top of page
Search

విజయా వారి విజయా గీతాలు

  • murthydeviv
  • 6 days ago
  • 2 min read

ఎచటి నుండీ వీచునో ఇక చల్లటి గాలి అనుకుంటూ, పగలు కూడా ఏ సీ వేసుకుంటే బిల్లు పేలి పోతుంది అనుకుంటూ కాస్త నాలుగు గంటలకు హల్లో కూలర్ ముందు కూర్చున్నాను.


ఉదయం పది గంటలకు ఆన్ చేసిన ఆ కూలర్ మాత్రం ఆలా తిరుగుతూనే వుంటుంది. మా కేన్, బ్రూనో అనే కుక్కలు ఎండ భరించలేవు.


సాయంత్రం అయింది , బయట కాసేపు వాకింగ్ చేద్దాం అన్నా ఒకటే వేడి


అందుకే కాసేపు వెన్నెల పాటలు వింటూ ఆనందిద్దా ము అనుకుంటూ యూ ట్యూబ్ లో పాటలు పెట్టాను.


విజయా వారి విజయ గీతాలు అనీ రెండు క్యాసెట్స్ ఉండేవి. అందులో కొన్ని డైలాగ్స్ మిస్సమ్మ లో వి వున్నట్లు గుర్తు.


విజయా వారి ఏ సినిమా అయినా వెన్నెల పాట వుంటుంది.


ఏ సినిమాలో అయినా నిండు చంద్రుడు వెన్నెల కురిపిస్తూ ఉంటాడు.


చక్కటి గాలికి రెల్లు పొదలు గాలికి తలలు ఊపుతూ వెన్నెల లో మెరుస్తూ వుంటాయి.


పెళ్లి చేసి చూడు లో వరండా లో కూడా ఉయ్యాల వేసి , నిండు చంద్రుడు ని చూపిస్తూ అటు ఏడుకొండల వాడికి, ఇటు ఏన్ టీ ఆర్ గారికి పాడే జోల పాట


ఆ సినిమా వచ్చినప్పుడు మేము చిన్న వాళ్లము అనుకుంటా చూడ లేదు.

ఏదో దేవుడి పాట అనుకునే దాన్ని. తర్వాత టీ వి లో చూసాక అర్థం అయింది.


మాయాబజార్ సినిమా లో సినిమా పేరు కు తగ్గట్టుగా కెమెరా మాన్

మార్కెస్ బార్ట్ లే గారి మేజిక్ తో మధ్యాహ్నం పన్నెండు గంటలకు

మనకు వెన్నెల వెలుగులు చూపించారు.


ఆ పాట ఎప్పుడు చూసినా ఆ నౌకా విహారం ఆ వెన్నెల , మరీ ముఖ్యంగా

ఆ వెన్నెల వెలుగులో రెల్లు పొదలు మెరుస్తూ ఊగుతూ ఉంటే అద్భుతం గా వుంటుంది.


ఇంక పాతాళ బై ర వి సినిమా లో మాలతీ పాట కల వరమాయే మదిలో

కూడా వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ వుంటుంది..


ఆ తీగలు మీద మెరుస్తూ అప్పుచేసి పప్పు కూడు సినిమా లో ఎచటినుండి వీచేనో ఈ చల్లటి గాలి లో రాసినట్లు తీగేలపై ఊగుతూ పూవులపై తూ గుతూ, జాబిలి తో ఆడుతూ అనీ కవి గారు రాసినట్లు నిండు చంద్రుడు

పరవశింప చేస్తాడు.


ఇంక మిస్సమ్మ లో వాదించుకుంటూ కూడా కొబ్బరి ఆకుల మధ్యలో నిండు చంద్రుడు కే పిర్యాదు చేస్తారు రావోయి చందమామా అంటూ


ఇంక గుండమ్మ కధలో గారాబు కూతురు జమున అయినా , నిండు చందమామ లాంటి సావిత్రి గాని , వెన్నెల వెలుగులో నిండు చందమామ

ముందే వాళ్ల భావాలు చెపుతారు.


అలిగిన వేళ నే అలకలు తీర్చిన సావిత్రి, ప్రేమ యాత్రలకు పాట లో

మనల్ని వెన్నెల స్నానా లు చేయిస్తారు.


నాగేశ్వరావు , జమున ఎంత హాయి పాట లో కూడా , సావిత్రి తమలపాకులు చీల్చి ఇస్తూ, ఎంతో సహజంగా మన మీద పన్నీటి జల్లులు కురిపిస్తారు.


ఇవీ విజయా వారి వెన్నెల పాటలు,


ఇంకా బంగారు పాప లో పండు వెన్నెల , మనసు నిండా వెన్నెలా, పాట, అర్ధాంగి సినిమా లో ఎక్కడమ్మా చంద్రుడు పాట కూడా బాగుంటుంది .


రాక రాక వచ్చావు చందమామ అనే పాట కూడా బాగుంటుంది.

ఆలా వెన్నల వెలుగుల్లో వోల లాడుతూ ఉంటే , అమ్మమ్మా, మోడరన్ ఫ్యామిలీ

పెట్టుకోనా అంటూ నా మనవరాలు వచ్చింది.

అవటానికి బామ్మ నే అయినా కూతుర్లు పిల్లలు తో కలిసి పెరగటం వలన అమ్మమ్మ అంటుంది.


సర్లే గ్రానీ అనకుండా తెలుగులో పిలుస్తూ వుంది కదా అనుకుంటూ సంతోషము.


అబ్బా ఈ పాటలు వినేటప్పటికి కొత్త శక్తి వచ్చినట్లు వున్నది.


మరి ఈ రోజుకి నా ఊహల్లో ఊ గిన ఉయ్యాల.


మీరుకూడ పాత పాట ల ఉయ్యాల ఊగండి


శుభరాత్రి

 
 
 

Recent Posts

See All
శ్రీ రామ నవమి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు. మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు. రాములువారి కళ్యాణం అని వీధి వీధికి

 
 
 
తులసి పాట

ఉదయం గంగ రాజు గారి వీర తాడు లో జలంధరుడు చూసాక నాకు మా అత్తగారు తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం పెట్టి ఒక పాట పాడుతూ ఉండేవారు. అది గుర్తు వచ్చింది. ఆవిడ ఏకాదశి నాడు కూడా గీతా సారం అంటూ

 
 
 
స్లో కుకింగ్

వారణాసి సుధాకర్ గారి పోస్ట్ కుంపటి ని, పొట్టు పొయ్యిని గుర్తు చేస్తే , ఈ రోజు జగదీష్ గారి పోస్ట్ పచ్చి జీడిపప్పు లు గుర్తు చేసింది. ఆ రోజుల్లో పొయ్యి, కుంపట్లు మీద వంట నిదానంగా అయినా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page