top of page

ఆవకాయ:3

murthydeviv

Updated: Nov 15, 2024

మా పెద్దమ్మ ముక్కలన్నీ చూసి కా రం అవ పిండి ఈ ముక్కలకు స రి పోతాయో లేదో అని మాకు కొన్ని అక్షితలు వేసి ఆవకాయ ఒక కొలిక్కి తేవటానికి నడుము కట్టింది పాపం ఆవిడ కూడా ఇంత లార్జ్ స్కేల్ లో ఆవకాయ పెట్టలేదు మా పెద్దమ్మ. ఏ ఊర్లో వున్నా చుట్టు పక్కల వాళ్ళ తో.చాలా స్నేహం గా వుండేది కొత్త వంటలు నేర్చుకుని అందరికీ రుచి చూపించే ది మామూలు.నవలలు.వర పత్రికలు తో పాటు భారత భాగవతం లు. చదివి అందరికీ వినిపించటం అర్ధం చెప్పటం చేసేది ఆవిడ వెంటనే తన భాగవతం స్నేహితులతో మా ఆవకాయ ముక్కలు గురించి చెప్పింది మా పెద్దమ్మ తో పాటు వచ్చిన ఒక బామ్మ.గారు వచ్చి ఏమి. పర్వా లేదండి .మెంతి కాయ పెసర ఆవకాయ నీళ్ల ఆవకాయ పెట్టచ్చు అన్నారు ఏమిటి నీళ్ల తో ఆవకాయ నా అనుకుంటూ ఆవకాయ కలుపుకుని నెయ్యి బదులు ఆవకాయ పైన వున్న ఎర్రటి నూనె కలుపు కునే మా వారు మా అన్నయ్య లు గుర్తు వచ్చారు నేను కొంచం భయ పడ్తూ నీళ్ళు తో మా వారు వప్పుకోరండి అన్నాను ఆవిడ నన్ను ఒక పిచ్చిదానిలా.చూసి ఎందుకమ్మా కాలేజీ చదువులు నీళ్ల తో పెడితే వుంటుందా అని నన్నే దబా యించింది పదండి సత్యవతమ్మగారు ముక్కలు వాసన పట్టక ముందే జాడి ల్లో పడే ద్దాము అని నడుము.కట్టింది ఈ ముక్కలు చూసీ మా అక్కయ్య కోటి వెళ్లి నాలుగు. జాడి లు పట్టుకొచ్చింది ముక్కలు తుడిచి.జిడి పొర తీసి. వాళ్లు చెప్పినట్లు.మెంతి పిండి ఆవపిండి పెసర పిండి తయారు చేసి ఇతోధికంగా గా మేము. వాళ్ళ కు సహాయం చేశాము

19 views0 comments

Recent Posts

See All

మా అమ్మ గారి గీతోపదేశం.

ఈ టైటిల్ చూసి మా అమ్మ గారు మాకు భగవద్గీత గురించి చెప్పారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అసలు మా అమ్మ గారు ఎప్పుడయినా గీత చదివారో లేదో...

జిలేబి

మా అత్తయ్య గురించి రాయదగ్గ గొప్ప విశేషాలు ఎన్నో వున్నా ముందు తీయగా మొదలు పెడదామని జిలేబి గురించి రాస్తున్నాను. ముందు నాకు మా పెద్దవాళ్ళ...

స్నేహం 2

నేను ముందే వ్రాసినట్లు కొంత మంది తో బంధుత్వం వున్నా కూడా నాకు వాళ్ళ మధ్య వున్న స్నేహ బంధం వలన ఆత్మీయత పెరుగు తుందేమో అనిపిస్తుంది. వయసు...

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page