top of page
Search

కాలి ఫో ర్నియా బురోటో

  • murthydeviv
  • 1 day ago
  • 3 min read

ఈ హెడ్డింగ్ చదివి నేను ఏదో కాలి ఫో ర్ని యా గురించి రాస్తున్నాను అనుకోకండి. యూ ఎస్ లో కాలిఫో ర్నియా

ఒకేసారి వెళ్ళాను . యూ ఎస్ లో గొప్పగా అనిపించిన ప్లేస్ ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జి. ఆ కబుర్లు ఇంకొక సారి

చెప్పుకుందాము.


ఈ రోజు ఈ బురుటో ఏమిటో అని మీకు డౌట్ రాకుండా మా ఇంటి చుట్టు పక్కల వున్న అనేక రెస్టారెంట్స్ లో

ఇది కూడా ఒకటి . సాయంత్రం స్నాక్ అని మా మనవరాలు ఏదో ఆర్డర్ చేసుకున్నది.

ఏదో చపాతీ లాగా చుట్టి వున్నది . చాలా అందమైన అట్ట పెట్టె లో ఒక పెద్ద కాగితపు బ్యాగ్ లో వచ్చింది.


ఏమిటే అని అడిగితే బురిటో అని చెప్పింది. అందులో ఎక్కువగా క్యాబేజీ , బీన్స్ , చీస్ అన్నీ పెట్టి చుట్టి

రోల్ లాగా చేసి ఇచ్చాడు. ఇంట్లో వేపుడు కూర చేస్తే నూనె ఫ్యాట్, నెయ్యి వేసుకుంటే ఫ్యాట్

కానీ వాళ్ళు తినే ఈ పిజ్జా లు, ఈ చెత్త లో వుండే చీజ్ పన్నీర్ వాళ్లకు కనిపించదేమో.


నాకు కొంచెం వాటి గురించి న జ్ఞానం ఇచ్చింది. ఆ చపాతీ లాంటి మైదా రొట్టె ముక్కను బౌల్ లాగా చేసి

కాప్సికం గార్లిక్, చీస్ వేస్తే దాన్ని టాకో అంటారుట. దాన్లో రాజుమా లాంటి బీన్స్ కూడా వేస్తారుట.

మెమోస్ అయితే ఆవిరి మీద వుడికిస్తారు కానీ అన్నింట్లో ఆ పరమాత్మ ఉన్నట్లు చీజ్ తప్పనిసరి.


ఈ రోజు శనివారం కదా అని నేను గోబీ పరోటా చేద్దాం అని అన్నీ రెడీ చేశాను. స్నాక్ లాగా పరోటా తినను అని

ఈ బురోటో తెప్పించుకుంది. జనరల్ గా పరోటా లు పంజాబ్ లో బ్రేక్ ఫాస్ట్ కే తినే వారు.


మేము పంజాబ్ వెళ్లిన కొత్తల్లో ఈ పరోటాలు చేయటం నేర్చుకుని ఏదో గొప్ప విద్య నేర్చుకున్నట్లు

ఫీల్ అయ్యాను. మా అన్నయ్య వస్తే చేసి పెడితే బాగా చేసానని మెచ్చుకుని తిన్నాడు.

జనరల్ గా అన్నయ్య కు తొందరగా ఏవీ నచ్చవు.


హైదరాబాద్ వచ్చాక కూడా పిల్లలకి సండే స్పెషల్ లాగా బ్రేక్ ఫాస్ట్ ఆలు, గోబీ, ముల్లంగి పరోటాలు చేసి పెట్టేదాన్ని.

అదొక స్పెషల్ గా నాకే వచ్చు అన్నట్లు ఉండేది .


ఆరోజుల్లో హోటల్ కి వెళ్లినా మాములుగా మసాలా దోశ , పెసరట్టు , ఎమ్ ల్ ఏ పేసరట్టు ,టొమోటో బాత్ ఆంటే

ఏమిటో అనుకునే దాన్ని. ఉప్మా నిండా టమాటో లు నూనె బాగా పోసే వాడు.

కొన్ని చోట్ల మాత్రమే వెజిటబుల్ దోశ అని దొరికేది. చిక్కడపల్లి సుదా హోటల్ , ఆనంద్ భవన్ సుల్తాన్ బజార్ లో


పంజాబీ ఫుడ్ ఎప్పుడు ఎంటర్ ఆయిందో తెలియదు కానీ ఇపుడు ఏ హోటల్ కి వెళ్లినా పగలు, రాత్రి తేడా లేకుండా

పరోటాలు , అందులో పన్నీర్ పరోటా , ఇంకా ఏవో రకాలు. అందులో నూనె వేస్తాడో నెయ్యి వేస్తాడో తెలియదు కానీ

నూనె లో మునిగి తేలు తూ వుంటాయి. ఇంకా కూరలు కూడా దాల్ మాఖని మెంతి మాలయి, మాలయి కోఫతా

ఇంకా అసలైన కూరల్లో రాణి ఎక్కడైనా ప్రత్యక్షము పన్నీర్ బట్టర్ మసాలా.

ఆ మధ్య మా మనవరాలు, మనవడు సరదా పడితే మా ఇంటి దగ్గర లో వున్న తెలుగు మీడియం

అనే హోటల్ కి వెళ్ళాము. అక్కడ కి వెళ్ళ గానే మా మనవడు తాతయ్య కి ఇష్టం అంటూ

దా ల్ మాఖాని , ఆర్డర్ చేసాడు..


తెలుగు మీడియం లో కూడా పంజాబీ ఫుడ్ . ఈ మధ్యలో పంజాబ్ నుండీ మా ఫ్రెండ్ వాళ్ళ ఆబ్బాయి వచ్చి మా ఇంట్లో దిగాడు.. ఉదయం టిఫిన్ కి ఇడ్లీ చేస్తే ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. రాత్రి డిన్నర్ లో చోలే చపాతీ చేస్తే

రాత్రి పూట హెవీ ఆంటీ వద్దు అని అన్నం తిన్నాడు..


ఆలా వాళ్ళు లంచ్ కి తినే ఐటమ్స్ అన్నీ మనం డిన్నర్ కి తింటూ ఉన్నాము.


ఇప్పుడు ఏ హోటల్ కి వెళ్లినా , రోడ్డు సైడ్ పేట్టే ఫుడ్ ట్రక్స్ లో అయినా దోశ లు ఎన్ని రకాలు చెప్తారో, అన్నిటిలో

చీజ్, పన్నీర్ , అసలు దోశ రుచే పోయింది అనిపిస్తుంది..


ఇంక పానీపూరి ,ఆలూ ఛాట్, యింకా రగాడా యింకా ఏవో పేర్లు, పావ్ భాజి ఇలా అంతులేని స్ట్రీట్ ఫుడ్స్.

ఇవ్వన్నీ గుజరాత్, మహారాష్ట్ర నుంచీ దిగుమతి అయ్యాయి..


ఆ మధ్య పెద్ద మనవరాలు సెలవలు కు వచ్చింది . షరా మాములుగా ఏదో హోటల్ కి నాకు పేరు గుర్తు లేదు

నాలెడ్జి సీటీ ఇక్కడే ఒక ప్లేస్ ఉంది అందులో , నేను రాను ఆంటే గొడవ పెడ్తుంది


అక్కడ నేను తినేవి ఏమీ వుండవు ఫ్రెంచ్ ఫ్రైస్ , లెమెనేడ్ ఆన బడే నిమ్మకాయ నీళ్లు తెప్పించారు.


అలాంటి చోట్ల కాఫీ తాగాలంటే భయం , ఉత్తి బ్రౌన్ వేడి నీరులో పాలు పోసినట్లు వుంటుంది..

ఏదో స్టారబక్స్ లో అయితే కాపిచినో అన్నా తాగవచ్చు.


అలాంటి చోట్లకు వెళ్ళితే నాకు నేను ఎక్కడ వున్నాను తెలుగు దేశం లోనేనా అనే డౌట్ వస్తుంది

గౌన్ లలో జుట్లు విరబోసుకుని అమ్మాయిలు, హాఫ్ పాంట్స్ లో అబ్బాయిలు.

అసలు డ్రెస్ కోడ్ పెట్ట కూడదా అనుకుంటాను..


ఫ్రెంచ్ ఫ్రైస్ ఆంటే నాకు కాలిఫోర్న్ యా ప్రయాణం గుర్తు వస్తుంది. సియా టెల్ నుండీ కాళీఫోర్ని యా

ప్రయాణం ఉదయం ఆరు గంటలకు ఎయిర్పోట్ చేరాము . మా చెల్లెలు , మా అమ్మాయి,,చెల్లెలు పిల్లలు

అందరము కలిసి వెళ్తున్నాము. వాళ్లు బ్రేక్ ఫాస్ట్ అంటూ మా చెల్లెలి కొడుకు వాట్ డూ యూ ఈట్ ఆమ్మా ఆ న్నాడు


ఉదయా న్నే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎమ్ తింటాము అని నాకు వద్దులే కాఫీ తీసుకురా అన్నాను.

పాపం వాడు ఐ విల్ గెట్ యూ అష్ బ్రౌన్స్ అన్నాడు.

అదేదో కొత్త రకం అనుకున్నాను తీరా చూస్తే బంగాళాదుంప చిన్న రౌండ్స్ గా కట్ చేసి కాస్త ఉప్పు కారం చల్లాడు

అవీ కాస్త బ్రౌన్ రంగులో వున్నాయి చెక్కు తీయలేదు అనుకుంటా .

ఆమ్మా అమెరికన్స్ మీ తెలివికి జోహార్లు రా ఒకే వస్తువుకి ఎన్ని పేర్లు అనుకున్నా


ఈ మధ్య ఈ అష్ బ్రౌన్స్ మన దేశంలో కూడా గృహప్రవేశం చేసాయి . మొన్న ఏదో హోటల్ మెనులో చూసాను.


అలాగే సియా టెల్ లో ఒక చైనీస్ రెస్టారెంట్ లో ఎగ్ ప్లాంట్ విత్ ఏదో చాలా రాసాడు .. మా అమ్మాయి ఇది నీకు నచ్చుతుంది అని తెప్పించింది. పెద్ద వంకాయ ని రౌండ్స్ గా కట్ చేసి తియ్య గా , పుల్లగా వుండే సాస్ లో వేసాడు

వేయించి అనుకోండి , కొంచెం మన పచ్చిపులుసు రుచి వచ్చింది.


ఈ రోజుల్లో ఏ చిన్న ఊరు వెళ్లినా ఇవే హోటళ్ళు మంచురియా లు , మొమోలు పిజ్జా లు . విజయవాడ లో కూడా

ఒక అమెరికన్ రెస్టారెంట్ కి లాక్కెళ్లారు మా పిల్లలు.


బెంగుళూరు హైవే మీద మాత్రం ఉడిపి హోటల్స్ కనిపించాయి. కర్నూల్ దగ్గర కంచి భవన్ అని మంచి నీట్ వెజిటేరియన్ హోటల్ బాగుంది


అవీ ఈ టాకో బెల్ కబుర్లు , ఇంకో రోజు బ్లింక్ ఇట్, స్విగ్గి లా కబుర్లు చెప్పుకుందాం


శుభరాత్రి ఆవకాయ రోజులు వస్తూ వున్నాయి మంచి నెయ్యి వేసుకుని కంది పొడి, కొత్త ఆవకాయ ఆహా ఏమీ రుచి

ఈ పేరు తో హోటల్ పెట్ట వచ్చు కదా.














 
 
 

Recent Posts

See All
అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు 3

ముచ్చట గా మూడో సారి సావిత్రి, నాగేశ్వరావు గారి సినిమాలు తో పాటు , కొన్ని అన్నపూర్ణ వారి సినిమాలు లో మధురమైన పాటలు గుర్తు చేసుకుని ఈ సీరీస్ కి ముగింపు చెప్తాను. పూల రంగడు కన్నా ముందే

 
 
 
అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు 2

ఈ పాత సినిమాలు గురించి ఎంత రాసినా తృప్తి ఉండదు. కొన్ని సినిమాలు ఇప్పుడు చూస్తే కొంచెం సాగ తీత గా వున్నా కొన్ని పాట లు ఎప్పుడు విన్నా కొత్తగా , వీనుల విందుగా వుంటాయి. అర్దాంగి లో హరిద

 
 
 
అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు.

ఈ రోజు యూ ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే శిరీష కొమ్మరాజు గారు పాడిన వినిపించ ని రాగాలే పాట వచ్చింది. ఆవిడ ఎక్కువ గా పాత పాట లు పాడుతూ వుంటారు . ఆ పాట కూడా చాలా హాయిగా పిల్ల తెమ్మర లాగ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page