top of page
Search

టెలిఫోన్ నుంచి సెల్ఫోన్ కీ.

  • murthydeviv
  • 14 hours ago
  • 4 min read

పూర్వం రోజుల్లో పుస్తకం హస్త భూషణం అనే వారు. ఎవరైనా ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటే వాడు ఒక

పుస్తకాల పురుగు అనే వారు. ఇప్పుడు అయితే సెల్ ఫోన్ హస్త భూషణం అనాలి .

అందరూ ఆ అర చేతిలో స్వర్గం కి బానిసలు కాబట్టి ప్రత్యేకంగా ఏ పేరు పెట్ట అక్కర్లేదు.


చేతిలో ఫోన్ చెవిలో ఏవో పెట్టుకుంటే ఎదుటి వాళ్లు ఏమీ మాట్లాడినా వినిపించదు.

మనం మూగ వాళ్ళ లాగా సైగ చేస్తే వాళ్ళ దృష్టి మన మీద పడితే అప్పుడు రియాక్ట్ అవుతారేమో.

మా చిన్నప్పుడు ఫోన్, ఫ్రిడ్జ్ అలాంటివి ఉండటం చాలా లగ్జరీ అనుకోవచ్చు.


మా ఇంట్లో ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ అలాంటివి లేవు కానీ ఫోన్ మాత్రం ఉండేది. ఆ వీధిలో

పక్క వీధిలో వాళ్ళ బంధువులు ఫోన్ చేసినా ఏదయినా అర్జెంటు కబురు ఉంటే పలానా

వాళ్లకి కబురు అందించమనేవారు..

ఎక్కువగా నాన్నగారు వాళ్లు బిజినెస్ పనులకు వాడుకునే వారు . మా నాన్న గారు ఎక్కువగా ట్రావెల్

చేస్తూ ఉండేవారు. మమ్మల్ని ట్రైన్ లేట్ వుందా కరెక్ట్ టైమ్ కి వస్తుందా అని కనుక్కోమనేవారు.


ఇప్పటి లాగా ఒకటి నొక్కండి , రెండు నొక్కండి అనే బాధ లేకుండా ఆపరేటర్ స్టేషన్ కి కనెక్ట్ చేస్తే

వాళ్లు వెంటనే చెప్పేవారు.

అన్నట్లు మధ్యలో ఆపరేటర్ ఉండేవాడు. అతనికి మనం నెంబర్ చెప్తే కనెక్ట్ చేసి ఇచ్చే వాడు.


ఎక్కువగా మా మేనత్త గారి పిల్లల కు ఫోన్ చేసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళము.


కొంచెం కాలేజీలకు వచ్చాక ఫ్రైండ్స్ కి ఫోన్లు చేయటం కబుర్లు బాగా నడిచేవి .

వేరే ఊర్లకు ట్రంక్ కాల్ బుక్ చేసి గంటలు వెయిట్ చేస్తే కానీ వచ్చేది కాదు . 1980 లో కాబోలు

ఎస్ టీ డీ సౌకర్యము వచ్చింది.

ఎంత సులువు అయిపోయినా బిల్లులు మాత్రం తడిపి మోపెడు వచ్చేవి.

మధ్యలో పేజీర్ అనే పరికరం ఒకటి వచ్చింది. మనం ఇంటి నుండి ఆ పేజీర్ నెంబర్ కి నొక్కితే

వాళ్లకు బీప్ సౌండ్ వచ్చేది. వాళ్లు అప్పుడు ఫోన్ చేసే వాళ్లు.


ఈ పేజెర్ ఎక్కువ రోజులు వాడాల్సిన పని లేకుండా నోకియా, బి ఎస్ ఎన్ ఎల్ చిన్న ఫోన్లు వచ్చేసాయి.

మొదట్లో బిల్లులు ఎక్కువ గా వస్తున్నాయని వాడటానికి భయపడే వాళ్లము.


1993 లో మా అమ్మాయి ఫస్ట్ టైమ్ అమెరికా వెళ్ళినప్పుడు శని అదీ వారాలు మాత్రమే బిల్ తక్కువగా ఉంటుందని మాకు ఆరోజుల్లోనే ఫోన్ చేసేది.

నేను 1995 లో యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఈ సెల్ ఫోన్లు లేవు. న్యూ యార్క్ ఎయిర్పోర్ట్ లో

పిట్స్ బర్గ్ లో వున్న మా అమ్మాయికి పబ్లిక్ ఫోన్ నుంచీ ఫోన్ చేశాను.


ఆ రోజు కన్ఫ్యూషన్ తల్చుకుంటే ఇప్పుడు అలాంటి రోజులన్నీ మనం చూసాము కదా అనుకుంటాను.

నా దగ్గర ఆ ఫోన్ లో వేయటానికి కాయిన్స్ లేవు. పక్కనే ఫోన్ చేస్తున్న వాడిని ఆ హడావిడిలో

డు యూ హావ్ చిల్లర్ అని అడిగాను. పాపం ఆ మానవుడు నా అవస్థ చూసి ఓహ్ యూ నీడ్

కాయిన్స్ అంటూ చిల్లర ఇచ్చాడు.


నేను మాత్రం అతనికి ఏ నోట్ ఇస్తున్నానో అనేది కూడా చూసుకోలేదు. అతను ఏవో కొన్ని నోట్లు ,

ఇంత చిల్లర నా చేతిలో పెట్టాడు..


అదే ఇప్పుడైతే అడుగు అడుగు కి ఫోన్లు వీడియోలు , లేచామా , తిన్నామా ఒకటేమిటి అసలు

ఫోన్ లేనిదే తెల్లవారదు.

ఈ స్మార్ట్ ఫోన్ ఎవరి పుణ్యమో నాకు తెలియదు కానీ రోడ్డు మీద కారులో , బైక్ ల మీద

వెళ్ళేవాళ్ళు కూడా ఆ ఫోన్లో మాట్లాడుతూ వుంటారు.


చిన్న పిల్లలు కి ఆయాలు ఫోన్ చూపిస్తూ అన్నం పెట్టటం అలవాటు చేస్తారు. ఇప్పుడు పెద్ద వాళ్లు అయినా


ఫోన్ చూస్తూనే అన్నం తింటారు. ఏమీ తింటున్నారో కూడా తెలియదు. నేను, మా వారు మనవడికి,


మ న వ రాలికి చెప్పి విసుగు వచ్చి ఇంక మానేసాము.

పైన మీరు ఫోన్ లేకుండా ఎలా వున్నారు అనే ఆశ్చర్యం వాళ్లకి. నేను చెప్తాను, హాయిగా వున్నాముఅని.


మొన్నీ మధ్యలో దాకా బి ఎస్ న్ ఎల్ ల్యాండ్ ఫోన్ వున్నా ఎవరూ ఆ ఫోన్ కి ఫోన్ చేయక పోవటం తో

ఈ మద్య తీసివేయించాను.

స్మార్ట్ ఫోన్ తో ఎన్నో ఉపయోగాలు ఉంటే ఇలా రాస్తున్నారు ఏమిటీ అనుకుంటారేమో.


సెల్ఫోన్ వచ్చాక ముందు గా బయటికి వెళ్లిన వాళ్ళ యోగ క్షేమాలు తెలుసుకోవచ్చు. పూర్వం రోజుల్లో

దూర ప్రదేశాలకు వెళ్లిన వాళ్ళు ఒక టెలిగ్రామ్ ఇచ్చే వరకు కొంచం కంగారు గా కూడా ఉండేది.


ఇప్పుడు వాళ్ళు ఫోన్ ఆన్సర్ చేయక పోయినా మనకు కంగారు గా వుంటుంది.. నేను మాత్రం

మా పిల్లలు ఊరు వెళ్ళితే ఒక మెస్సేజ్ పెట్టండిరా బాబూ అని చెప్తాను.

ఫోన్ వుంది కదా అని ఎప్పుడూ చేస్తూ ఉంటే వాళ్లకు విసుగు రావచ్చు కదా.


అసలు ఫోన్ తమాషా పని వాళ్లతో వుంటుంది. ఒక పక్కన అంట్లు తోము తూ , ఇంకో పక్కన మాట్లాడుతూ వుంటారు.

ఇంక డ్రైవర్స్ వాచ్ మాన్ అయితే రాగానే చెవుల్లో పెట్టేసుకుని కూర్చుంటారు. వాళ్ళని పిలవాలి ఆంటే

ఇంకో మనిషి అన్నా కావాలి , లేక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.


ఇదివరకు రోజుల్లో అయితే మా వారి ఆఫీసు బిల్డింగ్ కింద ఆ బిల్డింగ్ లో వున్న కారు డ్రైవర్స్ అందరూ

క్యారెమ్ బోర్డ్ , చైనీస్ చెక్కర్ ఆడుతూ కనిపించే వారు.. ఇప్పుడు అందరూ ఎవరి ఫోన్స్ లో వాళ్లు బిజీ.


వాళ్ళని ఏదయినా పని మీద బయటికి పంపినా ఏవో డౌట్స్ తో ఫోన్లు చేస్తూనే వుంటారు.


ఇదివరకు కొంచెం తీరిక దొరికినా ఏదో బుక్ చదివే వాళ్లము. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కి, పేస్ బుక్ లకు

వాట్సాప్ లకు ఎంతలాగా అలవాటు పడ్డాము ఆంటే లేస్తూనే ఫోన్ తీసుకుని మెస్సేజ్ లు చూడటం.


ఏదయినా కథ గాని , ఇంట్రస్ట్ వున్న టాపిక్ గాని కనిపిస్తే కళ్ళు వాటి వెంబడి పరిగెడతాయి.

చిన్న తనము లో నవలలు, ప్రభలు అలాగే చదువుతూ వుండే వాళ్ళము.


మార్కులు తక్కువగా వస్తే కోపం చేసే నాన్నగారు లేరు, లేటుగా స్నానం చేసి వంటింట్లో కి వెళ్ళితే

ఒక చురక అంటించే అత్తగారు లేరు..


ఒక కప్పు కాఫీ తాగి ఫోన్ పట్టుకుంటే టైమ్ ఆలా జారి పోతుంది. టైమ్ కి వేసుకోవాల్సిన బి. పి, షుగర్ మందులు

రోజూ లేట్ , పూజలు కూడా లేట్ , ఆలా ఈ సెల్ ఫోన్ ఎన్నింటినో మాయం చేసింది.


అందులో ఈ కాలం విలువ కూడా.

ల్యాండ్ లైన్ వున్నప్పుడు ఎక్కువగా ఎంగేజ్ ఉంటే ఇంటికి వచ్చాక పెద్ద వాళ్లు ఎవరు మాట్లాడారు ,

ఎంత టైమ్ వేస్ట్ చేసారు అని కనుక్కునే వారు.

ఇప్పుడు అలాంటి భాధలు లేవు , ఎవరి ఫోన్ వాళ్లదే .


అందుకే మనకు మనమే ఒక డిసెప్లిన్ పెట్టుకోవాలి అని అనుకుంటాను.

అన్నట్లు ఇదివరకు అందరమూ కూర్చుని టీ వి చూసే వాళ్ళము. ఇప్పుడు ఆలా లేదు కదా

ఎవరి ఫోన్లో వాళ్ళే చూడచ్చు. అందుకని నేను ఒక రూల్ లాగా

వారానికి ఒకసారి అందరము కూర్చుని సినిమా చూడాలి అని ఒక రూల్ పెట్టుకున్నాము .


ఎన్ని వాట్సాప్ లు వున్నా నాకు మాత్రం చక్కగా అందమైన కాగితాల మీద లెటర్ వ్రాయటం, ల్యాండ్ లైన్ లో

హాయిగా కబుర్లు చెప్పుకోవటం ఇష్టం .


కాగితాల మీద రాసిన ఉత్తరం ఎప్పటికి ఆలా ఒక స్మృతి లాగా వుండి పోతుంది


మనకు ఓల్డ్ ఈస్ గోల్డ్ లాగా పాత విషయాలు నచ్చినా కొత్త కొత్త విషయాలు, మార్పులు వస్తూనే వుంటాయి


అయితే అరోజుల్లో మనం సంతోషంగా, సుఖంగా లేమా ఆంటే ఇంత కన్నా హాయిగా వున్నాము అనుకుంటాను.



































































C













 
 
 

Recent Posts

See All
గుజ్జన గూళ్ళు

అసలు ఈ రోజుల్లో ఈ మాట ఎవరికైనా తెలుసో తెలియదో కానీ మా చిన్న తనం లో మేము గుజ్జన గూళ్ళు అని వంటలు చేస్తూ వుండే వాళ్ళము. అసలు ఆరోజుల్లో మనం ఆడిన ఆటలు ఇప్పుడు పిల్లలు కు అసలు తెలియదు కూడా. మరీ చిన్

 
 
 
సరాగ మాల

ఈ పేరు తో మేము చదువుకునే రోజుల్లో ఆంధ్ర పత్రిక లో ఒక ఆర్టికల్ వచ్చేది. ఆరోజుల్లో పత్రిక , ప్రభ అమూలగ్రమ్ .చ ది వే దాన్ని . ఆ ఆర్టికల్ వి. ఏ కె రంగా రావు గారు రాసే వారు. అందులో సినిమా పా

 
 
 
హ్యాపీ హోలీ కబుర్లు

మనకు ఆంధ్ర లో ఈ హోలీ పండగ గురించి తెలియదు. మా వారు హైదరాబాద్ లో చదువుకున్నా అప్పుడు ఇంత హడావుడి ఉండేది కాదేమో. మేము పంజాబ్ వెళ్లిన నాలుగు నెలలకో ఏమో ఈ పండగ వచ్చింది. యూనివర్సిటీ లో వున

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page