ఫోటో షూట్
- murthydeviv
- 17 hours ago
- 4 min read
ఇదివరకు అయితే ఈ మాట ఎవరైనా ఆంటే ఏమిటో అనుకునే వాళ్ళము. ఇప్పుడు అయితే ఈ మాట సాధారణం అయిపోయింది. మొన్న మాకు తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలవటానికి వచ్చారు.
వాళ్ళ అమ్మాయి ఏదో కంపెనీ లో మంచి ఉద్యోగం లోనే వున్నది. ఆబ్బాయి వేరే స్టేట్ అయినా ఇక్కడే
అదే కంపెనీ లో ఉద్యోగం , ఎంగేజ్మెంట్ వాళ్ళ ఊరిలో చేసుకుని, పనిలో పనిగా అక్కడే ఫోటో షూట్
చేసుకున్నారు అని చెప్పారు.
ఇందులో కొత్త ఏముందీ అనుకుంటున్నారా , కొత్త ఏమిటంటే అందరూ డెస్టీనేషన్ వెడ్డింగ్ ఆంటే వీళ్ళు
డెస్టీనేషన్ ఎంగేజ్మెంట్ , ఇంకెక్కడో ఫోటో షూట్ చేసుకున్నారు. ఆ పెళ్లికూతురి తల్లి చెప్తుంటే
ఆహా అంటూ విన్నాను. మరలా ఆవిడే అక్కడ ఫోటో షూట్ ఎందుకు పెట్టుకున్నారో మా కోడలు కి
వర్ణించి చెపుతూ, అక్కడ చాలా వాటర్ ఫాల్స్, మంచి రిసార్ట్స్ వున్నాయి అని చెప్పేసి ,
ఇంకా ఇక్కడ జరిగే ఫంక్షన్స్ అన్నీ లిస్ట్ చదివి మీరు తప్పక అన్నింటికి రావాలి అని చెప్తూ
మా మానవరా లు సంగీత్ లో డాన్స్ చేయటానికి ముందు నుంచీ ఎక్కడో డాన్స్ ప్రాక్టీస్ వుంటుంది,
అక్కడికి పంపండి అనీ చెప్పి వెళుతూ ఇంకా ఏ ఏ ఫంక్షన్ కి ఏమీ డ్రెస్ కోడ్ కూడా చెప్పి వెళ్లారు.
ఆవిడ చెప్పిన డ్రెస్ కోడ్ కి ముందు మాఇంట్లో ఒక పాతిక ముప్పై వేలు ఖర్చు అవుతుంది అనుకున్నాను.
హల్దీ ఫంక్షన్ ఏమిటో కొత్తగా మొదలు పెట్టారు. ఏ సినిమా లో మొదట చూపెట్టారో , అందరూ పసుపు కలర్ లో
బట్టలు , ఆ పెళ్లి కూతురు ని , పెళ్లి కొడుకు కి పసుపు నీళ్లు పోయటం, ఏమిటో ఈ వేలం వెర్రి అనిపిస్తుంది.
ఎన్నో నార్త్ ఇండియన్ వాళ్ళ పెళ్లిళ్లు చూసాము కానీ ఈ హల్దీ ఫంక్షన్ ఎక్కడా చూడలేదు .
వాళ్ళ బారా త్ అవుతూనే , పెళ్లి వుంటుంది . పెళ్లి లో కూడా వాళ్లకి ఎక్కువగా సిందూర్ పెట్టటం,
అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయటం ముఖ్యం.
ఈ సంగీత్ లు , బారాత్ లు అయి పెళ్లి టైమ్ కి ఎవరికీ ఓపికలు వుండవు . ఇంక ఈ మధ్య పెళ్ళిళ్ళ లో
ఫోటోగ్రాఫర్, వీడియో వాడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఒక్కొక్క సారి వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది. నేను అయితే చాలా పెళ్లిళ్ళ లో వాళ్లకు నేచరల్
గా తీయండి రా బాబూ , ఆలా వేధించక అనీ చెప్పాను.
ఇవ్వన్ని వింటూ ఉంటే నాకు పూర్వం రోజుల పెళ్లిళ్లు గుర్తు వస్తూ ఉంటాయి.
మన ఆంధ్ర లో ముహుర్తాలు ఎక్కువగా ఉదయం 11 గంటల లోపల, సాయంత్రం అయితే ఏడు గంటల తర్వాత వుంటాయి. కానీ చెన్నయ్ వాళ్లకు ఉదయం ముహూర్తం ముఖ్యం , ముహూర్తం కాగానే చక్కటి బ్రేక్ ఫాస్ట్
వుంటుంది. సాయంత్రం రిసెప్షన్ లో వాళ్లకు కచేరిలు తప్పకుండా వుంటాయి.
చెన్నయ్ లో తొంబై ల్లో వెళ్లిన పెళ్లిళ్ళు ఇలాగే జరిగేవి. ఇప్పుడు అక్కడ కూడా ఏమయినా మార్పులు
వచ్చా యేమో తెలియదు.
నా చిన్నప్పుడు మా మేనత్త కూతురు పెళ్లి లో సాయంత్రం రిసెప్షన్ లో భరత నాట్యం చూసినట్లు గుర్తు.
బెంగళూరు లో ఆ టైమ్ లోనే ఒక గవర్నమెంట్ లో పెద్ద ఆఫీసర్ గారి ఇంట్లో సాయంత్రం రిసెప్షన్ కి వెళ్ళాము.
ఆరోజు డిన్నర్ లో వాళ్ళు పక్కా కన్నడ భోజనం బీసీబెలి బాత్ , పులిహోర, పెరుగు అన్నము, వాళ్లు ముఖ్యం గా
వేసే కోసంబ్రీ బీన్స్ కూర, బొబ్బట్లు, తో చక్కగా అరిటాకు వేసి వడ్డీంచా.రు . ఇంకా ఏవో డిసెర్ట్స్ వున్నాయి అనుకోండి.
భిలాయి లో కూడా స్టీల్ ప్లాంట్ లో ఒక సీనియర్ ఆఫీసర్ గారి ఇంట్లో పెళ్లికి వెళ్ళితే వాళ్ళు ఇలాగే వడ్డీంచారు.
అయితే అక్కడ అరిటాకు లు వేయ లేదు, కానీ మనం ఎప్పుడూ చూడని రకరకాలుగా స్వీట్స్ బ్రేక్ ఫాస్ట్ లో
భా ఫె లాగా పెట్టారు, వాళ్లకు బ్రేక్ఫాస్ట్ లో పూరీలు , కచోరీలు తప్పనిసరి కదా.
ఇప్పుడు అక్కడ కూడా ఇటలీయన్, మేక్సికన్ , చైనీస్ ఫుడ్స్ వ చ్చా యేమో తెలియదు.
అసలు ఫోటో షూట్ గురించి కదా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో పెళ్లిళ్లు లో ఒక స్టూడియో వాడు
వచ్చి పెళ్లి లో ముఖ్యమైన ఘట్టాలు ఒక పది తీసే వారు అనుకుంటా
ఇంకా ఎవరికైనా కెమెరా ఉంటే కొన్ని ఫోటోలు తీసే వారు. అవీ బాగా వస్తే సరే , లేక పొతే
తర్వాత చూసుకుని నవ్వుకోవటానికి ఒక మధుర స్మృతి లాగా మిగిలి పోతాయి.
మా పెళ్లి ఫోటోలు అలాగే అయినాయి , పెళ్లి టైమ్ కి మాములుగా వచ్చే ఆస్థాన ఫోటోగ్రాపర్
రాలేక పోయాడు, వేరే పెళ్లి లో బిజీ అయిపోయి, ఇంక మా అన్నయ్యలు తలా ఒక కెమెరా తో
తీశారు కానీ, ఆ ఫోటోల్లో జంట లో ఒక్కళ్ల మొహం ఉంటే రెండో వాళ్ళు మొహం బ్లరెడ్ గా అయిపోయి
ఏదో మాకు ఫోటో షూట్ అయింది అన్నట్లు వుంటాయి.
ఇప్పుడు కూడా మావారు బావ మరుదులకు కెమెరా పట్టుకోవడం రాలేదు అంటూ వుంటారు. అన్నయ్య ల మీద ఈగ వాలినా సహించ లేని నేను మీరు ముహూర్తం మార్చారు , అందుకే ఫోటోగ్రాఫర్ దొరకలేదు అంటాను.
కానీ మా ఇంట్లో ఏ పెళ్లి అయినా , మర్నాడు ఈ ఫోటో షూట్ వుంటుంది. మా మేడ మీద బాల్కనీ దగ్గరగా
కొబ్బరి చెట్టు ఆకులు వాలి , ఎంతో అందమైన సీనరీ లాగా వుంటుంది.
ఇప్పటి లాగా పెళ్లి అయిన వెంటనే అప్పగింతలు కా దు కదా, తీరికగా మర్నాడు సాయంత్రం తప్పకుండా
కొత్త దంపతులకు ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటోలు తీసే వాడు.
ఆలా మా ఇంట్లో జరిగిన మా అక్కయ్య, ఇంకా కజిన్స్ అందరి పెళ్లిళ్ళ ఫోటోలు మా అమ్మగారు ఫ్రేమ్ చేసి
వరసగా గోడకు పెట్టించారు. అయితే అన్నీ ఫోటోల్లో పెళ్లి దంపతులు పోజ్ ల్లో మార్పులు వున్నాయేమో కానీ
మా కొబ్బరి చెట్లు ఆకులు మాత్రం బాల్కనీ మీదకు వాలి కొత్త దంపతులను దీవిస్తున్నట్టు వుంటాయి.
కొన్ని ఫోటోల్లో పెళ్లి కూతురుని కుర్చీలో కూర్చోపెట్టి పెళ్ళికొడుకు వెనకగా నుంచుని ఫోటో తీశారు
అప్పుడు ఆలా ఫ్యాషన్ ఏమో అనుకున్నాను.
మా మేనత్త అయితే ఈ ఫోటో షూట్ లో మొత్తం ఫ్యామిలీ ని కూర్చోపెట్టి ఫోటోలు తీయించేది.
ఆ రోజుల్లో పెళ్లిళ్ళ సందడే వేరు గా ఉండేది. వినాయకుడి బియ్యం కట్టటానికి , వడియాలు, అప్పడాలు
పెట్టటానికి , ఊరగాయలు పెట్టాటానికి దగ్గర వాళ్ళు వచ్చేవారు .
వడియాలు పెట్టే ముందు ఆ చీర మీద తమలపాకు లో పసుపు గౌరీ దేవిని చేసి పెట్టి ఏదయినా ఆభరణం
ఆ గౌరీ దేవికి పెట్టి పెళ్లి కూతురు చేత నమస్కారం చేయించి , అందరూ పెళ్లి కూతురును ఆశీర్వదించి
అప్పుడు వడియాలు పెట్టే వారు.
అరిసెలు ఇంకా ఏమయినా స్వీట్స్ నలుగురు కలిసి చేసుకునే వారు. అరిసెలు చేయటం, అప్పడాలు వత్తటం
అవన్నీ నాకు ఏ ఫోటో లేకుండా నే కళ్ల ముందు కన బడుతూ వుంటాయి.
మేజు వాణి, బువ్వంబంతి, వియ్యపురాళ్లకి స్వీట్స్ ఇచ్చే ముందు జరిపే పళ్ళు తోము పుల్లలు
అనే వారు .
ఆడ పెళ్లి వారు మగ పెళ్లి వారికీ , మరలా వాళ్ళు వీళ్లకి సరదాగా చేసే వారు.
ఆ వేడుక లో నవ్వులు విర బూసేవి.
పెళ్లి కూతురుకు పూల జడ వేయటం , చక్కగా అమర్చి చీర కట్టటం , వల్లె వాటు వేయటం అన్నీ, మేనత్తలో
పి న తల్లులో ఓపికగా చేసే వారు. వేసవి కాలం అయితే మల్లెల జడ తప్పనిసరి గా వేసే వారు.
ఈ మధ్యలో ఒక పెళ్లి లో చూసాను , పెళ్లి పీటల మీద వున్న పెళ్లి కూతురుకు ఈవెంట్ మేనేజర్ లేక
మేకప్ అమ్మాయో లిప్ స్టిక్ సరి దిద్దుతున్నది.
హత విధి అనుకున్నాను.
ఇంకొక పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళాము. ఆరోజు పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్ నుంచీ వస్తూ ట్రాఫిక్ జాం లో
ఇరుక్కుపోయింది.
పాపం పెళ్ళికొడుకు బంధువులు అవస్థ చూడాలి. ఆ రోజు ఆ పెళ్లి కొడుకు ఫ్రైండ్ చెప్పాడు, ఇలా ఈ మధ్య
చాలా చోట్ల ఇలాగే జరుగుతున్నది అనీ.
ఆరోజుల్లో పెళ్లి అయిన మర్నాడు, మూడు నిద్రల్లో , సరదాగా తీయించుకునే ఫోటోలు చూస్తూ ఉంటే
ఏన్నో జ్ఞాపకాలు మన బంధువులు, ఆ కబుర్లు, ఆ సరదాలు అన్నీ ఒక మధురానుభూతులు లాగా గుర్తు .
వస్తూ వుంటాయి, అదీ ఆనాటి ఫోటో షూట్
పెళ్లి కాకముందే ఎక్కడికో వెళ్లి ఆ ఫోటోగ్రాఫర్ ముందు ఏవో పోజుల్లో ఫోటోలు తీస్తే అవన్నీ సంగీత్ రోజున
సినిమా లాగా వేయటం ఇప్పటి ఫోటో షూట్.
మా చెల్లెలు పెళ్ళిలో మా మరిదిగారు యూ. ఏస్ నుండీ పొలారాయిడ్ కెమెరా తెచ్చారు కొత్తగా ,
దానిలో ఫోటోలు అప్పుడు ఒక విచిత్రం, ఆ పెళ్ళికే ఫస్ట్ కలర్ ఫోటోలు.
ఏదో సినిమా లో ఒక పాట గుర్తు వస్తుంది , అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఆది తెలిసీ మసులుకో
బస్తీ చిన్నోడా అనీ
ఇంతకీ మా మనవరాలు మా మనవడు వస్తే గాని సంగీత్ కి వెళ్ళదుట, వాడికేమో ఇంటర్ ఎగ్జామ్స్.
సో నాకు లవ్లీ వై లెట్ కలర్ డ్రెస్ అక్కర్లేదు అనీ వాళ్ళ అమ్మకు చెప్తోంది.
ఇంక లవ్లీ వైయలేట్ కలర్ చీర " ఆవిడ భాషలో నేను చెప్తున్నాను, " పసుపు రంగు హల్ది ఫంక్షన్ కి,
పెళ్లి కూతురు ఫంక్షన్ కి కుంకుమ రంగు వాటికీ మ్యాచింగ్ నగలు గాజులు రెడీ చేసుకుని
ఫోటో షూట్ లో వాళ్లతో మ్యాచింగ్, మ్యా చింగ్ గా ఉండాలి మా కోడలు.
మా కోడలు కి అన్నీ సవ్యంగా దొరకాలని దీవించాను.
శుభాకాంక్షలు పెళ్లి వారికీ
శుభ రాత్రి మీకు
Comments