top of page
Search

కన్యా శుల్కము

  • murthydeviv
  • 6 days ago
  • 2 min read

ఈ కాలం వాళ్ళకి తెలియక పోయినా కన్యా శుల్కం నాటకం గురించి మన లాంటి సినియర్స్ కి ఈ నాటకం, గిరీషం డైలాగ్స్ కొట్టిన పిండి.


మాకు బంధువులు, స్కూల్లో టీచర్ గా చేస్తున్నా నాటకాలు ఆయన హాబీ.

ఎప్పుడూ ఏవో డ్రామా లు వేస్తూ, వేయిస్తూ ఉండేవారు.


భువన విజయం, కన్యాశు ల్కమ్, చాణక్య నాటకాలు వేసే వారు. అరోజుల్లో నాన్నగారు అన్నయ్యలతో సినిమాలు కి పంపే వారు కానీ , నాటకాలు కి

మాత్రం ఆడపిల్లలు ని పంపే వారు కాదు.


ఆ నాటకాలు కి మా అన్నయ్యలు వెళ్ళితే నాకు చాలా బాధగా ఉండేది.

ఆ మాస్టర్ గారు కూడా నాన్నగారు ఇంట్లో వున్న టైములో వచ్చే వారు కాదు.


ఎప్పుడైనా పొరపాటున కనిపిస్తే ఈ పిచ్చి మానుకో అని సలహా ఇచ్చేవారు.


నాన్నగారు ఇంట్లో ఉంటే మేము రేడియో లో సినిమా పాటలు కూడా పెట్టే వాళ్లము కాదు. ట్రాన్సస్టర్ వచ్చాక మాకు స్వతంత్రం వచ్చి మేడ మీద పెట్టుకుని వినే వాళ్లము.


మా పెళ్లి అయిన కొత్తల్లో మా వారు జోరుగా ఇంట్లోనే సిగరెట్ తాగుతూ వుండే వారు..


ఆలా ఎక్కువగా తాగకండి అంటూ మా పెద్ద అన్నయ్య చెప్తూ ఉంటే ఈయన గొప్పగా గిరీషం ఖ ఘ పతి అమృతం తేగా అంటూ పద్యమ్ పూర్తిగా చెప్పి


పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని పూర్తి చేసారు.


పక్క గదిలో వున్న మా నాన్నగారిని. ఎవరమూ గమనించలేదు.


మర్నాడు భోజనాలు దగ్గర నాన్నగారు మెల్లగా ఈయన తో ఆ పుస్తకం చదివారా

లేక ఈ డ్రామాలు వేసే అలవాటు వున్న దా, అని అడిగారు.


మామ గారు ఆలా అడిగే టప్పటికి మావారు కూడా కొంచెం మొహమాటం తో

మాకు ఉద్యోగాల్లో అంత తీరిక ఎక్కడ వుంటుంది , ఇవ్వన్నీ చదివినవే అంటూ చెప్పారు.


ఎప్పుడు కన్యా శు ల్కమ్, సినిమా గాని పుస్తకం గురించి గాని టాపిక్ వస్తే


నాన్న గారి హెచ్చరిక గుర్తు వచ్చి నేను మావారు నవ్వుకునే వాళ్ళము.


మేము హైదరాబాద్ వచ్చాక రవీంద్ర భారతిలో సోమయాజులు గారు, రమణ మూర్తి గారు వేసిన కన్యా శు ల్కమ్ ,నాటకం చూడ గల్గాను.


ఆ రోజుల్లో రవీంద్ర భారతి లో మంచి డాన్స్ ప్రోగ్రామ్ లు , డ్రామాలు

సంగీత కచేరిలు జరిగేవి .


కొన్నిటికి ఇన్విటేషన్ వచ్చేవి. కొన్ని టికెట్ కొనుక్కుని మరీ వెళ్ళేవాళ్ళము.

అసలు ఇప్పుడు జరుగుతున్నది లేనిది కూడా తెలియదు.


భువన విజయం, చాణక్య, రాయభారం నాటకాలు మాస్టర్ గారు ఆ రోజుల్లో వేసినప్పుడు చూడ లేదు అనే ఒక కొరత మాత్రం ఉండిపోయింది.


ఆ రోజుల్లో తల్లి తండ్రులు డిసెప్లిన్ ఆలా ఉండేది. ఈ రోజు వీర తాడులు

చూడ గానే ఆ రోజుల్లో జరిగిన వన్నీ గుర్తు వచ్చాయి.

 
 
 

Recent Posts

See All
శ్రీ రామ నవమి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు. మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు. రాములువారి కళ్యాణం అని వీధి వీధికి

 
 
 
తులసి పాట

ఉదయం గంగ రాజు గారి వీర తాడు లో జలంధరుడు చూసాక నాకు మా అత్తగారు తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం పెట్టి ఒక పాట పాడుతూ ఉండేవారు. అది గుర్తు వచ్చింది. ఆవిడ ఏకాదశి నాడు కూడా గీతా సారం అంటూ

 
 
 
స్లో కుకింగ్

వారణాసి సుధాకర్ గారి పోస్ట్ కుంపటి ని, పొట్టు పొయ్యిని గుర్తు చేస్తే , ఈ రోజు జగదీష్ గారి పోస్ట్ పచ్చి జీడిపప్పు లు గుర్తు చేసింది. ఆ రోజుల్లో పొయ్యి, కుంపట్లు మీద వంట నిదానంగా అయినా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page