top of page
Search

శ్రీ రామ నవమి

  • murthydeviv
  • 2 hours ago
  • 3 min read

ఈ రోజు రామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం పుట్టిన రోజు నాడే జరుగుతుంది..

పూర్వం తాటాకు పందిర్లు వేసి వీధి వీధికి కళ్యాణం చేసే వారు. వారం రోజులు ఉత్సవాలు

ఘ నంగా జరిపే వారు..

ఇప్పుడు కూడా అన్నీ కాలనీల్లో అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ల్లో , గుడుల్లో శక్తి మేరకు చేస్తూ వున్నారు.


ఆ మధ్య మా ఆబ్బాయి ఇస్కాన్ వాళ్లు యూ ఎస్ ఏ లో ప్రింట్ చేసిన రామాయణం పుస్తకం

ఎవరో ఇచ్చారు అని తెచ్చాడు. సా ధ రణం గా ఇస్కాన్ వాళ్ళ పుస్తకాలు క్వాలిటీ బాగుంటాయి.

అందులో ఇంట్రడక్షన్ రాసిన అయన ఒక అమెరికన్ రిలీజియన్ ప్రొఫసర్ ఏదో యూనివర్సిటీ

అమెరికా లో.


అయన రామాయణం గురించి చేసిన రీసెర్చ్ గొప్పగా అనిపించింది. మనకే తెలియని


యోగ వశిష్ఠము ఆధ్యాత్మిక రామాయణం గురించి రాయటం చాలా వింత గా వుంది.

ఏ ఏ దేశాల్లో రామాయణం ఫోక్ డాన్స్ లాగా, కార్టూన్స్ లాగా కధ లాగా వుందో,

అక్కడ కొన్ని ప్రదేశాలకు వున్న పేర్లు , మనుషులు పేర్లు, రామ కథ ఒక్కొక్క చోట

ఒక్కో విధంగా ఎలా మార్పు చెందిదొ చక్కగా రాశారు.


అంతా రీసెర్చ్ చేయటానికి అయన భారత దేశమే కాకుండా, శ్రీలంక మలేషయా

కొంబోడియా , ఇంకా ఆ చిన్న చిన్నా దీవులు అన్నీ తిరిగారుట


నాకు అయితే చదువుతూ ఉంటే చాలా వింత గా అనిపించింది.


జనరల్ గా ఈ కొత్త పుస్తకం వచ్చినా ముందు ఇంట్రడక్షన్ చదువుతాను. అయన రాసిన వి

చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం గా , ఆనందం గా అనిపించింది.


అయన ఇండియా లో ఎన్ని రామాయణం లు ఎన్ని భాషల్లో ఎన్ని రామాయణములు ఉన్నాయో రాశారు.

అన్నింటికి మూలం వాల్మీకి రామాయణం అయినా మహా భారతం , భాగవతం లోనే కాకుండా


పద్మ , కూర్మ వరాహ, అగ్ని బ్రహ్మ వై వర్త పురాణాలలో రామ కథ వున్నట్లు చెప్పారు.

ఇంతే కాక అధ్యా త్మ రామాయణం , యోగ వశిష్ఠము గురించి కూడా చెప్పారు.


ఆధ్యాత్మ రామాయణం నేను రామ కృష్ణ మఠం వాళ్ళ పుస్తకం చదివాను. ఆ పుస్తకం సంస్కృతం లో

ఉందేమో నాకు తెలియదు.

యోగ వశిష్ఠము గురించి ఒక రెండూ మూడు ఏళ్ల క్రితమే సామవేదం గారి ప్రవచనాలు ద్వారా తెలిసింది.

తులసి దాసు రామాయణం , ఉత్తర భారతదేశం లో , బెంగాల్ లో , ఇంకా ఈసాన్య భాగాల్లో కృత్తి వాస రామాయణం

ఎక్కువగా ప్రా చుర్యం లో ఉందిట. నేను అయితే ఈ రామాయణం పేరు కూడా వినలేదు.


అయన యోగ వాషిష్టం , అధ్యత్మ రామాయణం రెండు గురించి చెప్పారు. ఇంక తమిళ్ నాడులో కంభ రామాయణం

గురించి చెప్పారు ఇది 14 వ శతా బ్దం లో రాశారుట .

ఇంకా కేరళ లో 16 శతా బ్దం లో కేరళ లో పద్య కావ్యం గా వచ్చిందిట.

ఇవే కాకుండా తెలుగులో వచ్చిన మొల్ల రామాయణం, రంగనాధ రామాయణం గురించి వ్రాసారు.


అన్నింటికి మూలం వాల్మీకి రామాయణం, అయినా తులసి దాసు , రామాయణం, హనుమాన్ చాలీసా గురించి


ప్ర త్యేకంగా చెప్పారు. రామాయణ కథ డాన్స్ డ్రామా లాగా, గ్రామీణ గాధల్లా గా , శ్రీలంక, కంబోడియా,

మలేషయా దేశాల్లో ఎలా ప్రచారం లో వుందో రాశారు.


అక్కడ పేర్లు, ఆ ఊర్లు ఎలా నిరూపిస్తాయో చెప్పారు. ఒక రీసెర్చ్ స్కాలర్ భారతదేశం దేశం మొత్తం లో

మూడు వందల రామాయణాలు వున్నట్లు రాశారు ట.

వాల్మీకి రామాయణం కి ఎంతో మంది తెలుగులో వ్రాసారు. మా కజిన్ సిస్టర్ నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారు.

అందులో మోక్ష గుండ రామాయణం అని ఒక పుస్తకం వున్నది. చాలా వరకు శిదిలమైంది. కానీ అలాగే భద్ర పరిచాను.


నేను ఎప్పుడూ ఆపేరు విన లేదు. ఇస్కాన్ పుస్తకాలు అంటేనే మంచి ఫోటోలు వేస్తారు. కానీ ఈ పుస్తకం లో

చాలా మ్యూ జియుమ్ లో కలెక్ట్ చేసిన పెయింటింగ్స్ వేశారు .


కొత్త గా తెలిసిన విశేషం ఏమిటంటే అక్బర్ రామాయణం పెయింటింగు లు ఎన్నో వేయించాడుట

అవీ వాషింగ్టన్ మ్యూజియం లో దొరికాయిట.

తంజావూరు, అయోధ్య ఢిల్లీ , బొంబాయి , వారణాసి జయపూర్ మ్యూజియం లో వున్నా అవీ సరిగ్గా

కాపాడలేదు అని బాధ పడుతూ రాశారు..


అయోధ్య చిత్రకూట్, మీధి లా, శ్రీలంక లో ఇప్పటి కి రామ నామం సదా జపించే వారు వున్నారు. ట

ప్రిస్టోన్ యూనివర్సిటీ వాళ్ళు వాల్మీకి రామాయణం ఇంగ్లీష్ లో ప్రింట్ చేసారుట.


శ్రీరాముడు యొక్క అవతారం ధర్మము ఆచరించిటానికే అవుతారించాడు. ఈ రోజుల్లో రామ రాజ్యం

కావాలి అనుకునే రాజకీయ నాయకులు అచరణ లో త్యాగ నిరతి, ధర్మము లేకుండా చేస్తున్నారు.


రావణుడు సీతాదేవి ని ఆపహరించి నట్లు భూమి లో నుండీ వచ్చే రిసోర్సులను అతిగా వాడి

ఈ ప్రపంచం న్ని కలుషితం చేస్తున్నారు.


ఈ రామాయణ కావ్యము ఇన్ని శతా బ్ద లుగా నిలిచి అన్నీ దేశాల్లోను ఇంకా చిరంజీవి గా నిలవ టానికి

కారణం ఆ కావ్యంలో చెప్పిన శ్రీరాముని యందు సీతా దేవికి , హనుమాన్ కి గల ధ్రు ఢ మైన

భక్తి, విశ్వాసం లు అని చివరి గా ముగించారు .


ఒక ఫారినర్ మన రామాయణం గురించి ఆలా రాశారు ఆంటే మనం గర్వ పడాలో , లేక అంతగా

ఆచరించ లే ని మన అవివేకం న్ని ఏమనుకోవాలో ????

































 
 
 

Recent Posts

See All
టెలిఫోన్ నుంచి సెల్ఫోన్ కీ.

పూర్వం రోజుల్లో పుస్తకం హస్త భూషణం అనే వారు. ఎవరైనా ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటే వాడు ఒక పుస్తకాల పురుగు అనే వారు. ఇప్పుడు అయితే సెల్ ఫోన్ హస్త భూషణం అనాలి . అందరూ ఆ అర చేతిలో స్వర్గం కి

 
 
 
గుజ్జన గూళ్ళు

అసలు ఈ రోజుల్లో ఈ మాట ఎవరికైనా తెలుసో తెలియదో కానీ మా చిన్న తనం లో మేము గుజ్జన గూళ్ళు అని వంటలు చేస్తూ వుండే వాళ్ళము. అసలు ఆరోజుల్లో మనం ఆడిన ఆటలు ఇప్పుడు పిల్లలు కు అసలు తెలియదు కూడా. మరీ చిన్

 
 
 
సరాగ మాల

ఈ పేరు తో మేము చదువుకునే రోజుల్లో ఆంధ్ర పత్రిక లో ఒక ఆర్టికల్ వచ్చేది. ఆరోజుల్లో పత్రిక , ప్రభ అమూలగ్రమ్ .చ ది వే దాన్ని . ఆ ఆర్టికల్ వి. ఏ కె రంగా రావు గారు రాసే వారు. అందులో సినిమా పా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page