top of page
murthydeviv

నేను నా నోములు 12

మా విజయ అక్కయ్య ఒక యోగి లాగా జీవించేది వాళ్లింటికి ఎపుడూ ఎవరో ఒకరు వస్తుండే వాళ్ళు అందరూ ఆమ్మ వారి భక్తులే మా పెద్దమ్మ కూడా ధనుర్మాసం పూజ చే సేది తెల్లవారు ఝామున 4గంటల కు లేచి చేసేది రామ కోటి పుస్తకాలు రాసేది కోటి రామ నామం పూర్తి చేసింది కోటి నామాలు పూర్తి చేస్తే భద్రాచలం లో పట్టాభిషేకం చేయిస్తారు అపుడు మా అమ్మ గారిని అత్తగారిని తీసుకొని వెళ్ళారు పెద్దమ్మ కూడా చాలా పుస్తకాలు చదివేది ఎవరు వచ్చినా చాలా అప్యాయంగా మాట్లాడేది ఏదో ఒకటి చేసి పెట్టేది ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నాను అంటే మన పెద్ద వాళ్ళు అంత చదువుకోక పోయినా వాళ్ళ పరిధి లో వాళ్ళు అందరికీ సహాయం చేసేవారు నాకు మా పెద్దమ్మ ఇంకో అమ్మ లాగా ఎన్నో సహాయాలు చేసింది మా అమ్మ తరువాత నేను ఆమె ను అమ్మ లాగా గౌరవిస్తాను అలా నేను వెళ్ళినపుడు అక్కయ్య స్నేహితురాలు అల్లాడి లలిత గారు అనే ఆవిడ వచ్చారు ఆవిడ కూడా గురువు గారి శిష్యు రాలు అక్కయ్య తో పాటు చాలా యాత్ర లు చేశారు నవరాత్రులు పూజల్లో ఆవిడ ను చాలా సార్లు కలిశాను చాలా అప్యాయంగా మాట్లాడే వారు అక్కయ్య ఇంట్లో ఎపుడూ అమ్మ వారి గురించి పూజలు గురించి మాట్లాడు కోవటం మే వేరే కబుర్లు ఏమీ వుండవు లలిత గారు అక్కయ్యి తో విజయా మీ చెల్లెలి చేత గురువు గారు మన చేత చేయించిన ఖడ్గ మాల శుద్ధ శక్తి మాల పూజ చేయించా వా అని అడిగారు అక్కయ్య ఆవిడతో మా చెల్లెలు పెద్ద కుటుంబం ఎపుడు ఎవరో ఒకరు వస్తుంటారు ఆ పూజ కు చాలా టైం పడుతుంది 15 రోజులు చేయాలి రోజూ నైవేద్యం లు ప్రత్యేకంగా చేయగలుతుందో లేదో అన్నది సరే నాకు ఆ పూజ గురించి తెలుసుకుందాము అనిపించింది లలిత గారు వెంటనే ఆ పూజ గురించి ఎక్సప్లెయిన్ చేశారు ఖడ్గ మాల అమ్మ వారి నామాలు అవే నామాలు శివ పరంగా చదివి త్రిశతి లో వుండే వొక్కక అక్షరం తో వుండే నామాలతో సంపుటికరణ చేసి 15రోజులు చేయాలి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చేస్తారు 15 రోజుల కు త్రిశతి నామాలు పూర్తి అవుతాయి రోజు కు ఒకే నైవేద్యము వుంటుంది ఖడ్గ మాల కు రోజు కు ఒక మకుటం వుంటుంది వాళ్ళు వసంత నవరాత్రుల లో చేశాము అని చెప్పారు లలిత గారు చెప్పా క నాకు ఒకసారి చేద్దామని అనిపించింది ఇక్కడ నాకు త్రిశతి ఖడ్గ మాల గురించి నాకు తెలిసింది కొంచెం చెప్తాను ఖడ్గ మాల నామాలు చదివేటపుడు నమః అనకుండా పొడి గా చదవకూడదు ఈ విషయం నాకు చాలా మంది చెప్పారు ఇక లలిత త్రిశతి అంటే పంచ దశి మంత్రం అంటే అమ్మ వారి స్వరూపం శంకరాచార్యుల వారు త్రిశతి నామాలు కు భాష్యము రాశారు సహస్రనామ స్తోత్రం కు రాయలేదు నా అదృష్టం ఆ భాష్యం నేను చదివాను కేవలము. అమ్మ వారి దయ వుంది అనుకుంటాను ఈ పంచదశి మంత్రము మీద ఒక చక్కటి పాట మా పుట్టింట్లో మా పెద్దమ్మ అక్కయ్య లు పాడే వారు అప్పట్లో అర్థం తెలియదు పంచసీమంత అని పాడే వాళ్లం మేము ఎంతపొరపాటు గా పాడే వాళ్లం అనిపిస్తుంది అసలు పంచదశి మంత్ర పావన కారి వే సంచిత ప్రాగ్జన్మ అని వుంటుంది అంటే పంచదశీ మంత్ర స్వరూప వైన నీవు మా సంచిత పాప కర్మలను హరించు అని పాట చాలా బాగుంటుంది ఎవరు రాశారో తెలియదు కానీ మా ఇంట్లో పెద్ద వాళ్ళు పాడే వారు త్రిశతి నామాలు ఎలా పడితే అలా చదవ కూడదు ఏ నవరాత్రి అయినా పంచమి నాడు చదివితే మంచిది ఇవ్వన్ని నేను గురువు గారీ దగ్గర కొన్ని అక్కయ్య దగ్గర తెలిసుకున్నాను సరే ఇంక లలిత గారు చెప్పిన పూజ నేను చేయాలని సంకల్పం చేసుకున్నాను అక్కయ్య వసంత నవరాత్రుల లో చేస్తే మంచి ది అని చెప్పింది అయితే నేను ఎపుడు చేశానో గుర్తు లేదు కానీ మాఘ మాసం 2000. సంవత్సరం లో చేసినట్లు గుర్తు ఒక్క సారే చేశాను చేసినపుడు ఇంకో సారి చేద్దాం అనుకున్నాను కానీ మరల చేయలేక పోయాను పూజ వివరాలు రేపు

36 views0 comments

Recent Posts

See All

మా అత్తయ్య గారి తోట 1

మా మూడో అంతస్తు అంటే ఎంత క్రేజ్ ఉండే దొ ఆ తోట అంటే కూడా మ మాకు చాలా ఇష్టం వుండేది ఉదయాన్నే తోటలో వెళ్ళి ఆటలు మొదలు పెట్టమంటే ఇంక మా...

నేను చదివిన ఆద్యాత్మిక పుస్తకాలు

ఈ విషయము గురించి రాసేది ఏముంటుంది అని నేనే అనుకుంటాను మనం కొన్ని పూజలు చేస్తున్నపుడు అష్టోత్తర సహస్ర నామాలు చదువుతున్నపుడు ఏవో అనుమానాలు...

మా మూడో అంతస్తు 4

ఆ రోజుల్లో సినిమా చూసీ వస్తె ఆ సినిమా అంతా డ్రామా లాగా ఎనాక్ట్ చేసే వాళ్లం మా మూడో అంతస్తు మాకు థియేటర్ లాగా వుండేది అప్పట్లో వచ్చిన...

Comentários


bottom of page