top of page
Search

తుపాన్లో పెళ్లి

  • murthydeviv
  • 3 days ago
  • 3 min read

ఈ రోజు ఉదయాన్నే పేస్ బుక్ లో ఒక కథ చదివాను.

కథలు ఆంటే కళ్ళు ఆగకుండా అక్షరాలు వెంబడి పరిగెత్తూ ఉంటాయి. కథ బాగుంది మరలా చదువుదాము ఆంటే ఈ గ్రూప్ లో కనిపించడం లేదు.


ఉదయాన్నే కదా మనకు చేయాల్సిన పనులు తరుము తూ వుంటాయి.

బహుశా ఈ నాడు లో పడిన కథ ఏమో అనుకుంటా, ఇంతకీ అసలు సంగతి

ఏమిటంటే ఆ కథ చదువుతూ ఉంటే నాకు కొన్ని సంఘ టన లు గుర్తు కు

వచ్చాయి.


ఇవి కనీసం గా ఒక యాభయి ఏళ్ల క్రితం జరిగినవి.. కానీ ఇప్పటికీ వర్షం వస్తే


పల్లెటూరు లో రోడ్లు కొట్టుకు పోతున్నాయి ఆంటే ఏమీ డెవలప్ అయ్యాము అనే బాధ వచ్చేస్తుంది.

.,

ఆ రోజుల్లో కమ్యూనికేషన్ కి టెలిగ్రామ్, ఉత్తరాలు తప్పితే ఫోన్ కూడా ఆందరికీ అందుబాటులో ఉండేది కాదు.


1969 వేసవి సెలవలకు పంజాబ్ నుండి ఆంధ్ర కు బయలు దేరి మద్యలో

కలకతత్తా, టాటా నగర్ , రోర్కేలా లో ఫ్రైండ్స్ ని చూసుకుంటూ

వైజాగ్ చేరాము. అక్కడే కొద్దిగా వర్షము మొదలు,

మేము విజయవాడ చేరే టప్పటికి కుంభ వృష్టి.


మా అత్తగారు వాళ్లు వుండే పల్లెటూరు చేరటానికి బస్సు ఎక్కాము .

సత్తెనపల్లి దాట గానే ఏరు పొంగుతున్నది అని బస్సు ఆపేసాడు.


మర్నాడు ఉదయం కి వర్షము తగ్గింది కానీ బ్రిడ్జ్ మాత్రం కొట్టుకు పోయింది


అటు నుంచీ బస్సు వచ్చి ఆగితే ఈ పగిలిపోయిన రాళ్ళ మీద

నడుచుకుంటూ ఆ బస్సు ఎక్కాము.


ఈ లోపల మేము ఏమయిపోయమో అని అటు వాళ్లు , ఇటు వాళ్లు కంగారు.

లక్కీ గా బెజవాడ స్టేషన్ లో మా దూరపు బంధువు కనిపిస్తే మేము అత్త గారి ఊరు వెళ్తున్నాము అనే కబురు మాత్రం చెప్పాను..


ఇంతకీ అసలు గమ్మత్తు ఎమిటి అంటే ఆ పల్లెటూరు లో ఇరవై రోజుల తర్వాత


మా ఆడపడుచు పెళ్లి పెట్టుకున్నాము. పెళ్లి వారు గుంటూరు నుండి రావాలి.


మూడో రోజు మావారు గుంటూరు వెళ్ళితే అక్కడ పెళ్లి చేయమని వాళ్లు గొడవ

సొంత ఇంట్లో చేస్తాను , అని మా మామ గారు పట్టుదల మధ్యలో

మావారు కనీసం ఐదు, ఆరు సార్లు గుంటూరు కి తిరిగారు. అయితే ఆ రోజుల్లో ఇన్ని పెళ్లి సత్రాలు ఉండేవి కావు కదా , ఎక్కడా ఏమీ దొరక లేదు.


ఇంక వాళ్లు దిగి రాక తప్పలేదు. ఆ పల్లెటూరు నుండి ఏదీ కావాలి అన్నా గుంటూరు, గాని సత్తెనపల్లి గాని వెళ్ళాలి.


ఎవరైనా సరే ఆ బ్రిడ్జ్ దగ్గర దిగి ఆ నీళ్లల్లో పరచిన రాళ్ళ మీద నడిచి

అవతల బస్సు ఎక్కాలి.


మా వారు ఎలాగో కష్ట పడి పెళ్లి కొడుకు కోసం ఒక కారు గుంటూరు నుండి బ్రిడ్జి

వరకు బ్రిడ్జి దాటాక మా ఊరు కన్నా పైన వున్న తాలూకా హెడ్ క్వా ర్టర్స్


నుండి ఒక డొక్కు జీపు సంపాదించారు.


ఆ జీపుకి సీట్స్ వగైరా అందము గా ఉండటానికి నా చీరలు తో డెకొరేషన్

చేశాను. ఆ కళ కే పాపం మా అత్త గారు సంతోషించా రు కానీ


పెళ్లి వారి ఆడ పడుచు లు మాత్రం సీట్స్ మీద చీరలు కప్పారు అని

నసుగుడు.


ఆలా ఈ వైపు బస్సు ఎక్కి బ్రిడ్జి మీద నడిచి మరల అటు బస్సు ఎక్కి


పెళ్లి షాపింగ్ లు , సరుకులు మోసి పెళ్లి అయ్యేటప్పటికీ మా ఒళ్ళు హనం

అయింది.


నేను బెజవాడ నుండి కబురు చెప్పటం వలన అమ్మా వాళ్ళ కంగారు తగ్గింది.


ఒక తొమ్మిది నెలలు పంజాబ్ లో ఉంది వచ్చిన నన్ను చూడటానికి, మా కజిన్స్

బ్రదర్స్ ఇద్దరూ, చెల్లెళ్లు ఒక పది రోజుల ముందే వచ్చారు.


ఇంకేముంది వాళ్లు కూడా నా మీద ఆపేక్ష కు ఈ సరుకులు రవాణా తో


మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కానీ పల్లెటూరు కదా మా వారి చుట్టాలు

అందరూ చాలా అన్నయ్యలను మెచ్చుకుని సంబంధం చెప్పటం మొదలు పెట్టారు.

వాళ్లు భయ పడుతుంటే నేను అభయం ఇచ్చాను. మీకు మేనత్త పిల్లలు వున్నారు అని చెప్తాను అని.


అప్పుడే తెలంగాణ అజిటేషన్ కూడా జరుగుతూ వున్నది.

పెళ్ళికొడుకు హైదరాబాద్, మా బావ గారు మహబూబ్ నగర్ .


మా బావ గారు సాగర్ మీద కుండా వచ్చారు. పెళ్లి కొడుకు అంచెలు అంచేలుగా

గుంటూరు చేరాడు. ఈ గొడవలు అన్నిటి మధ్య పెళ్లివారికి మర్యాద లు,

అవీ సక్రమంగా చేసేటప్పటికి తాతలు దిగి వచ్చారు.


మా ఆడపడుచు భర్త మాత్రం చాలా సరదా మనిషి. ఎప్పుడూ జోక్స్ వేస్తూ నాతో పిల్లలు తో క్లోజ్ గా వుండే వారు.


మీ ఆడ పడుచు తో పెళ్లి అనగానే వర్షాల తో సముద్రాలు పొంగి సంతోషిచాయి

అనేవారు.

అయినా నేను విచిత్ర వీరుడు లాగా వచ్చి వివాహము చేసుకున్నాను అని

పిల్లలు తో చెప్పేవారు. ఆ జీపు మీద కూడా జోక్స్ ఉండేవి.


మీ అత్తయ్య ఎక్కితే గాని అదీ స్టార్ట్ అయ్యేదికాదు అంటూ జోక్స్ వేసి నవ్విస్తూ ఉండేవారు.


ఎన్నో పెళ్లిళ్లు చేసాము గాని ఆ పెళ్ళికి ఎంత అవస్తో పడ్డాము.


కానీ ఆ రోజుల్లో ఏమీ కమ్యూనికేషన్స్ వసతులు లేక పోయినా జీవితం బాగానే గడిపాము అనిపిస్తుంది.


పెళ్లి అంతా అయ్యాక అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊర్లు తిరుగుతూ

ఉత్తరం కానీ టెలిగ్రామ్ గాని ఇవ్వనందుకు నాన్నగారి చేతిలో బాగానే దీవెనలు.

పడ్డాయి.


కానీ ఇప్పటికీ వర్షాలు కు రోడ్స్ తెగి పోతున్నాయి ఆంటే బాధ వేస్తుంది.

 
 
 

Recent Posts

See All
పడక కుర్చీ

భావుక లో పోయిన వారం ఇచ్చిన పదాలు లో వున్న పడక కుర్చీ అనే పదం చూడగానే ఏభయి ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటన లు గుర్తు వచ్చాయి. కానీ నాకు ఏమిటో మొన్నీ మధ్య జరిగినట్లు అనిపిస్తుంది. ఆ రోజు

 
 
 
యాత్ర కధనా లు

యాత్ర కథనాలు చదవటం అంటే చాలా ఇష్టం. అసలు ఏ పుస్తకం అయినా మొదలు పెడితే పూర్తి అయిందాక వదలను. ఈ మధ్య చిన వీరభద్రుడి గారి నేను తిరిగిన దారులు మరలా చదివాను. శ్రీశైలం, అరకు లో కొత్త అందాలు చూసినట్లు

 
 
 
రేడియో కధలు

ఈ రోజు జాతీయ రేడియో దినోత్సవంట, అందుకే రేడియో కబుర్లు కాసేపు చెప్పుకుందాం. ఆ రోజుల్లో రేడియో ఉండటం కూడా ఒక లగ్జరీ అనుకుంటా. మా ఇంట్లో ఒక రేడియో, దాని కొక పెద్ద టేబుల్ ఉండేది. ఒక స్పెషల్ రూమ్ కూడా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page