top of page
Search

ఆంధ్రా యాత్ర

  • murthydeviv
  • 2 days ago
  • 2 min read

ఈ మధ్య విజయవాడ వెళ్ళాము. ఎన్ని ఏళ్లు హైదరాబాద్ లో ఉన్నా ఆంధ్రా లోకీ

వెళ్ళగానే ఏదో సొంత వాళ్ళను చూసిన ఆనందం వస్తుంది.

అందులో ఇపుడు కోదాడ దాటగానే చెక్ పోస్ట్ కూడా వస్తుంది

ఇంకా ఎక్కువగా ఆహా మన ఆంధ్రా కి వచ్చాము అనే సంతోషము. మా పిల్లలు అయితే అబ్బా రాజధాని గా మారుతున్నా ఈ ఊర్లు నీట్ గా ఉండవు అంటే, వెంటనే నాకు

కోపం వస్తుంది.

మీరు హైదరాబాద్ లో విల్లాలు లో ఉంటూ హై టెక్ సిటీ వైపు ఉంటే అలాగే నీట్ గా ఉంటుంది ఓల్డ్ హైదరాబాద్ ఇలాగే ఉంటుంది, అని వాదిస్తూ ఉంటాను.

కృష్ణా జిల్లాలో మోపి దేవి వెళ్ళాలని గూగుల్ గారిని

అడిగితే అది పాపం రెండు దోవలు చూపించింది.

దగ్గర దోవ ప్రిఫర్ చేస్తాము కదా , అని ఒక సింగల్ రోడ్డు మీద గా

ప్రయాణం సాగింది .

కృష్ణా నది ఒడ్డు పక్కగా వేసిన రోడ్ పచ్చని చెట్లు మధ్య మధ్య

వంకలు తిరుగుతూ కృష్ణా నది , ఎక్కువగా నీళ్ళు

లేకపోయినా అలా నదిని చూస్తూ ప్రయాణం చాలా

ఆహ్లాదంగా ఉంటుంది.

అరటి తోటలు, నారింజ తోటలు , మధ్య మధ్య చేమంతి, బంతి,

తోటలు కనువిందు చేశాయి.

దారి పొడవునా అరటి గెలలు , రేగి పండ్లు, నారింజ పండ్లు

అమ్ముతునే వున్నారు.

ఇంకా తేగలు అయితే కట్టలు గా ఉన్నాయి మా గ్రాండ్ చిల్డ్రన్

కి వాటి పేరు గాని ,అవి తినటం కానీ తెలియదు.

మనం ఈ వయసులో తినటానికి పళ్ళు సహకరించవు కదా

అలా ఆనందం గా ప్రయాణం చేస్తూ మోపిదేవి చేరాము.

ఒక ఇరవై ఏళ్ల క్రితం వెళ్ళాను అపుడు గుడి ప్రశాంతంగా

వుండేది గర్భ గుడిలో కూర్చొని అభిషేకము చూసినట్లు గుర్తు.

ఇపుడు అన్నీ గుడులు లాగానే అక్కడ కూడా విపరీతంగా

రష్ .

దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ మాటే

మా డ్రైవర్ తో అంటే యూ ట్యూబ్ వలన అందరూ

ఇలా. వస్తున్నారు అమ్మా అన్నాడు.

మంచిదేగా ప్రజల్లో భక్తి పెరుగుతున్నది అన్నాను.


సరే మరలా విజయ వాడ చేరి లంచ్ కోసం గూగుల్ గారి ను

సంప్రదిస్తే వారు ఇటాలియన్ , నార్త్, సౌత్ అన్నీ ఏకరువు

పెట్టారు.

నాకు తెలిసిన మమత మనోరమ ఇంకా ఉన్నా, మా పిల్లల

కోరిక మీద నికోలి అనే ఇటాలియన్ హోటల్ కి వెళ్ళాము.

ఆహా విజయవాడ కూడా రాజధాని పోకడలు వచ్చాయి,

అనటానికి గుర్తు గా చినిగిన జీన్స్ లో అబ్బాయిలు,

అమ్మాయిలు, జడలు వేసుకోగలిగే జుట్టుతో అబ్బాయిలు

కనువిందు చేశారు.

మనకు తినటానికి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప ఏమి ఉండవు కదా

సరే అవే కాసిని తిన్నాను అనిపించి , కారులో కృష్ణా నీళ్లు తో

పెరిగిన అరటి పండ్లు , నారింజ తో లంచ్ పూర్తి చేశాను.

అక్కడ నుండి వేదాద్రి వెళ్ళాము .


నరసింహ స్వామి ఆలయం ఆ గుడి మా ఇంటి ఇలవేలుపు

అని మా అత్త గారు చెప్పారు.

అందువలన ఆంధ్రా కి వెళ్ళి నప్పుడు ఆ ఆ స్వామి నీ

దర్శించుకుని వస్తాము.

అక్కడ కూడా కృష్ణా నది నిండుగా ప్రహిస్తున్నది.

అక్కడ గుడిలో నే చాలా మంది భక్తులు ఆ గుడి ఆవరణ

లోనే నిద్ర చేస్తూ వుంటారు.

ఉదయాన్నే కృష్ణలో స్నానాలు చేసి. స్వామిని దర్శించి

మొక్కలు తీర్చుకుంటారు.

వాళ్ళని చూస్తే ఆ భక్తి, , ఆ నమ్మకా లకు ఆశర్యం

ఆనందం రెండూ కలుగుతాయి.

శనివారం రాత్రి నుండి రేపు ముక్కోటి ఏకాదశి వరకూ అలా

మూడు రోజులు ఉంటారుట.

మనం ఎలాగూ చేయలేము కాబట్టి వాళ్ళను చూసి భక్తి

తో నమస్కరిస్తే మనకు కూడా పుణ్యం వస్తుంది అనుకున్నాను.

ఇప్పుడు అక్కడ కోతులు కూడా ఎక్కువ గానే ఉన్నాయి.

కృష్ణా నది ఒడ్డునే హుజూరాబాద్ దగ్గర మట్టపల్లి కూడా

నరసింహ క్షేత్రము ఉంది.

అక్కడ నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కూడ వున్నది.

ఇంకా హైద్రాబాద్ దగ్గరగా నల్గొండ జిల్లా లో వాడపల్లి

కూడా నరసింహ క్షేత్రము ఉంది.

ఆ క్షేత్రం కూడా కృష్ణా నది ఒడ్డు మీద ఉంది..

అవీ మా యాత్ర విశేషాలు.

 
 
 

Recent Posts

See All
అపురూప చిత్రాలు 2

మొన్న అపురూప చిత్రాలు 1 అంటూ రాశాను కదా అందుకని ఇంకా కొన్ని నాకు నచ్చిన సినిమాలు గురించి రాద్దామని మొదలు పెట్టాను. ఈ సినిమాలు నాకు నచ్చినవి అనే కాదు, కొంచెము సొసైటీ లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి తీసినవి

 
 
 
అపురూప చిత్రాలు 1

ఈ మధ్య ఉదయాన్నే పేపర్ చూసినా చూడక పోయినా ఫేస్ బుక్ మాత్రం తప్పక చూస్తాను. నిన్న గురుదత్ గారి కి 100ఇయర్స్ జయంతి సందర్భంగా ఆయన పిక్చర్స్ గురించి వ్రాసారు. ఈ రోజు ఎవరో శాంతారాం గారి సినిమాలు గురించి వ్ర

 
 
 
ఆణిముత్యం This website was built on Wix. Create yours today. Get Started T.B.L Home About Subscribe Search... Facebook Twitter All Posts అణిముత్యాలు murthydeviv Jul 9, 2025 3 min read Updated: Aug 9

ఈ మద్యలో కాస్త బద్దకం వదిలించుకుని కాస్త అలమర లో బుక్స్ కొంచెం దుమ్ము దులుపుదామని తీసాను.ఆ పుస్తకాల్లో ఎపుడో రాసుకున్న పాటల పుస్తకం కనిపించింది. ఎపుడూ ఏదో ఒకటి రాయడం అనేది ఒక అలవాటు. ఆరోజుల్లో విన్న ప

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page