top of page
Search

ద న్ తెరా స్

murthydeviv
Nov 8
2 min read

ధన్ తేరాస్

మన ఆంధ్రాలో ఈ ధన్ తేరాస్ గురించి తెలియదు.. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కూడా ఈ ధన్ తేరాస్ గురించి తెలియదు.


దీపావళి కీ అందరూ లక్ష్మీ పూజ చేసే వారు. మర్వాడీ లు కొత్త పుస్తకాలు పెడతారుట.

మా ఫ్యాక్టరీ లో ఎక్కువగా టీవీ కంపోనెంట్స్ చేసేవారు.


కోఠి లో స్పేర్ పార్ట్స్ కొనుక్కునే వాళ్ళు అందరూ ఈ దీపావళి పూజ చాలా హంగామా గా చేసే వారు. రాత్రి పన్నెండు గంటలకు కూడా క్రాకెర్స్ కాలుస్తూ ఉండేవారు.


షరా మాములుగా మాకు కూడా ఇన్విటేషన్ వచ్చేది. రాత్రి పన్నెండు గంటలకు వాళ్లకి


ఆచారం లాగా కార్డ్స్ ఆడుతారుట. ఇదేమి ఆచారమో అనుకునే దాన్ని.

ఆలా మాకు కూడా ఫ్యాక్టరీ లో లక్ష్మి పూజ అలవాటు అయిపోయింది.

దసరా కీ ఫ్యాక్టరీ లో వర్కర్స్ అందరూ ఆయుధ పూజ అని వాళ్ళు వర్క్ చేసే మెషిన్స్ కీ పూజ చేసుకుంటారు. నవమి పండగ నాడు ఉదయం పది గంటలకు వెళ్ళితే ఏ రెండో మూడో అవుతుంది.


ఈ మధ్య ఆడ పిల్లలు అక్కడ మా మనవరాళ్లతో బతకమ్మ ని పెట్టీ ఆ డాన్స్ కూడా ఒక రెండు మూడు ఏళ్ల నుంచీ మొదలు పెట్టారు.

ఇంట్లో మన పూజలు, ఇలా దసరా అవుతూనే దీపావళి పరిగెత్తి వస్తుంది..

ఈ సారి మా పిల్లలు స్వీట్స్ అన్నీ ఇంట్లోనే చేయించామని గొడవ. అలా ఊపిరి సలపని పని.. ఈ రోజు తో అన్నీ చేయించి ప్యాకింగ్ అయినా యి.

అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను..


ఇంకా కార్తీకమాసం హడావిడి అయ్యాక ఒక నెల రోజులు రెస్ట్ తీసుకోవచ్చు.


మా నాన్న గారు వాళ్ళు ఆంధ్రాలో వుగాదికి కొత్త పుస్తకాలు పెట్టే వారు. ఇప్పటికీ అన్నయ్య లు పుస్తకాలు పెట్ట కపోయినా ఆఫీసు లో పూజ చేస్తారు.


మా వదిన ఖమ్మం జిల్లా నుండీ భాయి దూజ్ అని వదిన వెళ్లక పొతే వాళ్ళ తమ్ముడు ముందురోజు వచ్చి తలంటుకి నూనె పెట్టించుకుని , హారతి కూడా ఇప్పించుకుని వెళ్తాడు.


మర్నాడు భోజనాలు కీ వస్తారు. ఇచ్చిపుచ్చుకోవటం మాములేగా.


ఇక్కడ కీ వచ్చాక మా అమ్మాయిలు ఈ హరతులు అవీ లేకపోయినా మా అబ్బాయిని భోజనం కీ పిలుస్తారు. ఇద్దరూ అక్కలే అందరూ కలిసి హోటల్ కీ వెళ్తారు.

భాయ్ దూజ్ సెలెబ్రేషన్స్ అన మాట.


ఏమిటో జిల్లా కొక అలవాటు ఇంటికొక ఆచారం భిన్నత్వం లో ఏకత్వం..

నిన్న ఏకాదశి గురువారం మా అత్తగారు ఏకాదశి గురువారం నోము పట్టారు.

చాలా పెద్ద నోము ఉద్యా పన కూడా చాలా ఉంటుంది.


సూర్య చంద్రులు నోము అనికూడా పట్టారు. ఏకాదశి గురువారం వస్తే గుర్తు వస్తుంది నోము . ఆ ముచ్చట్లు ఇంకొక సారి.


ధన్ తేరాస్ కీ మా ఇంటి చుట్టూ వున్న బంగారు షాపులు కిక్కీ రిషి వున్నాయిట .


ఏమిటో కొత్త అలవాట్లు. ధన్ తేరాస్ నుండీ మూడు రోజులు మర్వాడీలు ఎవరికీ డబ్బులు ఇవ్వరుట అని మా అమ్మాయి చెప్తుంది..

అవీ ఈ రోజు కబుర్లు.



శుభాకాంక్షలు శుభ రాత్రి

 
 
 

Recent Posts

See All
వన భోజనం

కార్తీక మాసం అనగానే కొంత నొస్టాలజియా వుంటుంది , ఎవరి కయినా , అందరూ వాళ్ళ చిన్నప్పటి రోజులు తల్చుకుంటూ వుంటారు. నాకు అయితే దీపావళి వెళ్ళి కార్తీక మాసం వచ్చినప్పటి నుండీ మా పుట్టింట్ల

 
 
 
నాగుల చవితి

బినాగుల చవితి ఏమిటి? నాగుల షష్ఠి అనవచ్చు కదా !చవితి ఏమిటి? భూమి లోపల నివసించే నాగదేవతలను (సర్పాలను) ఆరాధించే పండుగ నాగుల చవితి. కార్తిక మాస శుక్ల పక్ష చవితి నాడు (కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుక్ల చవి

 
 
 
ప్రయాణం

దీపావళి తర్వాత వరుస పండగలు మన భక్తి ఈ మధ్య పండగ హడావిడి, భాయ్ దూజ్ అని ఇద్దరు అమ్మాయిలు కలిసి తమ్ముడి కీ మర్యాద లు వారం రోజులు నుండి హడావిడి గా గడిచి పోయింది. మధ్యలో మా అబ్బాయి పిల్లలు మేజర్లు అయి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page