హృషీ దా
- murthydeviv
- 4 minutes ago
- 4 min read
జయ భా దురి మొదటి సినిమా గుడ్డీ సినిమా జ్ఞాపకం వున్న వాళ్ళ కి హృషికేష్ ముఖర్జీ తెలిసే వుంటారు.
రెగ్యులర్ సినిమా లా కాకుండా , సున్నితమైన హాస్యం తో,మనసుకు ఆహ్లాదంగా సినిమాలు తీయ టం లో
ఆయనకి ఆయనే సాటి.
ఆ సినిమాలు ఎన్ని సార్లు చూసినా విసుగు ఉండదు. ముఖర్జీ గారు మనుషుల మధ్య వుండే సున్నితమైన
బంధాలు
చిత్రీ క రించ టం లో సిద్ద హస్తులు
ఆయన దాదాపు యాభై సినిమాలు వరకు తీశారుట , నా దృష్టిలో అన్నీ క్లాసిక్స్ అనుకుంటాను.
నేను నరం గరమ్, చుపికె చుపికె , గుడ్డీ , గోలమాల్ డౌన్లోడ్ చేసుకుని మధ్య మధ్యలో హాయిగా చూస్తూ వుంటాను.
ఆ లిస్ట్ లో అంగూర్ , పరిచయ్ కూడా వున్నాయి. అయితే అవీ గుల్జర్ గారి సినిమాలు అనుకోండి .
ముఖర్జీ గారు బిమల్ రాయ్ గారి మధుమతికి , దో భీఘా జమీన్ కి ఎడిటర్ గా వర్క్ చేసారుట .
ఆయన మొదటి సినిమా ముశాఫిర్ అంతగా హిట్ కాలేదుట.
రాజకపూర్ అనాడి సినిమా ముకర్జీ గారు డైరెక్ట్ చేసారుట , ఆరోజుల్లో ఇవేమి తెలియదు, ఆ సినిమా చూసినట్లు గుర్తు,
కథ అంత బాగా గుర్తు లేదు. పాటలు శంకర్ జీకిషన్ ఇప్పటికీ వింటూ వుంటాను.
అతి సున్నితమైన కథ తో తీసిన సినిమా అనుపమ , ఆ సినిమా చూసాక రెండు రోజులు ఏదో భాధతో నిండిపోయింది మనసు . యాక్షన్ హీరో ధర్మేంద్ర సున్నితంగా నటించిన సినిమా.
అప్పటికీ ఎవరు డైరెక్టర్ , అలాంటివేమి తెలిసేవి కాదు.
నేను 95 లో యూ ఎస్ వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా వీడియో కేసెట్ ఉండేవి. అక్కడ అర్జున్ పండిట్ సినిమా సంజీవ్ కుమార్ చూసాను, ఆ సినిమా కూడా బెంగాలీ నవల, చాలా నచ్చింది..
ఈ మధ్యలో మళ్ళీ చూద్దాము అనీ వెతికితే అతి కష్టం మీద యూ ట్యూబ్ లో దొరికింది, అదే పేరుతొ ఇంకేదో సినిమా కూడా వున్నది.
అనురాధ కూడా మంచి సినిమా, ఆరోజుల్లో ఆ సినిమా చూడలేదు కానీ పాట లు వింటూ ఉండేవాళ్ళము,
ఈ సినిమా కు పండిట్ రవి శంకర్ గారు మ్యూజిక్ ఇచ్చారుట.
తర్వాత కూడా ఈ సినిమా చూసిన గుర్తు లేదు..
గుడ్డీ జయ భాదు రీ సినిమా గురించి చెప్పేదేముంది, సినిమా ప్రపంచం గురించి న సినిమా , ఎప్పటికీ నిత్య నూతనం.
అసలీ,న కిలీ , ఛాయా, సత్య కామ్ సినిమాలు ఆయనే తీసారుట , ఇప్పుడు యూ ట్యూబ్ లో ఉన్నాయేమో కానీ చూడలేదు. పాటలు మాత్రం వింటూ వుంటాను.
అసలైన సినిమా ఆశీర్వాద్, బెంగాలి నవల అనుకుంటాను. అందులో అశోక్ కుమార్ గారిని చూస్తూ ఉంటే
తండ్రి ప్రేమ ఆంటే ఇలా ఉంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు చూశానో గుర్తు లేదు కానీ ఇప్పటికీ ఆ లాస్ట్ సీన్లు
మనసులో నిలిచి పోయాయి.
ఆ సినిమా లో అశోక్ కుమార్ గారు ఒక పాట కూడా పాడారు
అభిమాన్, ఆనంద్ రెండూ , సీరియస్ సినిమాలే , కానీ ఏదో మన ఇంట్లో సంఘ టన లు చూసినంత
సహజం గా వుంటాయి. ముఖ్యం గా అశ్రానీ లాంటి స్నేహితు డు ని క్రియే ట్ చేయటం ముకర్జీ గారికే సాధ్యం .
ఆనంద్ సినిమా నేను థియేటర్ లో చూడలేదు. ఇప్పుడు యూ ట్యూబ్ లో ఉందేమో కానీ ఆ విషాదం భరించే
ఓపిక లేదు. పాటలు వింటూ వుంటాను.
నమక్ హారమ్ కూడా సీరియస్ సినిమా, ఇంగ్లీష్ సినిమా బకెట్ అనువాదం అనుకుంటా, తెలుగు లో
నాగేశ్వరరావు జగ్గయ్య ప్రాణ మిత్రులు పేరు తో వచ్చింది. నమక్ హారమ్ మంచి హిట్ అనుకుంటాను.
ఏమిటో అప్పటికీ ఇప్పటికీ సీరియస్ సినిమాలు చూడాలి ఆంటే అంత ఇష్టం ఉండదు.
అర్జున్ పండిట్ , ఆశీర్వాడ్, నమక్ హారామ్ లాంటి సీరియస్ సినిమాలు తీసిన ముఖర్జీ గారు
సున్నితమైన హాస్యంతో , చక్కటి కుటుంబ బంధాలు తో తీసిన సినిమాలు చూస్తూ ఉంటే
రెండూ ఒకరేనా తీసింది అనీ అనుమానం వస్తుంది.
గుడ్డీ సినిమా లో హంగల్ గారు చెస్ లో మునిగి తేలు తూ కూడా , గుడ్డీ కోసం కోడలు ఎలా ఎదురు చూస్తూ
వున్నదో చెప్పటం ఎంత సహజము గా ఉంటుందో , అసలు హంగల్ గారిని చూస్తే , ఎవరికయినా
కన్న తండ్రి గుర్తుకు రాక తప్పదు.
చుపికె చుపికే , నరం గరమ్, గోల్ మాల్ సినిమాల్లో పెద్దగా కథ ఏమీ ఉండదు , కానీ సినిమాలు చూస్తూ ఉంటే
ఆహ్లాదంగా వుంటాయి.
నరం గరమ్ , గోలమాల్ సినిమాల్లో అమోల్ పాలేకర్ సహజంగా అన్నీ సినిమాల్లో అలాంటి పాత్రలే
వేశారు . ఆ సినిమా లో శత్రుగ్న సిన్హా పాత్ర మాత్రం ఒక హై లైట్ , ఎప్పుడూ సీరియస్ గా, ఫైటింంగ్ హీరో విలన్
వేషాలు వేసే హీరో చేత ఒక కామెడీ రోల్ వేయించటం గొప్ప విషయం.
గూడ్ చెన్నా చూసినప్పుడల్లా ఆ సినిమా నే గుర్తు వస్తుంది. ఒక పల్లెటూరు వాతావరణం లో , డ్రామా
కంపెనీ లు, ఆ కళాకారుల కష్టాలు మామూలు సినిమా కన్నా భిన్నముగా వుంటుంది.
ఓంప్రకాష్ ఉత్పల్ దత్ ,పాత్రలు ఎప్పటికీ సహజంగా వుంటాయి. ఈ రోజుల్లో ఈ మూఢ నమ్మకాలు, వాస్తు లు
ఇంకా ఎక్కువ అయినాయి.
హంగల్ గారు ఏ సినిమా అయినా తండ్రిగా సహజము గా వుంటారు.
ముఖర్జీ గారి సినిమాల్లో ,తప్పకుండా వుండే యాక్టర్స్ ఓమ్ ప్రకాష్ , దీనా పాఠక్, డేవిడ్ కేస్టో ముఖర్జీ
గోల్ మాల్, నరం గరమ్ లో ఉత్పల్ దత్ గారి యాక్షన్ సూపర్బ్ , ఈ రెండు సినిమాల్లో ఓమ్ ప్రకాష్ గారు
కనిపించేది కొద్దీ సేపే అయినా , నటన మాత్రం మరచిపోలేము. ముఖ్యం గా గోలమాల్ లో పోలీస్ ఆఫిసరు పాత్ర.
గోల్మాల్ కూడా బెంగాలీ సినిమా రీమేక్ ట, ఇంకా శుభా కోటే పాత్ర ఎంతో సహజంగా మన ఇళ్ల ల్లో వుండే మేనత్తలు
మేనకోడలు ని ఎలా చూసుకుంటారో అలాగే వుంటుంది. చాలా రోజుల తర్వాత ఆవిడ ను సినిమా లో చూసాము..
ఇంక షో లే, చుపికే చుపికే రెండు సినిమాలు 1975 లోనే విడుదల అయ్యాయి, రెండు సినిమాల్లో హీరోలు
ధర్మేంద్ర, అమితాబ్ కానీ రెండు సినిమాల కి ఎంతో వత్యాసం . ఈ మధ్యలో ఎవరో పేస్ బుక్ లో కొన్ని
సీన్స్ కూబ్ సూరత్ లోవి చుపికే చుపికే లోవి పోస్ట్ చేసారు .
నాకు ఎక్కువగా చుపికే చుపికే నచ్చుతుంది. ఈ సినిమాలో అందరూ అందరే లాగా ప్రతి వాళ్ల నటన గొప్పగా వుంటుంది.
అయితే అమితాబ్ కొంచెం అమాయకుడు గా , కన్ఫ్యూషన్ లో ఎంత బాగా యాక్ట్ చేసారో అనిపిస్తుంది .
సినిమా కథ కొంచెం అసహజం గా వున్నా , ఎక్కడా విసుగు లేకుండా ఎంజాయ్ చేస్తూ చూస్తాము.
ముఖర్జీ గారి సినిమాల్లో నౌకర్లు కి కూడా ఏదో ఒక స్పెషల్ డైలాగ్ లు వుంటాయి. అసలు ఆయన సినిమా ల్లో
వున్న నౌకర్లు లాంటి వాళ్ళు మనకు కూడా ఉంటే బాగుండు అనిపించేట్లు వుంటారు.
ఇందులో కేఫ్తో ముఖర్జీ , టెలిగ్రామ్ డైలాగ్, పార్క్ లో దర్మేంద్ర ని వెతుకుతూ చెప్పే డైలాగ్ అసలు మరచిపోలేము.
అస్రా ని ఇంట్లో నౌకర్ వంట గురించి అడుగుతూ బెంగన్ బేర్త చేయనా అనీ అడుగుతాడు, పాపం ఆ అక్క గారు
ఎంత ఫ్రస్ట్రేషన్ తో చెప్తుందో ఎప్పుడూ బే ర్తా వద్దు అనీ చెప్పటం ఎంత నేచరల్ గా వుంటుంది.
నాకు ఎప్పుడు వంకాయ బజ్జీ అనుకున్నా ఆ డైలాగ్ గుర్తు వస్తుంది. ఏ భాష అయినా తక్కువ చేసి మాట్లాడకూడదు అనీ ధర్మేంద్ర చివరికి చెప్పటం , బాగుంటుంది.
ఈ సినిమా కూడా బెంగాలీ సినిమా రీమేక్ ట , ఎలా అయినా లైట్ గా హాయిగా నవ్వుకుంటూ సినిమా చూడవచ్చు.
రంగిభి రంగీ, కూబ్ సూరత్ కూడా ఆయన సినిమాలే. పర్వీన్ బాబీ చేత చక్కగా చీర లు కట్టించి హోమ్లీ గా
చూపించారు, రంగబీ రంగీ లో.
దేవేన్ వర్మ క్రియేట్ చేసిన కన్ఫ్యూషన్ లో దీప్తి నావెల్, అమోల్ పాలేకర్ నటించిన ఫ్యామిలీ డ్రామా మధ్యలో చూడలేదు, యూ ట్యూబ్ లో ఉందేమో వెతకాలి.
ఇంత మంది గురించి రాసి డేవిడ్ గారి గురించి రాయక పొతే ఎలా , ఆయన్ని చూస్తే మన ఇంట్లో మనకు మంచి చెడులు
చెప్పే బాబాయిలో మేన మామలో గుర్తు వస్తారు. అంత చక్కటి యాక్టర్.
ఎప్పుడూ సినిమాలు పాటలు గురించి రాస్తున్నాను అనీ అనుకోకండి . హాయిగా చూద్దాము ఆంటే ఒక్క మంచి సినిమా లేదు ఈ రోజుల్లో , మరలా కోట్లు పెట్టి తీస్తారు,
మల్టీప్లెక్స్ లు వున్నాయి కానీ మంచి సినిమాలు లేవు , హాస్యమ్ కూడా అసహ్యం గా వుంటుంది.
ఆ రక్తాలు వచ్చేట్లు ఫైటింగ్ లు అసలు చూడలేము.
మంచి సినిమా ఆంటే మనసుకు ఆహ్లాదంగా ఉండాలి .
ముఖర్జీ గారిని అందరూ ఆప్యాయంగా హృషీ దా అనీ పిలుస్తా రుట .
అశోక్ కుమార్ గారి గురించి ఎంతో చెప్పుకోవాలి సో ఇంకొక సారి కలుద్దాం
శుభ రాత్రి
A
Comments