ఆవకాయ ప్రహసనం
- murthydeviv
- 32 minutes ago
- 4 min read
ఏభయి ఏళ్ల క్రితం హైదరాబాద్ కి ఉగాది పండుగ కు పెర్మనెంట్ గా పంజాబ్ నుంచీ వచ్చేసాము. షరా మాములుగా పంజాబ్ లో ఫ్రైండ్స్ తో బ్రిడ్జ్ ఆట తో కళ కళ లాడే మా ఇల్లు , ఇక్కడ అన్నయ్యలు, వాళ్ళ తో బ్రహ్మచారుల అయిన వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆదివారాలు కళ కళ లాడుతూ ఉండేది.
అప్పటికి గ్యాస్ స్టవ్, కుక్కర్లు, మిక్సీలు వచ్చాయి. అందుకని వంట ఏమీ కష్టం
అనిపించేది కాదు.
అందులో వారం రోజులు హోటల్ తిండి తినే వాళ్లకు హాయిగా గొంగూర, చింత కాయ, కంది పచ్చడి వేసి పెడితే అమృతం లాగా తినే వాళ్ళు.
వున్నట్టుండి మా వారికీ అద్భుతమైన ఆలోచన వచ్చి ఇక్కడ మామిడి కాయలు
చవక , అవకాయ పెట్టు అన్నారు.
అదేదో చాలా తే లికై న పని లాగా , నేను
చాలా అమాయకంగా మొహం పెట్టి
నాకు అసలు ఆవకాయ లో ఏమీ వేస్తారో కూడా తెలియదు, నాకు చేత కాదు.
కానీ పక్కన వున్న మా అన్నయ్య పెద్దమ్మ, అక్కయ్య వున్నారు కదా, వాళ్ళు ని అడిగి పెట్టు అనీ ఒక ఉచిత సలహా ఇచ్చాడు.
ఈ బావ బావ మరదుల మధ్య చిక్కుకున్నాను అనీ మూ లుగుతూ అక్కయ్య
దగ్గరికి బయలు దేరాను.
మా పెద్దమ్మ కూతురు , బావగారు మలక్ పేట లో వుండే వారు
మా పెద్దమ్మ కూడా వాళ్లతోనే వుండే వారు.
అరోజుల్లో మామిడి కాయలు ఓల్డ్ సీటీ శాలి బండ దగ్గర దొరికేవి.
నేనూ అక్కయ్య ఉదయాన్నే వెళ్ళాము కాయలు కోసం, మేము చాలా గొప్పగా వంద కాయలు బేరం ఆడాము. అక్కయకు కూడా కావాలి కదా అనీ.
మేము బేరం ఆడుతూ ఉండగానే ఆ కాయల వాడు రెండు చేతులతో లెక్క పెడుతూ రెండు వందల కాయలు బుట్టలో వేసేశాడు.
వాళ్ళు రెండు చేతులతో లెక్క పెట తారు ట , వేసిన కాయలు వెనక్కి తీసుకోరుట, వాడి ఉర్దూ మనకు అర్థం కాదు, మన హిందీ వాడు అర్థం చేసుకోడు
ఇంక చేసేదేమి లేక సగం కాయలు ముక్కలు కొట్టించుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ యింటికి వచ్చాము. వంద కాయలు ఆవకాయ మా పెద్దమ్మ కూడా ఎప్పుడూ పెట్టలేదు.
ఈ ముక్కల కి సరిపోయే కారాలు, నూనె పెద్ద జాడీలు కోసం అక్కయ్య మరలా బజారు కెళ్ళింది.
మా పెద్దమ్మ ఎక్కడ వున్నా చుట్టు పక్కల వాళ్లతో స్నేహం గా ఉండేది..
అం దరికి భారత, భాగవతం లు చదివి విని పిస్తూ ఉండేది.
ఆ బ్యాచ్ బామ్మ గార్లు వచ్చేసి ఆ ముక్కలు చూసి కొంచెం ఆశ్చర్యం ప్రకటించి,
వెంటనే నడుం బిగించి , పరవాలేదు పిన్ని గారు కొంచెం పెసర ఆవకాయ ,
నీళ్ల ఆవకాయ , మిగతా ఆవకాయ పెడ దాము అనీ చెప్పారు.
ఆవకాయ కలుపుకుని నెయ్యి బదులు ఎర్రటి నూనె తో తినే మావారు, అన్నయ్య గుర్తు వచ్చారు..
నేను నసుగుతూ ఆవకాయ నీళ్లతో పెడితే మా వారు వప్పుకోరండి అన్నాను.
ఆవిడ నా వై పు చూసి ఎందుకమ్మా మీ చదువులు నీళ్లతో ఆవకాయ వుంటుందా అనీ ఎదురు ప్రశ్న వేసింది.
సరే ఈ ఆవకాయ గురించి తినటం తప్పితే మనకు ఏమీ తెలియదు అనే
జ్ఞానం తెచ్చుకుని నోరు మూసుకుని ఆ బామ్మగార్లు చెప్పినట్లు
సహాయం చేశాను. పెసరపప్పు కొద్దిగా వేయించి పొడి చేసి అవపిండి బదులు అ పొడి కారం ఉప్పు వేసి పెసర ఆవకాయ , అవ పిండిలో కొద్దిగా వేడి నీళ్లు పోసి. తర్వాత కారం ఉప్పు కలిపి నీళ్ల ఆవకాయ, మిగతా ముక్కలు తో
మాములు అవకాయ పెట్టి జాడిల్లో కి ఎక్కించి ఊపిరి పీల్చుకున్నాము.
మిగతా వంద కాయల్లో కొన్ని ఆ బామ్మ గార్లకు పంచి మిగతా కాయలు మగాయ ముక్కలు తరిగి ఆవకాయ యజ్ఞం పూర్తి చేసాము.
వాళ్ళ సహాయంతో పెట్టిన అవకాయలు అమ్మ గారికి ఇస్తే ఎప్పుడూ వంట ఇంటి మొహం చూడని నా కూతురు ఎన్ని విద్యలు నేర్చుకున్నది
అనీ మా అమ్మ గారు సంతోషించారు. అబ్బో గ్రాడ్యుయేట్ అయినా మా కోడలు ఈ పనులు కూడా చేస్తుం దా అనీ మా అత్త గారు కూడా సంతోషించారు.
మా వాళ్ళ కి తెలియని ఈ పెసర ఆవకాయ, నీళ్ల ఆవకాయ పెట్ట టం లో ఎక్సపెర్ట్ ని అయిపోయాను..
కానీ ప్రతి ఏడాది ఆవకాయ పెట్టేటప్పుడు మా పెద్దమ్మ ను, నన్ను చివాట్లు
పెట్టిన బామ్మ గారిని తప్పకుండా తలచు కుంటూ వుంటాను.
కానీ ప్రతి ఏడాది ఆవకాయ పెట్టటం ఒక యజ్ఞం లాగా ఉంటుంది.
ఇంకా కొన్ని ఆవకాయ కబుర్లు తో ఇంకొక సారి .
శుభ రాత్రిఏభయి ఏళ్ల క్రితం హైదరాబాద్ కి ఉగాది పండుగ కు పెర్మనెంట్ గా పంజాబ్ నుంచీ వచ్చేసాము. షరా మాములుగా పంజాబ్ లో ఫ్రైండ్స్ తో బ్రిడ్జ్ ఆట తో కళ కళ లాడే మా ఇల్లు , ఇక్కడ అన్నయ్యలు, వాళ్ళ తో బ్రహ్మచారుల అయిన వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆదివారాలు కళ కళ లాడుతూ ఉండేది.

శుభ రాత్రి
Comments