ము తో విలసిల్లే దుర్గ వి నీవే త్రిలోక సౌందర్యము తో విలసిల్లే త్రిపుర సుందరివి నీవే . రాక్షస బాధ నుండి మమ్ము కాపాడే తల్లి నీ ఆయుధములైన శూలము తో, ఖడ్గము తో ఘంటా నాధ ధ్వని తో ధనస్సు యొక్క అల్లే తాటి ధ్వని తో అన్ని దిక్కుల యందు మమ్ము రక్షింపుము. సాత్విక రూపము లోను, భయంకరమైన శక్తి చేతను మమ్ము రక్షింపుము.
మహిషాసుర సంహారం తర్వాత దేవతలు చేసిన స్తోత్రము ఆ శ్లోకాలు పారాయణ చేయలేక పోయినా ఈ అర్ధం భక్తి తో చదివినా మన మనస్సు కు శాంతి లభిస్తుంది అనే ఉద్దేశంతో ఈ శ్లోకాలు అర్ధం రాశాను ఆ జగజ్జనని కరుణ మనకు ఉండాలని ప్రార్ధిస్తూ శ్రీ మాత్రే నమః
విశ్వేశ్వరుని గౌరీ విజయ సంపద లిచ్చి కాపాడుమా మమ్ము కాత్యాయనీ అంబా
Comments