top of page
Search

అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు 2

  • murthydeviv
  • 1 day ago
  • 4 min read

Updated: 1 hour ago

ఈ పాత సినిమాలు గురించి ఎంత రాసినా తృప్తి ఉండదు. కొన్ని సినిమాలు ఇప్పుడు చూస్తే కొంచెం సాగ తీత గా వున్నా కొన్ని పాట లు ఎప్పుడు విన్నా కొత్తగా , వీనుల విందుగా వుంటాయి.


అర్దాంగి లో హరిదాసు పాడే పాట మొన్న ఎవరో పేస్ బుక్ లో పోస్ట్ చేసారు పాడిన వారు ఆకుల నరసింహా రావు గారు ట. ఎప్పుడూ పేరు విన లేదు . రాధ ను రమ్మన్నాడు రాస క్రీడకు మాధవ దేవుడు అనే పాట


అన్నపూర్ణ సినిమాలు అంటూ , ఏవో రాస్తున్నాను కదా , సావిత్రి , నాగేశ్వరావు సినిమాలు అన్నీ ఒక్కసారే

గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది కదా ఆని.

అర్దాంగి లో కూడా అన్నీ మంచి పాటలే వున్నాయి. ఆ కధ శరత్ గారి స్వయం సిద్ద.


చక్రపాణి గారు బెంగాలీ నేర్చుకుని మరీ నవలలు తెలుగులో రాశారు. కానీ ఎందుకో సినిమా గా ఏవీ తీయలేదు .


సంతానం సినిమా అనగానే నిదుర పోరా తమ్ముడా లతా గారి పాట గుర్తు వస్తుంది. చల్లని వెన్నెల లో, చాలా

చక్కటి వెన్నెల వెలుగు లాగా సాగే పాట .

దేవి శ్రీదేవి అనే పాట కూడా ఈ సినిమాలో వుంది. నిన్ననే విన్నాను ఇదే పాట నాగేశ్వరావు ఏదో కొత్త సినిమా లో

విన్నట్లు గుర్తు . బహుశా అదే పాట మరలా వాడుకున్నారెమో .

బతుకు తెరువులో అందమే ఆనందం పాట లీలగారు , ఘంటసాల గారు ఇద్దరూ పోటీ పడి పాడినట్లు

హుషారుగా సాగి పోతుంది..

జీవితమే ఒక నాటక రంగం ఆంటే ఆని ఘంటసాల గారు ఆంటే , లీల గారు మాత్రం జీవితమే మధురాను రాగం అంటారు.

పాట వింటూ ఉంటే మాత్రం సముద్రపు ఒడ్డున విహరిస్తూ వున్నట్లే వుంటుంది.

ఈ పాట కూడా శిరీష కొమ్మరాజు గారు పాడారు. ఆవిడ చక్కటి ఉచ్చా రణ తో బాగా పాడతారు.


మాంగళ్య బలం 1958 లో వచ్చింది ట అప్పుడు బహుశా చూసి ఉండను. ఆ సినిమా కి కూడా మాస్టర్ వేణు గారు

సంగీతం. అందులో కూడా అన్నీ మంచి పాటలు.


ఆకాశ వీధిలో , తెలియని ఆనందం , వాడిన పూలే వికసించినే , అన్నీ బాగుంటాయి. ఇంకా రేలంగి గారి కి పాట ఉండాల్సిందే కదా. ఇంకా "హయిగా అలమగ లై "పాట చాలా రోజులు వరకు పెళ్ళిళ్ళ లో తప్పకుండా

పాడే వారు. . మా కజిన్స్ లో ఒక డు మాత్రం ఎప్పుడూ పెను చీకటి అయే లోకం పాడే వాడు

మేము అందరం భగ్న ప్రేమికుడు అంటూ ఎగతాళి చేస్తూ వుండే వాళ్ళము.


బెంగాలి కధ కాబట్టి చిన్న పిల్లలు కి పెళ్లి ఆని చూపించారు . అప్పటికి ఆంధ్రా లో అంత బాల్య వివాహాలు

లేవు కదా.

వెలుగు నీడలు కూడా అన్నపూర్ణ వారి సినిమా , ఎందుకో ఈ సినిమా ఇద్దరు మిత్రులు ఈ టీవీ లో

రాలేదు..

వెలుగు నీడల్లో ఓ రంగయ్యో , పాడ ఓయి భార తీయుడా , రెండూ శ్రీ శ్రీ గారి పాటలు , అప్పటికే

రాజకీయాలు ఆలా ఉంటే ఇక ఇప్పుడు చెప్పుకునేది ఏముంటుంది. కల కానిది విలువైనది. ఘంటసాల. గారి

పాట కూడా. నిరాశ తో. నిస్పృహ చెంద కుండా పోరాడాలి

అని తెలిపే పాట బ్రతుకు. విలువ తెలిపే. పాట .


శివ గోవిందా పాట లో జీవిత సత్యాలు చెప్తారు. పెండ్యాల గారి సంగీతం . ఓ రంగయో లో యుగ ళ గీతం

అయినా ఆ కార్మికులు ను చూసి వేదన చెందినట్టు పాడటం బాగుంటుంది.

కాలేజీ స్టూడెంట్స్ పాట , హాయి హాయిగా , చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు ఆని పాపాయి బోసి

నవ్వులు కు స్వామ్యం ఎంత అందం గా ఉంటుందో


ఈ పాటలు రాసింది ఎవరో తెలియదు కానీ వీనుల విందు గా వుంటాయి. ,


సావిత్రి రంగా రావు గారిని ఏ సినిమా లో అయినా సొంత తండ్రి కూతురు ని చూసినట్లే వుంటుంది.

ఇద్దరు మిత్రులు సినిమా 1961 లో వచ్చింది. పాటలు రేడియో లో విన్నా కానీ సినిమా మాత్రం లిబర్టీ లో మార్నింగ్ షో లో చూసాను. చక్కటి పాటలు, సున్నితమైన హాస్యం ఎక్కడ విసుగు లేకుండా చక చకా సాగి పోతుంది..

సాలూరి గారి సంగీతం లో డ్యూయెట్ పాటలు హుషారుగా వుంటాయి. భజన పాట , ఇంక వీణ పాట


పాడవే ల రాధికా , ఏ రాగమో తెలియదు కానీ , వింటూ ఉంటే వెన్నెల వెలుగులు పరిచినట్టు వుంటుంది,

చెప్పానుగా ఆ రోజుల్లో వాళ్లకి ఒక నాలుగు చెట్లు , ఒక చంద్రుడు ఉంటే చాలు , పాట షూటింగ్ కి

ఎక్కడికీ వెళ్ళే పని లేదు , మహా అయితే బృందావన్ గార్డెన్స్ వెళ్ళే వారు ఏమో.


ఈ సినిమా లో మాత్రం. యు గళ గీతాలు కిద్వాయి గార్డెన్స్ లో తీశారు ఆని ఇక్కడ

ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవారు.

ఈ సినిమా లో చక్కటి హాస్యం రమణ రెడ్డి రేలంగి గారెలు తింటం , సూర్య కాంతమ్మ, పద్మ నాభం

మొదట తండ్రికి భయ పడ్డా చివరికి రేలంగి ని ఎదిరించి హీరో లాగా చేయటం బాగుంటుంది.


సినిమా యూట్యూబ్ లో ఉంది ఎక్కడ విసుగు రాకుండా చూడటానికి, పాటలు వినటానికి హాయి గా

వుంటుంది.

చదువుకున్న అమ్మాయిలు సినిమా 1963 లో వచ్చింది ట బహుశా అప్పుడే చూసి వుంటాను.

ఈ స్టోరీ మొదలు ఆ సినిమా పాట తోనే కదా , వినిపించని రాగాలే ,

ఈ సినిమా తెలుగు రచయత్రి శ్రీదేవి గారి నవల ట , నేను ఆ నవల చదవ లేదు. సినిమా మాత్రం

మంచి పాటలు , సాలూరి వారి సంగీతం లో వినటానికి హాయి గా వుంటాయి.


పాడవోయి భారతీయుడు లాగానే ఇందులో కూడా ఒక డాన్స్ పాట ఈ. వి సరోజ నాగేశ్వరరావు

తో హుశారుగా వుంటుంది..


ఒకటే హృదయం కోసం, కిలకిల నవ్వులు, డ్యూయెట్ , ఆడవాళ్ళ కోపం లో మంచి పాటలు వున్నా

మధురమైన రాగం లో సాగే వినిపించని రాగాలే కే ఫస్ట్ ప్రైజ్ నా దృష్టిలో.

ఈ సినిమాల మధ్యలో వచ్చిన ఆరాధన సినిమా జగపతి వారి సినిమా ఈ సినిమా కూడా బెంగాలీ వారి కథ

మంచి కథ , సాలూరి వారి సంగీతం లో మంచి పాటలు వున్నాయి.


నా హృదయంలో నిదురించే చెలీ, వెన్నెల లోని వికాసమే వెలిగింతు ను నీ కనులా బాగా

గుర్తు వున్నా పాటలు. ఈ సినిమా కూడా టీ వి లో రాలేదు. యూ ట్యూబ్ లో వున్నది.


కాలేజీ లో చదువుకునే టప్పుడు అరోజుల్లో అబ్బాయిల ఫే వ రె ట్ పాట నా హృదయం లో నిదురించే చెలీ . క్లాసు రూమ్ నుండీ

ఏ బోటనీ, జూయాలజీ ల్యాబ్ కి వెళ్తుంటే మా వెనక ఈ పాట తప్పకుండా

వినిపిస్తూ ఉండేది.

మాకేమి ఇల్లు లేదా, వీళ్ళ హృదయం లో నిద్ర పోవటానికి ఆని నవ్వుకునే వాళ్ళము.

మద్రాస్ లో జూ పార్క్ లో ఒక పాట ఈ సినిమా లో వున్నట్లు గుర్తు.


ఆ రోజుల్లో నే వచ్చిన సినిమా పూజ ఫలం ఈ సినిమా మునిపల్లి రాజు గారి పూజారి నవల ట

ఈ సినిమా గుర్తు రాగానే జమున , ఎస్ జానకి గారి పాట పగలే వెన్నెల గుర్తు వస్తుంది.


కానీ సుశీల గారి మూడు పాటలు, కృష్ణ శాస్త్రి గారి రాసినవి చాలా విన సొంపు గా వుంటాయి.


అందేనే ఈ చందమామ, ఎందు దాగి ఉన్నా వో బృందా విహారి, ఇది చల్లటి వేళ అయినా నిదుర

రాదు కనులకు, అన్నీ కృష్ణ శాస్త్రి గారి విరజాజి పరిమళం లాంటి పాటలు .

చక్ర భ్రమణం నవల తో తీసిన డాక్టర్ చక్రవర్తి , అన్నీ మంచి పాటలు అయినా , నీవు లేక వీణా కే

ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. సాహిత్య పరంగా మనసున మనసై పాట లో వంటరి తనము

లో వుండే భాధ ని ఆత్రేయ గారు రాస్తే ఘంటసాల గారు తన కంఠం లో బాగా పలికించారు .


ఈ మౌనం ఈ బిడియం పాట కూడా ఫాస్ట్ గా వింటే హాయిగా వుంటుంది.


పూల రంగడు ఇంగ్లీష్ నవల బియాండ్ థిస్ ప్లేస్ ఆధారంగా తీసిన కథ ట ముళ్ల పూడి గారు

కథ తయారు చేస్తే సంభాషణ లు రంగ నాయకమ్మ గారు రాశారుట

ఆవిడ సినిమాలు కు రాసినట్లు నాకు తెలియదు. ఇప్పుడే గూగుల్ చెప్తూ వుంది.


ఈ సినిమా లో హిట్ అయిన రెండూ పాటలు విజయ నిర్మల కి , సుశీల గారు పాడిన

నీవు రావు నిదుర రాదు, చిగురులు వేసిన కలలన్నీ , సాలూరి గారి సంగీతం లో బాగా హిట్

అయినాయి.

ఇంకా కొన్ని ఆ పాత మధురాలు గురించి మరలా చెప్పు కుందాము.

ఈ లోపల కొన్ని పాటలు హాయిగా వింటూ వుండండి


ఇదివరకు వివిధ భారతి లో హమేష జవా గీత్ ఆని వచ్చేది. ఇప్పుడు వస్తున్నదో లేదో తెలియదు.

ఆలా మనం వింటూ ఉంటే అవీ యూ ట్యూబ్ లో ఆలా నిలిచి వుంటాయి ఆని నేను అనుకుంటాను

శుభ రాత్రి

























































.

 
 
 

Recent Posts

See All
అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు.

ఈ రోజు యూ ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే శిరీష కొమ్మరాజు గారు పాడిన వినిపించ ని రాగాలే పాట వచ్చింది. ఆవిడ ఎక్కువ గా పాత పాట లు పాడుతూ వుంటారు . ఆ పాట కూడా చాలా హాయిగా పిల్ల తెమ్మర లాగ

 
 
 
శ్రీ రామ నవమి

ఈ రోజు రామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం పుట్టిన రోజు నాడే జరుగుతుంది.. పూర్వం తాటాకు పందిర్లు వేసి వీధి వీధికి కళ్యాణం చేసే వారు. వారం రోజులు ఉత్సవాలు ఘ నంగా జరిపే వారు.. ఇప్

 
 
 
టెలిఫోన్ నుంచి సెల్ఫోన్ కీ.

పూర్వం రోజుల్లో పుస్తకం హస్త భూషణం అనే వారు. ఎవరైనా ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటే వాడు ఒక పుస్తకాల పురుగు అనే వారు. ఇప్పుడు అయితే సెల్ ఫోన్ హస్త భూషణం అనాలి . అందరూ ఆ అర చేతిలో స్వర్గం కి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page